Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 25.10.2021
Share:

By Village Missionary Movement

Thursday, 25-Nov-2021

దిన ధ్యానము(Telugu) 25.10.2021

 

అంశం:- వేచి ఉన్న జిగట మన్ను.

 

"యెహోవా, నీవే మాకు తండ్రివి మేము జిగటమన్ను నీవు మాకు కుమ్మరివాడవు మేమందరము నీ చేతిపనియై యున్నాము" - యెషయా 64:8

 

చాలా కళను ప్రతిభను కలిగి ఉన్న ఒక కుమ్మరి అందమైన మట్టి పాత్రలను చక్కగా చేస్తూ ఉన్నాడు. జిగటగా ఉన్న మట్టిని కాళ్ళతో త్రొక్కి దానిని మెత్తగా పిసికి పరిపక్వం చెందించి దానిని చక్రంలో పెట్టి దానికి రూపం ఇస్తున్నప్పుడు తాను ఊహించిన రూపం రాకపోవడం వలన మరలా మరలా దానిని సరిచేసి తాను ఊహించిన రూపం వచ్చే అంత వరకు ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. ప్రతీసారి ఏదో ఒక భాగం వంగి ఇరిగి ఉండేది. కాని కొంచం కూడా విసుక్కోకుండా ప్రయత్నం విడిచిపెట్టకుండా ఓపికగా నమ్మకంగా ఉన్నాడు. అతను కొంచం సేపు విశ్రాంతి తీసుకున్న సమయంలో అతని ద్వారా చేయబడిన ఇతర పాత్రలు, జాడీలు, పువ్వుల తట్టెలు, చక్రం లో ఉన్న మట్టి ముద్దను చూసి హేళనగా నవ్వాయి. అదిమాత్రమే కాదు అవి మేమందరం అదురుస్ట వంతులం ఎందుకంటే మేము చాలా తొందరగా ఉపయోగ పడే పాత్రలుగా తయారు చేయబడ్డాం. కాని నీవు మాత్రం చాలాసార్లు ప్రయత్నం చేసినాకుడా దేనికి ఉపయోగం లేకున్నా ఉన్నావు అని ఎగతాళి చేశాయి. చక్రం లో ఉన్న మన్నుకు విచారం కలిగినను నేను నా యజమానుని చేతిలో ఉన్నాను ఆయన ఊహించిన విధముగా తయారు చేయుటకు నన్ను అప్పగించు కొన్నాను అని మౌనంగా ఉన్నది. ఆ కుమ్మరి వచ్చి తన మనస్సులో ఊహించిన రూపం వచ్చేవరకు తయారు చేయుట మొదలు పెట్టి అందముగా చెక్కి దానిని కన్నులకు ఆకట్టుకునే చక్కని కుండి చేసాడు. పని మనుష్యులు ఆ కుమ్మరి యొద్దనుండి కొన్ని వస్తువులు కొని రాజు గారి భవనం తోటను అలంకరిస్తున్నారు. ఆ సమయంలో అటుగా నడుస్తున్న రాజు ఆ అందమైన కుండీని చూసి తన గదిలో మాత్రమే ఉపయోగించడానికి తీసుకురమ్మన్నాడు. హేళన చేసిన మిగత పాత్రలు అన్ని ఆ పాత్రను చూసాయి. ఇదే విధంగా యోసేపు ఐగుప్తు అంతటికి అధికారి అగుటకు ముందుగా అతను దాటి వచ్చిన మార్గం మరియు అభివృద్ధి చెందే విధానం చాలా విభిన్నమైనదిగా ఉంది. వేదనతో నిండియున్న రోజులు కాని దేవుని పైన ఉంచిన నమ్మకంతో తాను అభివృద్ధి చెందే విధముగా తనను దేవుని చేతులకు అప్పగించు కొనుట వలన అందరికి ప్రయోజన కరమైన పాత్రగా మారాడు. మనము కూడా మన జీవితమును పరమ కుమ్మరి అయిన యేసు యొద్ద అప్పగించు కొన్నప్పుడు మనలను గూర్చి ఆయన ప్రణాళిక నెరవేర్చుటకు మనలను తయారు చేసి ఉపయోగ కరమైన పాత్రగా మనలను మార్చుతారు. ఆమెన్.

- శ్రీమతి. వసంతి రాజమోహన్ గారు

 

ప్రార్థన అంశం:-

పాఠశాలకు వెళ్తున్న మిషనరీ పిల్లలకు ఏ వైరస్ తాకకుండా ఆయన కంచ, కాపుదల ఉంచేలా ప్రార్ధిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al betcio giriş betcio padişahbet bets10 extrabet royalbet süperbetin padişahbet betcio royalbet casinoroyal queenbet bahiscasino betcio bahiscasino atlasbet padişahbet betpas bahiscasino celtabet queenbet casibom jojobet jojobet casibom holiganbet restbet safirbet