Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 23.10.2021
Share:

By Village Missionary Movement

Tuesday, 23-Nov-2021

దిన ధ్యానము(Telugu) 23.10.2021

 

అంశం:- ఆకస్మిక దాడి.

 

"దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును" - 1పేతురు 5:5

 

డి.యల్. మోడీ అనే దేవుని సేవకుడు ఒకసారి ఇంగ్లాండ్ దేశంలో గల ఒక నగరంలో చాలా పెద్ద కన్వెన్షన్ సభలో మాట్లాడి పై నుండి క్రిందకు దిగారు. వెంటనే ఒక వ్యక్తి మోడీ చేతిని పట్టుకొని ఈరోజు చాలా అద్భుతంగా మాట్లాడారు అని అతనిని పొగిడారు. అందుకు మోడీ ఈరోజు నన్ను పొగిడే రెండవ వ్యక్తి మీరే అని అన్నారు. ఆ వ్యక్తి తికమక చెందారు. తనకంటే ముందు ఎవరు కనిపించ లేదు. నా కంటే ముందు మిమ్మల్ని పొగిడిన వారు ఎవరు అని అడిగారు అందుకు మోడీ ఇలా చెప్పారు. నేను ప్రసంగమును పూర్తి చేసి క్రిందకు దిగుటకు ముందు సాతాను నా చెవి దగ్గరకు వచ్చి మోడీ గారు ఈరోజు మీ ప్రసంగం అద్భుతం అని పొగిడారు అని అన్నారు. 

 

పరిశుద్ద గ్రంధంలో అపోస్తులుడైన పేతురు ఈవిధంగా రాసారు. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని మనం భూమిపై జీవించే రోజుల్లో మనకు కలిగిన వన్నియు దేవుని కృప వలననే మనకు దొరికినవి. కావున మనం ఏ భూమిపై జీవించే కాలంలో ఇది నా వలన కలిగిన ఆశీర్వాదం, నా చేతి బలం మరియు నా సామర్ధ్యమే దీనిని సంపాదించాయి అని చెప్పకుండా జాగ్రత్త పడదాం. మన జీవితంలో అహంకారమునకు చోటు ఇవ్వకుండా ఉందాం. 

 

దీనిని చదువుతున్న ప్రియ స్నేహితులారా! క్రైస్తవ జీవితంలో శోధనలు అనేకం. ప్రతి ఒక్క శోధన ఒక యుద్ధానికి సమానంగా ఉంటుంది. యుద్దంలో విజయం పొందుకోవాలి అంటే యుద్ధానికి ముందు ఎంతో జాగ్రత్తగా ఉంటాం అయితే దానికంటే ఇంకా ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. విజయం కలిగినప్పుడు వచ్చే గర్వంతో కూడిన ఆలోచన మనలను క్రిందకు పడదోసే ఒక చాటైన గురి అని చెప్పవచ్చు. అవును సాతాను మనలను పడద్రోయుటకు అసూయ, అహంకారం వంటి బయటకు కనిపించని పాపములో పడద్రోయుటకు సందర్భం గురించి ఎదురు చూస్తూ ఉంటాడు అనేది మర్చిపోకూడదు. అందువలన ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉందాం సాతాను యొక్క చాటైన గురి నుండి తప్పించు కుందాం.

- బ్రదర్. టి. శంకర్ రాజ్ గారు

 

ప్రార్థన అంశం:-

కార్యాలయ పనులు మరియు సిబ్బందులను దైవిక మార్గంలో నడిపించు లాగున ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al betcio giriş betcio padişahbet bets10 extrabet royalbet süperbetin padişahbet betcio royalbet casinoroyal queenbet bahiscasino betcio bahiscasino atlasbet padişahbet betpas bahiscasino celtabet queenbet casibom jojobet jojobet casibom holiganbet restbet safirbet