Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 10.12.2021
Share:

By Village Missionary Movement

Friday, 10-Dec-2021

దిన ధ్యానము(Telugu) 10.12.2021

 

అంశం:- పరలోకపు నిధులు.

 

"తమ పెట్టెలు విప్పి, బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి" - మత్తయి 2: 11

 

యేసుక్రీస్తు బేత్లెహేములో బాలుడిగా జన్మించినప్పుడు తూర్పు నుండి జ్ఞానులు వచ్చి ఆయనకు నమస్కరించి విలువైన వస్తువులను యేసుక్రీస్తు కు సమర్పించి తమ సమర్పణను వ్యక్తపరిచారు. అవన్నియు భూమి పైన విలువైన వస్తువులు మరియు రాజులు, దొరలు ఉపయోగించే వస్తువులు. అవి భూలోకంలో చాలా విలువ కలిగినప్పటికి పరలోకం దృష్టిలో భిన్నమైనవి అనేది. మనము ఇప్పుడు తెలుసుకుందాం.

 

1. నశించే బంగారం, నశించని విశ్వాసం. 

మనం భూమిలో కూర్చుకొన్న ఏ వస్తువులైన కచ్చితంగా నశించిపోతాయి. కాని మన హృదయంలో ఉన్న విశ్వాసపు కార్యములు అనేవి భూమి పై మనకు ఉత్తమమైన ఫలము కలుగ జేయుట మాత్రమే కాకుండా పరలోకమునకు మనలను తీసుకు వెళ్లుటకు శక్తి గలవై యున్నవి. ఆ విశ్వాసం అనేది మనలను నిశ్చయముగా సిగ్గుపరచదు. 

 

2. సాంబ్రాణి అయిన ప్రార్థన.

భూమి ఆకాశమును సృజించిన దేవుడు నా ప్రార్థన ద్వారా కార్యములు చెయ్యాలి అని అనుకుంటున్నారు అనేది ఎంత పెద్ద మేలుకరమైన ఆశీర్వాదం. కాని ఈ రోజుల్లో భూమిపైన ఉన్న మనుష్యుల యొద్ద లేదా వస్తువుల యొద్ద ప్రత్యేకంగా సెల్ ఫోన్ వద్ద వ్యర్థం చేస్తున్న సమయం దేవుని యొద్ద గడుపుటకు చాలా వరకు ఆశ లేదు అనేది చాలా చాలా బాధాకరమైన విషయం. 

 

3. భోళం అనే శిలువ

భోళం అనేది ప్రతి క్రైస్తవునికి తమ చేతుల్లో తీసుకోవలసిన సిలువను సూచిస్తుంది. అది మాత్రమే కాదు లోక సంపదకు లోబడకుండా పరలోక మహిమకు లోబడి క్రీస్తు యొక్క సువాసనను ఇతరులకు బయలు పరిచేలా అవుతుంది. 

 

ప్రియమైన వారలారా! మనం పైన విన్న విశ్వాసం, ప్రార్థన, సిలువ వంటి జీవితం అనేది పరలోకపు అత్యుత్తమమైన నిధిగా కనబడుతుంది. అందువలన ఈ క్రిస్మస్ రోజుల్లో ఇటువంటి గుణాతిశయములను పొందుకొనుటకు ప్రార్థిద్దాం ఆ తరువాతే పరలోకంలో సందడి చేసే నిధిగా మారుదాం. ఆమెన్

- బ్రదర్. ఎస్. మనోజ్ కుమార్ గారు

 

ప్రార్థన అంశం:-

ఒడిశా రాష్ట్రంలో గల గ్రామాలలో ప్రత్యేక కార్యక్రమాల ద్వారా విశ్వాసుల యొక్క బంధువులకు సువార్త ప్రకటించబడేలా ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al holiganbet giriş holiganbet casibom bets10 extrabet royalbet süperbetin casibom giriş betcio jojobet giriş casibom milanobet piabellacasino betpas bahiscasino atlasbet betpas casinoroyal bahiscasino ngsbahis betplay holiganbet jojobet casibom holiganbet jojobet casibom vaycasino romabet