By Village Missionary Movement
Sunday, 21-Nov-2021దిన ధ్యానము(Telugu) 21.10.2021 (Kids Special)
అంశం:- దయ కాలం
"యెహోవా కృపగలవాడు ఆయన వాత్సల్యత యెడతెగక నిలుచునది గనుక మనము నిర్మూలము కాకున్నవారము" - విలాపవాక్యములు 3:22
గుజరాత్ రాష్ట్రంలో 2001వ సంవత్సరం గణతంత్ర దినోత్సవం నాడు కొన్ని సెకెన్లలో ఏర్పడిన పెద్ద భూకంపం వలన చాలా పెద్ద నాశనం కలిగింది. అక్కడ 400 మంది పిల్లలు గణతంత్ర దినోత్సవానికి జట్టుగా బయలు దేరినప్పుడు కుప్పకూలిన భవనం క్రింద అనేకులు మరణించారు. అంజర్ మరియు కచ్ జిల్లాల్లో ఆ పిల్లలు అరిచే శబ్దాలు మరియు వారిని వెతికే తల్లిదండ్రుల మనోవేదనతో కూడిన పిలుపులు వినిపించాయి. తనిక్ట అనే ఒక క్రైస్తవ స్త్రీ కార్యాలయంలో నుండి బయటకు వచ్చారు. ఆమె బయటకు వచ్చిన అదే సమయంలో భూకంపం కలిగింది. ఆ కార్యాలయం అంతా కుప్ప కూలిపోయింది. అప్పుడు ఆ కార్యాలయంలో నేను ఉండి ఉంటే నేను ఆరోజే చనిపోయే దానిని అని ఇంకా ఈరోజు వరకు ప్రాణంతో ఉండి ఉండుట అనేది దేవుని కృప మాత్రమే అని అన్నారు. ఈ కరోనా కాలంలో కూడా ఎంతోమంది దేవుని సేవకులు, దేవుని పిల్లలు మరణించారు. కాని మనము జీవించుట అనేది దేవుని యొక్క కృపయే. సిలోయేము లోని గోపురపు పడి చచ్చిన 18 మంది యెరూషలేములో కాపురం ఉన్న వారందరి కంటే అపరాదులు అని తలంచు చున్నారా? కారని మీతో చెప్పుచున్నాను. మీరు మారుమనస్సు పొందని యెడల మీరందరు ఆలాగుననే నశింతురు అని యేసుక్రీస్తు చెప్పారు. అప్పుడు ఆయన ఇంకొక ఉపమానం చెప్పారు. ఒక మనుష్యుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి యుండెను. అతడు దాని పండ్లు వెతక వచ్చినప్పుడు ఏమియు దొరకలేదు. గనుక అతడు దీనిని నరికి వేయుము దీని వలన ఈ భూమి ఎలా వ్యర్థం కావలెనని అన్నారు. అయితే వాడు నేను దాని చుట్టూ ఎరువు వేయు మట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము అది ఫలించిన సరి లేనియెడల నరికివేయుము అని అతనితో చెప్పెను. ఈ ఉపమానంలో దేవుడు మనలను జీవముతో ఉంచేది మనము ఫలించాలి అనే దానికొరకే. మరణించిన వారు పాపులు అని కాదు. వారు దేవుడు వారికిచ్చిన ప్రణాలికను నెరవేర్చి వెళ్లిపోయారు అని అర్థం. మనము దేవుని ద్వారా మనకు ఇవ్వబడిన ప్రణాలికను నెరవేర్చాలి. జీవము గల వారి దేశములో మనము ఉండడం వలన మనము ఇంకా దేవుని కొరకు కార్యములు చేయగలం. నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రార్థన చేయగలం. దేవుడు ఇచ్చిన సమయమున ప్రతిభను వినియోగించుకొని దేవుడు ఇచ్చిన పనిని చేయగలం. ఇది ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము నేను దాని చుట్టు త్రవ్వి ఎరువు వేస్తాను అని చెప్పి ప్రభువు మనలను ఇంకా ప్రాణముతో ఉంచిన ప్రణాలికను నెరవేరుద్దాం. హల్లెలయా!
- బ్రదర్. హానిస్ శామ్యూల్
ప్రార్థన అంశం:-
మన యొక్క పరిచర్యలో ఉపయోగిస్తున్న నాలుగు చక్రాల వాహణములు చక్కగా పనిచేసేలా ప్రార్థిద్దాం.
*Whatsapp*
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.
ఈమెయిల్: reachvmm@gmail.com
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250