Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 16.10.2021
Share:

By Village Missionary Movement

Tuesday, 16-Nov-2021

దిన ధ్యానము(Telugu) 16.10.2021

 

అంశం:- ప్రాముఖ్యత

 

"కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి; అప్పుడవన్నియు మీకనుగ్రహింపబడును" - మత్తయి 6: 33

 

స్కాట్లాండ్ దేశమునకు చెందిన ఎరిక్ లేడల్ అనే యవ్వనస్తుడు తనను చైనా దేశమునకు మిషనరీగా వెళ్లుటకు సమర్పించు కొనియున్నారు. ఈయన మంచి ఫుట్ బాల్ ఆటగాడు గాను పరుగు పందెంలో మంచి ఆటగాడు గాను పేరు పొందుకొన్నారు. 100 మీటర్ల పరుగు పందెంలో ఎరిక్ చేసిన సాధనను ఇంగ్లాండ్ దేశంలో 35 సంవత్సరాలు పై బడినప్పటికి ఎవరు దానిని అధిగమించ లేదు. 1924వ సంవత్సరం ప్యారిస్ లో జరిగిన ఒలింపిక్ లో ఈయన పాల్గొనే అవకాశం దొరికింది. కాని పరుగు పందెం కొరకు అయిన సెలెక్షన్ ఒక ఆదివారం ఏర్పాటు చేయబడింది. ఎరిక్ ఆదివారం ఆరాధనకు వెళ్ళాలి అని ఆ సెలక్షన్ లో పాల్గొనేందుకు తిరస్కరించారు. లోక ఘనత సంపాదించుట కంటే దేవునికి లోబడుటయే చాలా.ప్రముఖ్యం అనే దాన్ని ఆయన బాగా గ్రహించారు. ఈయన యొక్క ఈ కార్యాన్ని దేవుడు ఘనపరిచారు. ఏవిధంగా అంటే 3 దినముల తరువాత జరిగిన ఆ ఒలింపిక్ పరుగు పందెంలో చక్కగా పరిగెత్తి ప్రపంచ స్థాయి సాధన చేశారు. 

 

యేసుక్రీస్తు ప్రభువు తన యొక్క కొండమీద ప్రసంగంలో మొదటిగా దేవుని రాజ్యాన్ని ఆయన నీతిని వెతుకుడి అని చెబుతున్నారు. మనము యేసయ్యకు లోబడి ఆయన రాజ్యాన్ని మొట్టమొదటిగా వెతుకుటకు మనలను మనము సమర్పించుకొని జీవించుట నేర్చుకొందాం. అలాగైతే ఆయన మన జీవిత మార్గంలో అవసరమైన అన్నింటినీ చూసుకుంటారు. 

 

దీన్ని చదువుతున్న మనము మన దేవునికి ఎలాంటి ప్రాముఖ్యత ఇస్తున్నాం? ఎన్ని దినాలు చిన్న చిన్న కార్యములను సాకులుగా చూపించి సంఘ ఆరాధనను తిరస్కరించి ఉంటాం. కొందరు జీవితంలో పోరాటములు, శ్రమలు దుఃఖములు వస్తేనే తప్ప దేవుని వెతుకుతున్న గ్రహింపు లేకుండా ఉంటున్నారు. వారు ప్రాధాన్యత ఇచ్చుట సమాజపు ఫ్రెస్టేజ్ మరియు ఐస్వర్య వంతమైన జీవితం కొరకే. మనము దేవునికి ప్రాధాన్యత ఇద్దాం. తనను ఘన పరిచే వాళ్ళను ఘన పరిచే దేవుడు మనల్ని కూడా అందరి ఎదుట ఘన పరుచును గాక! 

- శ్రీమతి. శక్తి శంకర్ రాజ్

 

ప్రార్థన అంశం:-

మన గెత్సేమనే క్యాంపస్ లో జరుగుతున్న కట్టడ పనులు కొరకు అవసరమైన ఆర్థిక ఆవసరతలు సంధించబడేటట్లు ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al