Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 14.12.2021
Share:

By Village Missionary Movement

Tuesday, 14-Dec-2021

దిన ధ్యానము(Telugu) 14.12.2021

 

అంశం:- ఎక్కడ భద్రత?.

 

"హేరోదురాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడ యెరూషలేము వారందరును కలవరపడిరి" - మత్తయి 2:3

 

యేసుక్రీస్తు యొక్క జన్మ చరిత్రలో హేరోదు రాజు గురించి చదువుతున్నాం. ఈయన రోహమా ప్రభుత్వం చేత ఇశ్రాయేలీయుల దేశమును పరిపాలించుటకు నియమించబడ్డా రాజు. ఈయన కాలంలో అనేకమైన గుడులు, దేవాలయాలు కట్టబడ్డాయి. అన్నింటికీ పైగా యెరూషలేము దేవాలయమును బ్రమ్మాడంగా పునర్ నిర్మాణము చేసాడు. వీటన్నింటినీ చేసింది భక్తి వలన కాదు ఒక రాజకీయ నాయకుని వలె ప్రజలను ఆకర్షించుటకు చేయబడినది. ఈ హేరోదు రాజు యేసుక్రీస్తు యొక్క జన్మ గురించి విన్నప్పుడు కలత చెందాడు. దాని వలన రెండు సంవత్సరాలు గల మగ పిల్లలను చంపి వేయమని ఆజ్ఞ పించాడు అని చదువుతున్నాం. ఎందుకు ఆ చిన్న పిల్లలను చంపే అంత భయపడాలి? ఆయన లెక్కప్రకారం ఆ శిశువు పరిపాలనకు రావాలి అంటే సుమారు 20 సంవత్సరాలు అవుతుంది కదా. 

 

హేరోదు చరిత్ర ఇంకను పరిశీలించి చూస్తే ఆయన శిశువులను మాత్రం కాదు తన యొక్క భర్యలను, సొంత బిడ్డలను, తన అత్తను, తన మామయ్యను చంపి వేసాడు అని ఈ పట్టిక కొనసాగుతూనే వెళ్తుంది. వాటికి ఆధారము WWW.Britanica.com biography of Herod king of Judiah. ఈ హత్యలకు గల కారణం ఏమిటి? ఆయనకు ఉండిన భద్రత లేని మనస్తత్వమే. 

 

దేశానికి రాజుగా కోటలో సైనికుల మధ్యలో ఉండినప్పటికి భయముతో నిండిన హేరోదు జీవితం చూసాము. కాని దావీదు రాజు జీవితం గమనించిన యెడల తన సొంత కుమారుడే ఇతనిని హత్య చేయుటకు తరుముతున్న పరిస్థితిలో ఆయన ఎలాంటి మనస్తత్వంలో ఉన్నారు అని కీర్తన 3లో మనం చదవగలం. ఆయనకు వ్యతిరేకంగా ఒక సైన్యమే వచ్చిన నేను భయపడను అను చెప్పడంతో పాటు నేను ప్రశాంతంగా పడుకొని నిద్రపోతాను అని విజయము గూర్చి చెప్పుచున్నాడు. ఒక పక్క భవనంలో బెదిరిపోయి ఉంటున్న హేరోదు మరియొక పక్క భయపడవలసిన పరిస్థితుల్లో ధైర్యముగా ఉన్న దావీదు. 

 

ఇది ఎలాగూ అంటే అదే కీర్తన 3:3లో చదువుతున్నాం. దావీదు దేవున్ని తన నిరీక్షణగా ఉంచుకోవడమే దానికి గల కారణం. అవును మన జీవితంలో భద్రత భావం డబ్బుగాని, పదవి గాని ఆస్తులు గాని ఇవ్వలేవు. దేవుని మీద ఎంతగా విశ్వాసం పెట్టుకొని ఉన్నామో అంతగా భద్రత భావంతో జీవిస్తాం. ధనమే భద్రత అని సమ కూర్చుకొని పెట్టుకున్న వాళ్ళు భయపడుతూ వారి యొక్క చివరి దినములను గడిపిన దానిని మన దేశంలో చూస్తున్నాం. ఈ క్రిస్మస్ దినాల్లో మనం కూడా ప్రభువుని నమ్మి మన జీవితాన్ని సమర్పిద్దాం ప్రషాంతంగా జీవిద్దాం.

- బ్రదర్. జె.సంతోష్

 

ప్రార్థన అంశం:-

వెయ్యి మంది కూర్చొని దేవున్ని ఆరాధించ గలిగే ప్రార్థనా గుడారపు పనులలో దేవుని హస్తం తోడుగా ఉండు లాగున ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al holiganbet giriş holiganbet casibom bets10 extrabet royalbet süperbetin casibom giriş betcio jojobet giriş casibom milanobet piabellacasino betpas bahiscasino atlasbet holiganbet giriş casibom giriş bahiscasino ngsbahis betplay holiganbet jojobet casibom holiganbet jojobet