By Village Missionary Movement
Wednesday, 08-Dec-2021దిన ధ్యానము(Telugu) 08.12.2021
అంశం:- ఇలా ఉండగలరా?
"అతడు కేకలు వేయడు అరువడు తన కంఠస్వరము వీధిలో వినబడనియ్యడు" - యెషయా 42: 2
చెన్నై లోని ప్రఖ్యాతి గాంచిన మథర్ థెరిసా హాస్పిటల్లో వాలెంటీర్ టీం కూడా ఉంది. అది ఊహించని సమయాల్లో, విపత్తులలో, ప్రజలు అల్లాడుతున్న సమయాల్లో వారికి సహాయం చేయుట కొరకు స్వార్థం లేకుండా ఏ విధమైన ప్రతి ఫలమైన ఆశించకుండా చేసే పని అది. ఇక్కడ ఉన్న వాలెంటీర్లు వారి యొక్క పేర్లను స్వచ్చందంగా ఎఫ్. ఏం.పి.బి వ్యవస్థాపకుడు యొక్క తల్లి పెట్రిక్ జార్జ్ యొద్ద నమోదు చేయించు కున్నారు. అకస్మాత్తుగా ఒక రోజు చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ లో ఎవరో సృహ తప్పి పడిపోయి ఉన్నారు. వారికి సహాయం అవసరం అని సమాచారం వచ్చింది. అది విన్న కొన్ని సెకెన్లలోనే తమ ద్విచక్ర వాహనము తీసుకొని చెన్నై రైల్వేస్టేషన్ కు వెళ్లిన ఒక వాలెంటీర్ అంతకు ముందే అక్కడ ఉన్న ముగ్గురు వ్యక్తులతో కలిసి సృహ తప్పి ఉన్న వ్యక్తికి ప్రధమ చికిత్స చేసి అతనిని హాస్పిటల్లో చేర్చుకొని సహాయం చేసాడు. తగిన సమయంలో సహాయం అవసరమైన వారికి సహాయం చెయ్యగలిగాను అనే మనస్సు తృప్తితో ప్రక్కనే ఉన్న ముగ్గురి యొద్ద సర్ మీరు ఏం చేస్తుంటారు అని అడిగాడు అందుకు అతను నేను జిల్లా కలెక్టర్ అని అన్నాడు.
క్రీస్తు యేసు కూడా పరలోక మహిమను విడిచి భూలోకమునకు వినయము, విధేయత, బానిసగా వంటి రూపం ధరించుకొని పశువుల తొట్టెలో ఏవిధమైన అధికారం, ఆర్భాటం, ఆడంబరం, వసతి లేకుండా మనుష్యులను రక్షించుటకు వచ్చారు. రాజాది రాజైన యేసుక్రీస్తు సింహాసనము మీద కూర్చోలేదు. ఈరోజు మనం మన గురించి ఆలోచిద్దాం. పశువుల తొట్టెలో. పరుండిన రాజాది రాజుకు ముందు వీధుల్లో పరుండి ఉన్న వివక్షతను చూసి హాస్పిటల్ కు తీసుకు వెళ్లి సహాయం చేసిన జిల్లా కలెక్టర్ ముందు మనం ఎలా ఉన్నాం. విద్యను, అంతస్తును, అధికారమును మనస్సు లోనికి తీసుకొని వచ్చి గర్వంగా కనిపిస్తున్నమా? లేదా భువికి వచ్చి ఉదయించిన రక్షకుని వలె విధేయతతో కనబడుతున్నమా? అది మాత్రమే కాదు యేసుక్రీస్తు అపవాది చేత పీడింప బడిన వారందరిని స్వస్థపరచుచు సంచరించు చుండెను అని అపోస్తుల కార్యం 10: 38 వ వచనంలో వ్రాయబడి ఉన్నది. త్రోవ పక్కన పడిఉన్న వారిని చూసి తప్పించు కొని వెళ్లిపోయిన పరిసయ్యుడు, లేవీయుడు వలె కాకుండా మంచి సమరయుని వలె సహాయం చేసే మనస్సు కలిగి ఉండి యేసుక్రీస్తు వలె మనము కనిపించుటకు ప్రయాస పడదాం.
- శ్రీమతి. జాస్మిన్ పాల్ గారు
ప్రార్థన అంశం:-
బైబిల్ కాలేజ్ విద్యార్థులు ఉండుటకు కట్టబడుతున్న బిల్డింగ్ త్వరగా కట్టాలి అని మరియు ఆవసరతలు సంధింపబడేటట్లు ప్రార్థిద్దాం.
*Whatsapp*
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.
ఈమెయిల్: reachvmm@gmail.com
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250