Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 12.01.2021
Share:

By Village Missionary Movement

Tuesday, 12-Jan-2021

దిన ధ్యానము(Telugu) 12.01.2021

శ్రమలయందు సంతోషం.

"సకల జనములకు సువార్త ముందుగా ప్రకటింపబడవలెను" - మార్కు 13:10

సాధు సుందర్ సింగ్ అనేక గ్రామములకు వెళ్లి యేసుక్రీస్తు నామమును ప్రకటించడం వలన అనేకమంది యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించారు. దేవుడు సుందర్ సింగ్ ని బలముగా వాడుకున్నారు. సువార్త నిమిత్తము అనేక మంది హింసించినప్పుడు ఆయన సంతోషముతోను, సహనముతోను ఉండుట చూచినప్పుడు అనేక మంది ఆయన యొక్క సువార్తను అంగీకరించుటకు ముందుకు వచ్చారు. ఒక మారు ఒక గ్రామునకు వెళ్లి అక్కడ ఉన్న చెట్టుక్రింద కూర్చొని పాటలు పాడటం మొదలుపెట్టారు. వెంటనే పెద్ద గుంపు గుమికూడింది. కాని అక్కడ యేసుక్రీస్తును గురించి అక్కడ మాట్లాడుటను విన్న ఒకాయన అతని మీద కోప పడ్డారు. మూర్కముగా సాధు సుందర్ సింగ్ ను కొట్టడం వలన అతని శరీరం అంతా గాయములతో నిండిపోయాయి. ముఖమునుండి రక్తం కారడం ప్రారంబించింది. అన్ని అవమానములను సహించి లేచి సాత్వికముతో ఆ ప్రజల యొక్క క్షమాపణ కొరకు ప్రార్ధించి లేచి ప్రభువు యొక్క ప్రేమను ప్రకటించడం ప్రారంభించారు. దీనిని చూచిన అనేకులు క్రీస్తుమీద విశ్వాసం పెట్ట సాగారు. 

మనం బైబిల్లో చూస్తున్నప్పుడు అపోస్తులకార్యములు 5వ అధ్యాయంలో అపోస్తులు యేసుక్రీస్తు గురించి ప్రజలకు ప్రకటించుట వలన అనేక మంది స్త్రీలు, పురుషులు విశ్వాసం గల వారిగా మారి ప్రభువు యొద్దకు చేర్చబడ్డారు అని చదువుతున్నాం. అప్పుడు ప్రధాన యాజకులు అపోస్తులను పిలిపించి వాళ్ళను కొట్టి యేసుక్రీస్తు నామము ప్రకటించకూడదు అని ఆజ్ఞపించారు. వారు అవమాన పరచబడినప్పటికి దానిని వాళ్ళ సంతోషంగా స్వీకరించి అక్కడ నుండి బయలుదేరి ప్రతిరోజు దేవాలయములోను, ఇళ్లలోను యెడతెగక యేసుక్రీస్తును ప్రకటిస్తువున్నారు. దాని ద్వారా అనేకమంది యేసుక్రీస్తును తమ సొంత రక్షకునిగా అంగీకరించారు. 

ప్రియమైన వారలారా! మనలను హింసిస్తున్న వ్యక్తులు రక్షించబడాలి అని మనం ప్రయాస పడుతున్నామా? వాళ్ళ కొరకు ప్రార్థిస్తున్నామా? అందరూ రక్షించబడాలి, సత్యాన్ని ఎరగాలి అని ఆయన చిత్తం అని 1తిమోతి 2:4 లో వ్రాయబడి ఉంది. సాధు సుందర్ సింగ్ వలె, అపోస్తులు వలె జీవితంలో మనం శ్రమలు సంతోషంగా అంగీకరించి ఎదుర్కొని యేసుక్రీస్తు గురించి ఇతరులకు చెబుదాం. ఆయన పరిచర్యను ఇంకను ఉత్సాహంగా చేద్దాం ఆయన ఖచ్చితంగా మనలను దీవిస్తారు. 
-    బ్రదర్. పి. స్టీవ్ మాధ్యు 

ప్రార్థన అంశం:-
ప్రార్థన గుడారపు కట్టడ పనులకు అవసరమైన ఆర్ధిక అవసరతలు తీర్చబడేటట్లు ప్రార్థిద్దాం. 

ఈ దిన ధ్యానవాక్యం కొరకు ఈ క్రింద నoబర్లును సంప్రదించండి
వాట్సాప్ తమిళ్ కొరకు +91 94440 11864, 
ఇంగ్లీష్ కొరకు +91 86109 84002, 
హిందీ కొరకు +91 93858 10496
తెలుగు +91 94424 93250

ఈమెయిల్: reachvmm@gmail.com
Androidapp: https://play.google.com/store/apps/details?Id=com.vmmorg.template.msmapp&showAllReviews=true

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al perabet perabet giriş safirbet safirbet giriş betasus betasus giriş virüsbet medusabahis medusabahis giriş grandpashabet grandpashabet giriş jojobet jojobet giriş vaycasino vaycasino giriş pusulabet pusulabet giriş perabet perabet giriş perabet perabet giriş matbet slot oyna perabet perabet giriş hiltonbet perabet perabet perabet betnano holiganbet galabet kalebet holiganbet