Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 23.12.2021
Share:

By Village Missionary Movement

Thursday, 23-Dec-2021

దిన ధ్యానము(Telugu) 23.12.2021

 

అంశం:- హృదయ పూర్వక శుభాకాంక్షలు.

 

"సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన కిష్టులైన మనుష్యులకు భూమిమీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను" - లూకా 2:14

 

ప్రపంచ దేశాల్లో క్రిస్మస్ కార్యక్రమాలు అనేక విధాలుగా జరుగుతున్నాయి. ఉగ్రయిన్ దేశంలో క్రిస్మస్ కార్యక్రమాలు ఆశక్తితో జరిగిస్తుంటారు. వీళ్ళ యొక్క క్రిస్మస్ కార్యక్రమాలు భిన్నంగా ఉంటాయి. బేత్లెహేము పశువుల పాకను గుర్తు చేసుకొనే విధంగా ఎండు గడ్డి గల కట్టలను భోజనపు బల్ల పైన పెట్టుకుంటారు. వాళ్ళు యొక్క క్రిస్మస్ ప్రార్థన చేసిన తరువాత ఆ కుటుంబ యజమానుడు అయిన తండ్రి క్రీస్తు జన్మించెను అని శుభాకాంక్షలు తెలియపరుస్తారు. కుటుంబీకులు అందరూ కూడా దానికి ప్రత్యుత్తరముగా మనము ఆయనను మహిమ పరుద్దాము అని చెబుతారు. ఇలాగు క్రిస్మస్ శుభాకాంక్షలను కుటుంబంలో ఒకరి కొకరు చెప్పకొంటారు. 

 

క్రిస్మస్ శుభాకాంక్షలు అన్నది ఏదో ఇతరులకు మాత్రం చెప్పుకున్నది కాదు. క్రిస్మస్ శుభాకాంక్షలు మన ఇంట్లో ఉన్న వాళ్ళతో కూడా పంచుకోవాలి. ఆయన ఇష్టులైన మనుష్యులకు సమాధానం అనే శుభాకాంక్షలలో మన కుటుంబీకులు కూడా ఉన్నారు. ఇలాగు మనము ఒకరి నొకరు క్రీస్తు నిమిత్తముగా శుభాకాంక్షలను ఇచ్చి పుచ్చుకోవాలి. ఇలా ఉంటే కుటుంబంలో ప్రేమ సంతోషం నిండి ఉంటుంది. విడిపోయిన కుటుంబాలు, విడిపోయిన బంధాలు వీటన్నింటినీ సరిచేసుకోవాల్సిన సమయం ఈ క్రిస్మస్ కాలమే. క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పకూడదు అని కొందరు వాదిస్తూ ఉంటారు. అది వాళ్ళ వరకు అలాగే ఉండనివ్వండి. కానీ మనము అయితే మన యొక్క శుభాకాంక్షలను పంచుకుందాం.

 

దేవుని కుమారుడును రక్షకుడైన యేసుక్రీస్తు ఈ భూలోకంలో జన్మించిన దానిని పరిచయం చేసినప్పుడు దేవదూతలు సువర్తతో పాటు శుభాకాంక్షలు కూడా తెలియ పరిచారు. కాబట్టి యేసుక్రీస్తు యొక్క జన్మను ఒకరి కొకరు పంచుకొని శుభాకాంక్షలు చెప్పుకోనుడి.

- బ్రదర్. పి.జాకబ్ శంకర్

 

ప్రార్థన అంశం:-

గెత్సేమనే క్యాంపస్ లో జరుగుతున్న వైద్య సేవలు ద్వారా అనేక ఆత్మలు మరియు శరీరములు స్వస్థత పొందుకున్నట్లు ప్రార్దిద్ధాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al holiganbet giriş holiganbet casibom bets10 extrabet royalbet süperbetin casibom giriş betcio jojobet giriş casibom milanobet piabellacasino betpas bahiscasino atlasbet holiganbet giriş casibom giriş bahiscasino ngsbahis betplay holiganbet jojobet casibom holiganbet jojobet