Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 01.12.2021
Share:

By Village Missionary Movement

Wednesday, 01-Dec-2021

దిన ధ్యానము(Telugu) 01.12.2021

 

అంశం:- లోపల బయట.

 

"నిజమైన వెలుగు ఉండెను; అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది" – యోహాను 1: 9

 

నేను క్రీస్తుని ఎరుగని కుటుంబంలో పుట్టి పెరిగిన వాడిని. నేను ఉన్న ఊరిలో ఒకటో రెండో క్రైస్తవ కుటుంబములు ఉండేవి. డిసెంబర్ నెల అంత వాళ్ళ ఇళ్లల్లో వేలాడదీసిన రంగురంగుల నక్షత్రాలు మరియు క్రిస్మస్ ట్రీలను చూసి నేను చాలా సంతోషించే వాడిని. ముఖ్యముగా కేరళకు చెందిన ఒక ఉపాధ్యాయుని కుటుంబం నన్ను మరియు నాతో కూడా ఉన్న కొంత మందిని తమ ఇంటికి పిలిచి కొన్ని తియ్యని బండరాలు ఇచ్చి చక్కగా క్రిస్మస్ పాటలు పాడి ప్రార్థన చేసి పంపించే వారు. చిన్న వయస్సులో జరిగిన ఈ సంఘటనను చాలా రోజులుగా నా మనస్సులో దాచుకొని గుర్తు చేసుకొని సంతోష పడేవాడిని. ఎప్పటికైనా మా ఇంట్లో స్టార్ కట్టాలి అని మనస్సులో ఆశ పడే సంభవాలు చాలా ఉన్నాయి. కాని నేను క్రిస్టియన్ కాదు. కొన్ని సంవత్సరాలు గడిచాయి దేవుడైన యేసు నా హృదయ వాంఛ తీర్చారు. లోకానికి వచ్చి మనుష్యులను వెలిగించిన నిజమైన వెలుగు అయిన యేసుక్రీస్తు నా హృదయం లోనికి వచ్చారు. 

 

ఒక నక్షత్రం యాకోబులో ఉదయించెను అని మనం చదువుతున్నాం. మునుపు ఈ నక్షత్రంనకు బయట ఉండేవాడిని. ఇప్పుడు నక్షత్రం అయిన యేసులో వున్నాను. నాలో ఉన్న పాప చీకటి తొలగి మహిమ గల వెలుగులో నిలిచి ఉండే కృపను దేవుడు నాకు ఇచ్చారు. ఇప్పుడు నాకు ప్రతి రోజు క్రిస్మసే. 

 

దీనిని చదువుతున్న మీ అందరిని యేసుక్రీస్తు చాలా అధికముగా ప్రేమిస్తున్నారు. మీరు క్రైస్తవుని వలె లేదా ఎవరి వలె ఉన్న సరే మీరు సంతోషంగా ఉండాలనే ఆశ పడుతున్నారు. యేసుని జన్మమును ప్రకటించే సువార్తలొ ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోష కరమైన సువార్తమానము నేను మీకు తెలియ జేయుచున్నాను. ఆ సంతోష కరమైన వెలుగు అయిన యేసు క్రీస్తు మనలో ఉన్నట్లయితే జీవితం అంత వెలుగుతో సంతోషంతో నింపబడుతుంది. ఈ క్రిస్మస్ రోజుల్లో ఈ వార్త మూలముగా యేసు మిమ్ములను పిలుస్తున్నాడు. మీరు ఆయన చెంతకు రండి. మీరు ఆ వెలుగుకు బయటఉండకండి లోపలకు రండి ప్రతి రోజు క్రిస్మసే రండి సందడి చేద్దాం. 

- బ్రదర్. పి.జాకబ్ శంకర్ గారు

 

ప్రార్థన అంశం:-

ఈ నెల అంత జరిగే పరిచర్యలో దేవుని హస్తం తోడై ఉండు లాగున ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al holiganbet giriş holiganbet casibom bets10 extrabet royalbet süperbetin casibom giriş casibom jojobet giriş casibom milanobet piabellacasino betpas bahiscasino atlasbet betpas casinoroyal bahiscasino ngsbahis betplay holiganbet jojobet casibom holiganbet jojobet casibom vaycasino romabet