Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 24.12.2021
Share:

By Village Missionary Movement

Friday, 24-Dec-2021

దిన ధ్యానము(Telugu) 24.12.2021

 

అంశం:- నడిపించే నక్షత్రం.

 

"వారు ఆ నక్షత్రమును చూచి, అత్యానందభరితులై యింటిలోనికి వచ్చి" - మత్తయి 2:10

 

రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తరువాత అమెరికా దేశంలో ఒక తండ్రి కుమారుడు సాయంకాలపు సమయంలో నడుస్తూ వెళ్తున్నారు. ఆ చిన్న బాబు చుట్టూ ఉన్న ఇల్లును చూసి నాన్న ఇక్కడ అందరి ఇంట్లో నక్షత్రం గుర్తు ముద్రించబడి ఉంది ఎందుకు అని అడిగాడు. అందుకు తండ్రిగారు ఈ ఇంట్లో ఉన్న వాళ్ళలో ఎవరైనా ప్రపంచ యుద్ధంలో పాల్గొని ఉండి ఉంటారు కాబట్టి అమెరికా ప్రభుత్యం వీళ్ళను గౌరవించే విధముగా ఈ నక్షత్రం వాళ్ళ ఇంట్లో ముద్రించారు అని జవాబు అన్నారు. ఇంకను కొన్ని ఇళ్లల్లో మాత్రం బంగారు రంగులు నక్షత్రం ముద్రించ బడిఉంది. దానికి గల కారణాన్ని ఆ తండ్రి వివరించారు. ఈ ఇంటి వారు యుద్ధంలో తమ ప్రాణాన్ని తమ దేశం కొరకు త్యాగం చేసిన వారు ఇందువలననే ప్రభుత్వం వారి ఇంటిలో బంగారపు రంగులో నక్షత్రాన్ని ముద్రించి వాళ్లను గౌరవించారన్నారు. ఇంకను చీకటి కమ్ముతుంటే కొంచం దూరం వెళ్లిన తరువాత ఇండ్లు లేని ఒక ఖాళీ స్థలము లోనికి నడుచుకొని వచ్చారు. అప్పుడు ఆ బాలుడు ఆకాశాన్ని చూసి ఒక నక్షత్రం మెరుస్తూ ఉండుట చూచి నాన్న ఆకాశంలో అనేక నక్షత్రాలు ఉన్నాయి అన్నాడు. అందుకు తండ్రి ఇలా చెప్పాడు దేవుడు తన ఏకైక కుమారుడైన యేసుక్రీస్తుని పాపములో ఉన్న ప్రజలను రక్షించుటకు ఈ లోకానికి పంపించి ఇంతగా లోకాన్ని ప్రేమించారు అని అన్నారు.

 

మన బైబిల్లో కూడా ఒక నక్షత్రం ధారి చూపిస్తుంది అది జ్ఞానులకు త్రోవ చూపించిన నక్షత్రమే. అది వాళ్ళను తిన్నటి మార్గంలో నడిపిస్తూ వెళ్ళింది. వారి యొక్క ప్రయాణం రాత్రి సమయంలోనే చేసి ఉండేవారు. అయినను వారు చలి అని చూడకుండా ఎలాంటి పరిస్థితిలోనైన యేసయ్యను కనుగొని తనను తమ కానుకలను సమర్పించారు. 

 

ప్రియమైన వారలారా! పైన చెప్పబడిన సంఘటన నుండి దేవుడు మనకు నేర్పిస్తున్న సత్యం ఏమిటి అంటే ఆ జ్ఞానులు ఆకాశం వైపు చూసి నప్పుడు వాళ్ళను నక్షత్రం ఎంత తిన్నగా నడిపించిందో అలాగే పరలోకాన్ని తెరిచూస్తున్న మనకు కుడా దేవుడు మంచి మార్గదర్శిగా ఉండి వెళ్ల వలసిన పరలోకం అనే గమ్యానికి కచ్చితంగా మనలను తీసుకు వెళ్తారు. పైన మనం చూసిన యుద్ధ వీరులు ఆ దేశ చట్టాన్ని వెంబడించి నప్పుడు ఆ దేశము గొప్ప వాళ్లకు గొప్ప ఘనతను ఇచ్చి గౌరవించింది అలానే మనము మన దేవుని ఆజ్ఞలను పాటించినప్పుడు దాని కంటే శ్రేష్ఠమైన నిత్య మహిమను ఇచ్చుటకు ఆయన శక్తిమంతుడై యున్నారు. హల్లెలూయా! ఆమెన్.

- బ్రదర్. ఎస్. మనోజ్ కుమార్

 

ప్రార్థన అంశం:-

క్రిస్మస్ ప్రత్యేకమైన కార్యక్రమాలు జరుగుతున్న ఈ దినాల్లో మంచి వాతావరణం కొరకు ప్రార్ధించండి.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al holiganbet jojobet jojobet matbet jojobet giriş jojobet güncel giriş matbet matbet giriş imajbet imajbet giriş coinbar coinbar giriş klasbahis klasbahis giriş coinbar coinbar giriş restbet giriş restbet egebet güncel giriş egebet coinbar giriş coinbar klasbahis güncel giriş klasbahis klasbahis giriş klasbahis restbet restbet giriş superbetin superbetin giriş perabet perabet giriş grandpashabet grandpashabet giriş grandpashabet güncel giriş grandpashabet grandpashabet giriş grandpashabet giriş güncel holiganbet holiganbet giriş casibom casibom giriş jojobet jojobet giriş marsbahis marsbahis giriş perabet perabet giriş meritking meritking giriş meritking meritking giriş matbet matbet giriş superbetin superbetin giriş kingroyal kingroyal giriş kralbet kralbet giriş jasminbet jasminbet giriş madridbet madridbet giriş marsbahis marsbahis giriş sekabet sekabet giriş casibom casibom giriş kingroyal kingroyal giriş perabet perabet giriş casibom casibom giriş jojobet jojobet giriş grandpashabet grandpashabet giriş marsbahis marsbahis giriş holiganbet holiganbet giriş elexbet elexbet giriş deneme bonusu veren siteler jojobet jojobet casinoroyal grandpashabet bahiscasino holiganbet radissonbet betgit holiganbet jojobet casinomilyon grandpashabet amgbahis tambet Sonbahis Sonbahis giriş Hiltonbet Hiltonbet giriş meritking meritking giriş meritking meritking giriş holiganbet pusulabet matbet marsbahis casibom alobet alobet giriş atlasbet atlasbet giriş jojobet jojobet giriş