Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 11.12.2021
Share:

By Village Missionary Movement

Saturday, 11-Dec-2021

దిన ధ్యానము(Telugu) 11.12.2021

 

అంశం:- ఆతిత్వరలో సమాధానం.

 

"కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు" - కీర్తనలు 126:5

 

క్రీస్తుని ఎరుగని స్వర్ణకారుడు ఒకడు ఉండేవాడు. అతడు ఏ మనుష్యుడు కూడా నా దగ్గర క్రీస్తు గురించి చెప్పలేడు. నేను వారితో వాదిస్తే వారు నోరు మూసేస్తారు అని సవాళ్లు విసురుతూ చెబుతున్నాడు. దానిని ఏరిగిన అదే ఊరికి చెందిన వయస్సు మించిన సంఘ పెద్ద ఒకరు ఈ వ్యక్తి గురించి భారం కలిగి తన భార్యతో కలిసి ప్రార్ధించే వాడు. ఒక రోజు ఏకపక్షంగా ఆ మనుష్యుని కలుసుకొనుటకు వెళ్ళినప్పుడు స్నేహితుడా నేను నా భార్య నీ కొరకు ప్రార్థిస్తున్నము అని ఆయన చెప్పినప్పుడు హృదయంలో ఉన్న భారంతో తన కన్నులు కన్నీటితో నిండిపోయాయి. అంతకు మించి అతను ఏమి మాట్లాడలేకపోయారు. ఈ సంఘ పెద్ద మాటలు మరియు కన్నీటితో నిండిన కన్నులు స్వర్ణ కారుని హృదయం కదిలించాయి. మళ్ళీ మళ్ళీ సంఘ పెద్ద యొక్క ఓటమి అతని కన్నుల ముందు కనబడుట వలన నేరుగా అతని ఇంటికి వెళ్లి నా మనస్సులో ఏదో మార్పు కలిగింది మరల మరల కన్నీటితో నిండిన మీ కన్నులు నా కన్నుల ముందుకు వస్తున్నాయి అని మనస్సులో ఉన్నది అంత చెప్పి ఏడ్చాడు ఆ స్వర్ణ కారుడు. అది మాత్రమే కాదు తనను తాను తగ్గించుకొని మోకాళ్ళు పై ఆ సంఘ పెద్దకు నమస్కరించాడు. హద్దులు లేని దేవుని సమాధానము మరియు ఓదార్పు అతని హృదయంలో నిండింది. ఆ రోజే క్రీస్తుని తన సొంత రక్షకునిగా అంగీకరించాడు. 

 

ప్రియమైన వారలారా! మనము కూడా మన చుట్టూ పక్కల ఉన్న వారందరికీ క్రీస్తు యేసు యొక్క ప్రేమను తెలియజేయాలి అని ఆశ పడుతున్నాం. అదే సమయంలో ఆ ఆత్మల గూర్చి భారంతో కన్నీటితో ప్రార్ధించుట మనం తప్పినట్లు అయితే వారి హృదయంలో ఏ మార్పు కలుగదు. మన ప్రయత్నాలు అన్ని కూడా ఉపయోగం లేకుండా పోతున్నాయి. యేసుక్రీస్తు కూడా ప్రజల మారుమనస్సు కొరకు తండ్రి వైపు చూస్తూ భారంతో కన్నీటితో ప్రార్ధించారు అని పరిశుద్ద గ్రంధంలో మనం చదువుతున్నాం. మనం కూడా ప్రార్ధించి కార్యం జరిగించినప్పుడు ప్రభువు ఆవకాశములు కలిగించి ప్రజలు యేసుని ఏరిగిన జ్ఞానంతో నింపబడి కన్నులు తెరవబడి ఆ సువార్త అనేది వారి హృదయంలో కార్యం జరిగించుటకు పరిశుద్ధాత్ముడు సహాయం చేస్తాడు. మనం చాటుగా గదులలో విడుస్తున్న కన్నీరుకు మన దేవుడు కచ్చితంగా బదులు ఇస్తారు. ఆమెన్

- శ్రీమతి. జబా ఖని శేఖర్ గారు

 

ప్రార్థన అంశం:

బైబిల్ కాలేజ్ మరియు సేవకుల కొరకు సభలలో చేస్తున్న వుడ్ స్టీమర్ బోయిలెర్ కొనుటకు 4 లక్షలు అవసరం దాని కొరకు ప్రార్దిద్ధాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al virüsbet medusabahis medusabahis giriş grandpashabet grandpashabet giriş jojobet jojobet giriş vaycasino vaycasino giriş pusulabet pusulabet giriş perabet perabet giriş perabet perabet giriş matbet slot oyna perabet perabet giriş hiltonbet perabet perabet perabet betnano holiganbet galabet kalebet holiganbet kingbetting kingbetting giriş lunabet lunabet giriş rulobet betpas atlasbet grandpashabet