By Village Missionary Movement
Sunday, 28-Nov-2021దిన ధ్యానము(Telugu) 28.10.2021 (Kids Special)
విలేజ్ మిషనరీ మూవ్మెంట్ తరుపున చిన్న పిల్లల స్పెషల్.
"యెహోవా ఉత్తమమైనదాని ననుగ్రహించును మన భూమి దాని ఫలమునిచ్చును" - కీర్తనలు 85: 12
హాలో పిల్లలు! అందరూ ఎలా ఉన్నారు? వర్షాకాలం వచ్చేసింది కదా! జాలీగా ఉంటుంది. వర్షంలో స్నానం చెయ్య వచ్చు, ఆడుకోవచ్చు వర్షం అంటే మీ అందరికి ఇష్టం కదా? సరే మనం కథ విందమా?
దురై అనే చిన్న తమ్ముడు చురుకుగా అమ్మ చెప్పే మాటలు వినే పిల్లాడిలా ఉండేవాడు. ఒక రోజు దురై ను అమ్మ పక్క వీధిలో ఉన్న షాప్ కి సామాన్లు కొనుటకు పంపించారు. షాప్ కి వెళ్లడం, అమ్మకు సహాయం చెయ్యడం అంటే దురై కి చాలా ఇష్టం. మీరు కూడా అమ్మకు హెల్ప్ చేస్తారా? వెరీ గుడ్. దురై షాప్ కి వెళ్లి తిరిగి వచ్చే సరికి పెద్ద వర్షం ఎక్కువగా రావడంతో తడుచు కుంటూనే ఇంటికి వచ్చాడు. దానిని చూసిన అమ్మకు చాలా బాధగా అనిపించింది. దురై కి జలుబు చేస్తుంది అని తన తలను చక్కగా తుడిచి కాఫీ పెట్టి ఇచ్చింది. నాన్న ఇంటికి రాగానే గొడుగు తెమ్మని చెప్పారు. నాన్న దురై ని కూడా షాప్ కి వెళదాం రా అని పిలవడంతో చాలా సంతోషంగా బయలుదేరాడు దురై. పిల్లలు మీకు కూడా షాపింగ్ కు వెళ్లడం అంటే చాలా ఇష్టం కదా? నాన్న నేరుగా గొడుగులు అమ్మే షాప్ కి తీసుకు వెళ్లారు. దురై వేగంగా వెళ్లి విజయ్ తో స్టైల్ గా ఉన్న గొడుగును ఎంచుకున్నాడు. కాని నాన్న మాత్రం బ్లాక్ ఉన్న స్ట్రాంగ్ ఉన్న పెద్ద గొడుగును తెచ్చి బిల్ వేసేసాడు. తాతయ్య గొడుగులా ఉంది అని ప్రెండ్స్ అందరూ హేళన చేస్తారు అని దురైకి చాలా బాధ అనిపించింది.
ఒక రోజు ట్యూషన్ కి వెళ్ళడానికి బయలు దేరుతున్నప్పుడు అమ్మ చెప్పింది గొడుగును కూడా తీసుకొని వెల్లు అని. ఆ పెద్ద గొడుగును తీసుకు వెళ్లడం దురైకి అస్సలు ఇష్టం లేదు . కానీ అమ్మ చెప్పారు అని తీసుకొని వెళ్లారు. ట్యూషన్ పూర్తి అయిన వెంటనే గాలి తుఫాను రావడం మొదలు పెట్టింది. ఫ్రెండ్స్ దగ్గర ఉన్న స్టైల్ గొడుగులు అన్ని ఎగరడం మొదలు పెట్టాయి. కొంత మంది గొడుగులు అయితే వంగిపోయాయి. దురై యొక్క పెద్ద గొడుగు మాత్రం స్ట్రాంగ్ గా ఉంది. ఫ్రెండ్స్ అందరూ దురై యొక్క పెద్ద గొడుగు దగ్గరకు వెళ్లి తడిచి పోకుండా ఇంటికి వెళ్లారు. దురైకి చాలా సంతోషం. వెంటనే దురై నాన్న దగ్గరకు వెళ్లి నాన్న నాకు నచ్చిన స్టైలిష్ గొడుగు ఇచ్చి యుంటే సంతోష పడి ఉంటాను కాని అది నాకు ఉపయోగ కరంగా ఉండేది కాదు. మీరు చేసింది ఏదైనా నా మేలు కొరకే నాన్న అని చెప్పి నాన్నకు ముద్దు పెట్టాడు.
ప్రియ తమ్ముడు చెల్లి అదే విధంగా యేసయ్య మనకు ఏం చేసినా అది మీ దృష్టికి సరైనది కాదు అని పించ వచ్చు కాని అదే మీకు సరైనదిగా ఉంటుంది. మేలు చేస్తున్న దేవునికి ఎప్పుడు కృతజ్ఞతలు తెలియ జేస్తూనే ఉండాలి. ఓకేనా.
- సహోదరి. ఏ. బ్యూలా.
*Whatsapp*
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.
ఈమెయిల్: reachvmm@gmail.com
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250