Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 15.10.2021
Share:

By Village Missionary Movement

Monday, 15-Nov-2021

దిన ధ్యానము(Telugu) 15.10.2021

 

అంశం:- అందవిహీనము నుండి అలంకారమునకు

 

"చాలకాలమునుండి పాడుగానున్న స్థలములను వారు కట్టుదురు పూర్వమున పాడైన స్థలములను కట్టుదురు పాడైన పట్టణములను నూతనముగా స్థాపింతురు తరతరములనుండి శిథిలములైయున్న పురములను బాగు చేయుదురు" - యెషయా 61: 4

 

స్కాట్లాండ్ దేశంలో పూర్వ కాల కట్టడ విజ్ఞాన శాస్త్రాంలో పేరు గాంచిన ఒక గది ఉండేది. ఆ భవనమును చూచుటకు వచ్చే వ్యక్తులు అందరు ఆ గదిలో ఉన్న గోడపై ఏదో ఒక చిత్రాన్ని గీసి వెళ్ళేవారు. అలా ఉండిన ఆ గదిలో విశేషం ఏమిటి అంటే ఒక కాలంలో చాలా చక్కగా కట్టబడి మంచి రంగులు వేయబడిన గదిగా ఉండేది. అది ఒక దినము హఠాత్తుగా పక్కనే ఉన్న కూల్ డ్రింక్స్ ఫ్యాక్టరీ పేలిపోవడం వలన ఆ భవనం యొక్క అందమైన గోడలు మరకలు పడిపోయాయి. అక్కడే నివసించిన ప్రఖ్యాతి గాంచిన ఆర్టిస్ట్ అయిన సర్ ఎడ్విన్ లాంసిర్ అనే వారు ఆ మరకలు చూచి నప్పుడు వాటిని విలువగల చిత్రంగా మార్చి వేశారు. ఆయన ఒక నది కొండమీద నుండి ప్రవహిస్తున్నట్లు దానిని గీసారు. దాంట్లో కొండలు చెట్లు వాటి మధ్య గంభీరమైన ఆకారంలో ఒక లేడి నిలబడి ఉంటున్న దృశ్యం యదార్థముగా కనబడింది. ఈ చిత్రం స్కాట్లాండ్ దేశంలో ఉన్న కొండ చిత్రాలలో ప్రధానమైనవిగా ఉండేవి. చూడడానికి అందవిహీనంగా ఉండిన భవనం ఈ దినము వేలకొలది ప్రజలను ఆకర్షించి ఒక అందమైన దృశ్యంగా కనబడుతుంది. 

 

ఒక కాలంలో మన జీవితం కూడా మంచిగా ఎదిగి దేవుని దృష్టికి అందమైనదిగా కనబడి ఉండవచ్చు కాని ఇప్పుడు అయితే మన మంచి స్వభావములు ఉన్నతమైన ఆత్మీయ అనుభవములు అన్నీ కూడా మారుగై పాపము యొక్క మరకలతో అందవిహీనంగా కనబడవచ్చు. పూర్వపు దినాల్లో నాలో కనబడిన ఉన్నత అనుభవములు మరలా చిగురించుట సాధ్యమేనా? నేను కోల్పోయిన ప్రార్థనా జీవితం నాలో మరలా కనబడుతుందా? అని అంగలార్పుతోను, నిరుత్సాహం తోను ఉన్నారా? చింతించకండి శూన్యము నుండి సమస్తమును సృష్టించిన వారు మన దేవుడు శూన్యము, నిరాకారముగా ఉండిన భూమిని చక్క పరిచిన దేవుడు మన దేవుడు ఆయన మీలో చెడిపోయి ఉన్న సమస్తాన్ని ఉన్నత అనుభవములతో మరలా సృష్టించుటకు ఆయన శక్తిమంతుడు. ఆయనే మీ యొక్క పూర్వపు స్థితిని మేలుగా మార్చగలరు. ఆయన అందవిహీనమును అలంకారముగాను, అపజయమును జయముగాను, ఎండిపోయిన నేలను నీటి ఊటగాను మార్చి ఎక్కుగా ఫలించేటట్లు చేస్తారు. 

 

ప్రియమైన వారలారా! మీరు కొల్పయిన ఆత్మీయ జీవితాన్ని తలంచి నిరుత్సాహ పడకుండా మిమ్మల్ని నూతన పరుస్తున్న సర్వశక్తిమంతుని చేతుల్లో మిమ్మల్ని సమర్పించండి. ఆయన మిమ్ములను మీ యొక్క అలంకారమును అనేకులకు దీవెన కరంగా మారుస్తారు. 

- బ్రదర్. హానిస్ శామ్యూల్.

 

ప్రార్థన అంశం:

సేవకుల కొరకు వేస్తున్న మ్యాగజైన్ ప్రతి నెల వేయబడేటట్లు ప్రార్దిద్ధాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al virüsbet medusabahis medusabahis giriş grandpashabet grandpashabet giriş jojobet jojobet giriş vaycasino vaycasino giriş pusulabet pusulabet giriş perabet perabet giriş perabet perabet giriş matbet slot oyna perabet perabet giriş hiltonbet perabet perabet perabet betnano holiganbet galabet kalebet holiganbet kingbetting kingbetting giriş lunabet lunabet giriş rulobet betpas atlasbet grandpashabet