Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 12.12.2021 (Kids Special)
Share:

By Village Missionary Movement

Sunday, 12-Dec-2021

దిన ధ్యానము(Telugu) 12.12.2021 (Kids Special)

 

విల్లేజ్ మిషనరీ మూవ్మెంట్ వారీ కిడ్స్ స్పెషల్

 

"యెహోవావలననే నాకు సహాయము కలుగును ఆయన భూమ్యాకాశములను సృజించినవాడు" - కీర్తనలు 121: 2

 

హాయ్ పిల్లలు క్రిస్మస్ అంటేనే అందరికి సంతోషమే కదా. పశువుల పాక, క్రిస్మస్ ట్రీ వాటి యొక్క అందమే వేరే. మీ ఫ్రెండ్స్ ఇంటికి వెళ్లి వాటిని చూసి జాలిగా ఉంటారు కదా. కాని ఎటువంటి సదుపాయం లేకుండా కష్టపడేవారు ఉంటారు కదా? వారికి ఏం మార్చిపోకుండా సహాయం చెయ్యాలి సరేనా. సరే కధ విందమా? 

 

ఒక అందమైన గ్రామంలో ఒక కుటుంబంలో సుజి, సెల్వి అనే ఇద్దరు పిల్లలు ఉండేవారు. వారి యొక్క తండ్రి మిలిటరీ సైన్యంలో ఉండటం వలన మాటి మాటికి అతనిని చూడటం అవ్వదు. నాన్న లీవ్ లో ఇంటికి వచ్చినప్పుడల్లా సుజి మరియు సెల్వితో జాలిగా అడుకొనేవారు. కావాల్సినవి అన్ని కొని ఇస్తారు. కానీ కొన్ని నెలల నుండి తండ్రి యొద్ద నుండి ఫోన్ గాని లెటర్ గాని డబ్బులు గాని రాకపోవడంతో అమ్మే పనికి వెళ్లి పిల్లల్ని పోషిస్తూ వచ్చారు. డబ్బులు క్రిస్మస్ చేయుటకు, డెకరేషన్ చేయుటకు సరిపోలేదు. అమ్మ చాలా బాధపడ్డారు. సెల్వికి అమ్మ కొరకే ఆలోచించి జ్వరం కూడా వచ్చేసింది. మందులు కొనడానికి కూడా డబ్బులు లేకపోవడంతో ఎవరి దగ్గర సహాయం అడగాలి అని అమ్మ చాలా ఆలోచిస్తూ ఉన్నారు. వెంటనే సుజి ఇలా చెప్పింది యేసయ్య యొద్ద సహాయం అడుగుదాం అని వెంటనే అందరూ విశ్వాసంతో ప్రార్థన చెయ్యడం మొదలు పెట్టారు. జరిగిన ఆశ్చర్యం ఏమిటి అంటే సెల్వి ఉదయమునే లేచి ఆడుకోవడం మొదలుపెట్టింది. జ్వరం కూడా తగ్గిపోయింది. ఇంకా క్రిస్మస్ కు రెండు రోజులే ఉన్నాయి. పిల్లలకు కొత్త డ్రెస్ కూడా కొనలేదు అని ఆలోచింది చాలా బాధ పడ్డారు. అప్పుడు యేసయ్య నిశ్చయముగా మన ఆవసరతలు తీర్చుతారు బాధపడవద్దు అని సుజి చెప్పిన వెంటనే యేసయ్య తనతో మాట్లాడినట్లు అనిపిస్తుంది అమ్మకు. ఆ రోజు కుటుంబ ప్రార్ధనలో సుజి ప్రార్థన చేసింది మీరు కూడా కుటుంబ ప్రార్థన చేస్తారు కదా? ఉదయమునే లేచిన వెంటనే తలుపు తట్టిన శబ్దం వచ్చింది. తలుపు తెరిచి చూస్తే నాన్న నిలబడి ఉన్నారు. చేతిలో కొత్త బట్టలు, బహుమతులు, వస్తువులు చాలా తీసుకు వచ్చారు. పిల్లల సంతోషమునకు హద్దులే లేవు. అమ్మ కనులు మూసుకొని అవసరమైన సమయంలో నా ఆవసరతలు అన్ని తీర్చారు మీకు కృతజ్ఞతలు అనిచెప్పారు. కుటుంబము అంత అలయమునకు వెళ్ళి క్రిస్మస్ ను సంతోషంగా జరుపుకున్నారు.

 

ఏంటి పిల్లలు మీరుకుడా నాకు డ్రెస్ కొనలేదు, నాన్నకు ఉద్యోగం లేదు మాకు సహాయం చేయుటకు ఎవ్వరు లేరు అని బాధ పడుతున్నారా? కలత చెందుతున్నారా? బాధపడవద్దు. భూమికి వచ్చిన లోక రక్షకుడు మన ఆవసరతలు తీర్చకుండా ఉంటారా? నిశ్చయముగా తీర్చుతారు. మీ దృష్టి అంతా ప్రభువైన యేసు క్రీస్తు పైనే ఉండాలి సరేనా. మీ అందరికి హ్యాపీ క్రిస్మస్.

- సహోదరి. ఏ. బ్యూల గారు

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al holiganbet giriş holiganbet casibom bets10 extrabet royalbet süperbetin casibom giriş betcio jojobet giriş casibom milanobet piabellacasino betpas bahiscasino atlasbet betpas casinoroyal bahiscasino ngsbahis betplay holiganbet jojobet casibom holiganbet jojobet casibom vaycasino romabet