Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 27.10.2021
Share:

By Village Missionary Movement

Saturday, 27-Nov-2021

దిన ధ్యానము(Telugu) 27.10.2021

 

అంశం:- శ్రమలు కూడా పరవసమే

 

"పౌలును సీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచునుండిరి" - అపో.కార్యములు 16:25

 

భారతీయ రక్తపు పాదముల అపోస్తులుడు అని చెప్ప గలిగే సాధు సుందర్ సింగ్ నేపాల్ దేశంలో గల గ్రామీణ ప్రజల మధ్యలో సువార్త ప్రకటిస్తూ ఉండేవారు. ఆదేశంలో సువార్త కు ఆటంకములు కలిగే పరిస్థితిలో అతనిని చెరసాలలో బంధించారు. చెరసాలలో కూడా ఖైదీలకు క్రీస్తు ప్రేమను గూర్చి చెప్పుటకు తన సమయాన్ని దారబోశారు. అతనిని కొట్టి సమీపంలో ఉన్న పశువుల పాకలో అతని కాళ్ళను చేతులను ఒక కర్రకు కట్టేసి అతనిపై గొంగళి పురుగులను వదలడం వలన అవి అతని రక్తమును పీల్చేశాయి. అందువలన అతని బలము క్షీణించింది. అయినప్పటికీ అ అధికమైన బాధను కూడా అధిగమించి ప్రార్ధించడం, స్తుతించడం మొదలు పెట్టారు. అతనిని చూసిన వారందరు అతనికి బుర్ర పాడైపోయింది అని అతనిని విడుదల చేసారు. ఆయన అంత బలహీనతగా ఉన్నాడు ఆయన పక్క వీధిలో నిలబడి సువార్తను ప్రకటించడం మొదలు పెట్టారు. చెరసాలలో అతని యొక్క అనుభవం చెప్పి నప్పుడు క్రీస్తు యొక్క ప్రసన్నత నాతో కూడా ఉండడం వలన అది నాకు దీవెన కరంగా ఉంది అన్నారు. అది నాకు మోక్షం వలె ఉంది అని ప్రకటించారు. 

 

ఫిలిప్పి పట్టణములో పౌలు సీలయు క్రీస్తు యొక్క సువార్తను ప్రకటించినప్పుడు అక్కడ ఉన్న రోమియులు అంగీకరించుటకైనను, చేయుటకైనను కూడని ఆచారములను ప్రకటించు చున్నారు అని వారిని కొట్టి వస్త్రములను చింపి వారిని చెరసాలలో పెట్టి వారిని భద్రముగా కనిపెట్ట వలెనని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించారు. అతను వారిని చెరసాలలో వేసి వారి కాళ్ళకు బొండ వేసి బిగించాడు. శ్రమను, శరీర బలహీనతలు ఉన్నప్పటికి వారు దేవునికి ప్రార్ధించి కీర్తనలు పాడారు. దేవుని శక్తి వలన చెరసాల పునాదులు అధిరాయి. వారు కట్టిన కట్లు అన్ని ఊడిపోయాయి. వీరిని చూడ కుండా చెరసాల నాయకుడు ఆత్మహత్య చేసుకోవాలి అనుకున్నాడు. వెంటనే పౌలు అతనిని కాపాడి అతనిని అతని యొక్క కుటుంబమును రక్షణ మార్గంలో నడిపించారు. 

 

ప్రియ స్నేహితుడా! నేను ఈ శ్రమను అనుభవించ లేకపోతున్నాను అని అనుకుంటున్నావా? భారాన్ని మోయలేక పోతున్నాను అని కృంగి పోతున్నవా? కలత చెందవద్దు. ఇక పై వచ్చే మహిమకు ఈ సాధారణమైన బాధలు సమానము కావు. నువ్వు పడే కష్టాల వలన అనేకులు ప్రభువు యొక్క ప్రేమను రుచి చూడగలరు. నిన్ను కూడా కొన్ని శ్రమలు తరువాత దేవుడు తన సాక్షిగా నిలువబెడతారు. సిలువకు నిన్ను అప్పగించు కొని రాబోయే రోజుల్లో మహిమను ఎదురు చూసినప్పుడు శ్రమలు కూడా పరవసము వలె అనిపిస్తాయి. 

- బ్రదర్. టి. మనోజ్ కుమార్ గారు. 

 

ప్రార్ధనా అంశం:-

ఆఫీస్ లో వినియోగించే ల్యాప్ టాప్, కంప్యూటర్ లు చక్కగా పనిచేసేటట్లు ప్రార్దిద్ధాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al betcio giriş betcio padişahbet bets10 extrabet royalbet süperbetin padişahbet betcio royalbet casinoroyal queenbet bahiscasino betcio bahiscasino atlasbet padişahbet betpas bahiscasino celtabet queenbet casibom jojobet jojobet casibom holiganbet restbet safirbet