Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 03.12.2021
Share:

By Village Missionary Movement

Friday, 03-Dec-2021

దిన ధ్యానము(Telugu) 03.12.2021

 

అంశం:- విధవరాలి ఆశ.

 

"యెనుబది నాలుగు సంవత్సరములు విధవరాలైయుండి, దేవాలయము విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్లు సేవచేయుచుండెను" - లూకా 2:37

 

అన్ని రకముల సంతోషములను కోల్పోయాను. వయస్సు అయిపోయింది ఇక పై నేను ఏం చేయగలను. దేవునికొరకు నేను ఏం చెయ్యగలను అనే నిట్టూర్పుతో ఉన్న స్త్రీల మధ్యలో యవ్వనమును కోల్పోయి ఆరోగ్యము క్షిణించి శరీరం చిక్కిపోయి జీవితం పైన ఉన్న పట్టు అంత కోల్పోయినప్పడు కూడా దేవుని సేవ చేయగలం అని సవాలు విసురుతున్నారు ఈ 84 సంవత్సరాల వయస్సు గల అన్న. ఈమె ఎవరు యేసు బాలుడ్ని మొట్ట మొదటిగా దేవాలయమునకు తీసుకోని వచ్చినప్పుడు అదేసమయంలో ఆమె కూడా వచ్చి యేసుక్రీస్తు బాలుడ్ని చూసి కొనియాడిన ప్రవక్తి. క్రీస్తు యొక్క జననమును కనిపెట్టి ఆమె కన్నులారా చూచి అనందించిన అన్న ఒక ప్రార్థన విరురాలు. ఏడు సంవత్సరాలు పెనిమిటితో సంసారం చేసిన స్త్రీ. తన పిల్లలను గూర్చి పరిశుద్ద గ్రంధంలో ఏమియు వ్రాయబడలేదు. అన్న ఆ నాటి వరకు చేస్తూ వచ్చిన పనులను పరిశుద్ధాత్ముడు ఒకే వచనములో చాలా చక్కగా వ్రాసి ఉంచారు. దేవాలయమును విడువని విధవరాలు అని పనులు బాధ్యతలు అధికముగా లేకపోవడంతో ఇరుగుపొరుగు వారి ఇంటిపనులు అడిగి చేస్తూ విమర్శించ బడుతున్న విధవరాలు అయిన అన్న ఎక్కడికి వెళ్ళకుండా దేవాలయములోనే ఉంది. ఎంత అద్భుతమైన సాక్ష్యమో చూడండి. 

 

మా అవ్వ రాగ్ ల్యాండ్ మిషనరీ అయ్య శివ కాశి లో సేవ చేసిన దినములలో యేసుక్రీస్తు ను అంగీకరించిన వారు. తన యొక్క భర్త అయిన వడివేల్ మురుగన్ చేత దెబ్బలు తిన్నప్పటికి అలయమునకు వెళ్లడం ఆపలేదు. నాకు ఏం జరిగినా సరే దేవాలయమునకు వెళ్ళాలి అనే వారి ఆశ పిల్లల పిల్లలు అయిన మమ్ములను పట్టుకుంది. ఈవిధంగా దేవాలయమును ప్రేమించే ఒక సంతతి అభివృద్ధి చెందుటకు వారి భక్తి మరియు ప్రార్ధనే కారణం. 

 

దీనిని చదువుతున్న మీరు దేవాలయమును మరియు దేవుని ప్రసన్నతను ఆశిస్తున్నారా? యవ్వన కాలంలో మరియు మధ్య వయస్సులో కూడా ఉపవాసము ఉండాలి అని ఆలోచిస్తూన్న మనకు ఉదాహరణగా 84 సంవత్సరాలు వయస్సు నిండిన విధవరాలైన ఆ స్త్రీ రాత్రింబవాళ్ళు ఉపవాసము ఉండి ప్రార్ధించి దేవున్ని కొనియాడారు అని మనం చదువుతున్నాం. మనము నిజముగా దేవున్ని ప్రేమించే వారిగా ఉన్నట్లు అయితే నశించిపోతున్న ఆత్మల కొరకు భారంతో ఉపవాసం ఉండి ప్రార్ధించుటకు ఈరోజే తీర్మానం తీసుకుందాం. 

 

ప్రియమైన వారలారా! మనం కూడా అన్న వలె నిజాయితీగా దేవున్ని ప్రేమిద్దాం. వయస్సు అయిపోయింది అని ఇంట్లోనే కూర్చోన కుండా ప్రార్థిస్తూనే ఉందాం. మెసయ్య అయిన యేసుక్రీస్తు మూలముగా రక్షణను ప్రకటిద్దాం. ఆవిధంగా జీవించుటకు దేవుడు మనకు సహాయం చెయ్యును గాక! ఆమెన్.

- శ్రీమతి. జబా డేవిడ్ గణేషన్ గారు.

 

ప్రార్ధన అంశం:-

హోమ్ పిల్లల కలశాల ఫీజులు కట్టలేదు ఈ నెల లోపు అవి కట్టెల ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al