Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 14.10.2021 (Kids Special)
Share:

By Village Missionary Movement

Sunday, 14-Nov-2021

దిన ధ్యానము(Telugu) 14.10.2021 (Kids Special)

 

గ్రామ మిషనరీ సంస్థ తరుపున ప్రత్యేకంగా చిన్న

 పిల్లలకు.

 

"యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును" - కీర్తనలు 112:4

 

చుట్టూ ప్రకృతి సౌందర్యంతో నిండి ఉన్న పెంకిటిళ్లు వెనుక ఉన్న పనస చెట్టు క్రింద ఒక రాయి మీద కూర్చొని ఉన్నాడు 12 సంవత్సరాలు వయస్సు గల హిల్కియా. అతడు ఎర్రని, సన్నని మరియు ప్రకాశవంతమైన ముఖము కలిగిన వాడు. తుమ్మెదలు మెరుస్తూ ఉంటే అతని కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఎందుకు అంటే అతడు నోటి మాంద్యము గలవాడు. అతను తోడబుట్టిన ఇద్దరు సహోదరులు, ఒక సహోదరి ఉన్నారు. వారు మాత్రం చక్కగా మాట్లాడుతున్నారు. నేను వారిలా మాట్లాడ లేకపోతున్నాను అని బాధపడ్డాడు. తన నగర ప్రాంతంలో 8వ తరగతి వరకు ఉన్న పాఠశాల కలదు. 8వ తరగతి ఎంపిక పరీక్ష రాసిన 40 మందిలో 12 మంది మాత్రమే ఉత్తీర్ణులు అయ్యారు. వారిలో ఒక్కడు ఈ హిల్కియా. అతనిని ఇంతవరకు పట్టించు కొనని ఉపాధ్యాయులు చక్కగా చదువుటను చూచి ఆశ్చర్య పడ్డారు. యేసుక్రీస్తు యొక్క ప్రేమ గురించి చెప్పి, పరిశుద్ద గ్రంధం చదివి మంచి సాక్షిగా జీవించాలి అని అతనిని ప్రోత్సహించారు. హిల్కియా విధేయత కలిగిన వాడిగా లోబడి పెరిగాడు. ఇంటి పనుల్లో తల్లికి సహాయం చేస్తాడు మరియు వ్యవసాయ పనుల్లో తండ్రికి సహాయం చేస్తాడు. 

 

9వ తరగతి చదువుటకు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న కరంగల్ మార్కెట్ అనే ఊరికి వెళ్ళాలి. పాఠశాలకు ఫీజులు కట్టాలి 70 సంవత్సరాల ముందు రవాణ సదుపాయం కూడా లేదు. పరిస్థితులు బాగోలేని కారణంగా హిల్కియా యొక్క అన్నయ్యను మాత్రమే చదివించాలి అని తల్లిదండ్రులు నిర్ణయించుకున్నారు. చదువుకోవాలి అని ఆశ ఉన్న హిల్కియా ఏడుస్తూనే ఉండేవాడు. ఇంటి వెనుకకు వచ్చిన హిల్కియా తన తల్లికి అతనిని చూసి ఆశ్చర్యంతో సంతోష పడేలా కన్నీటికి కారణం అడిగి తెలుసుకుంది. చదువుకోవాలి అనే తన కుమారుని యొక్క ఆశను నెరవేర్చాలి అనే నిర్ణయం తీసుకుంది. తన తోటి విద్యార్థులతో కలిసి నడచుకొంటు పాఠశాలకు వెళ్ళి చదువుకొనేవాడు. ఒకే ఒక మంచి సర్ట్ మాత్రమే ఉండేది. ప్రతి రోజు ఆ తడిపిన చొక్కాను వేసుకొని పాఠశాలకు వెళ్ళి చదువుకొనే వాడు. కాళ్ళకు చెప్పులు కూడా లేవు. చదువుకోవాలి అనే ఆశ మాత్రమే ఉంది. 1956వ సంవత్సరమున అతను చదివిన ఇరనియల్ లో పాఠశాలలో చదివిన 38మంది విద్యార్థుల్లో ఎస్ ఎస్ సి ఎల్ సి ప్రభుత్వ పరీక్షల్లో విజయం పొందుకొన్నారు. వారిలో 5మంది మాత్రమే ఉత్తీర్ణత పొందుకొన్నారు వారిలో హిల్కియా ఒకరు. ఈలోగా తన నోటి మాంద్యము స్వస్థ పరచమని యేసుక్రీస్తు యొద్ద వేడుకున్నాడు. దేవుడు తన ప్రార్ధనను అలకించాడు. అనర్గళంగా మాట్లాడే, పాట పాడే తియ్యని రాగంతో పాడే సామర్ధ్యంను దేవుడు తనకు ఇచ్చి తనను ఆశీర్వదించారు. హిందీ కూడా చదివిన హిల్కియా మాస్టర్ డిగ్రీ పైన సాహిత్య రత్న అనే పధకం పొందుకొన్నారు. హిందీ పండిట్ గా ప్రభుత్వ పాఠశాలలో పని చేసారు. తమిళ్ పండిట్ గా పనిచేసిన సహోదరి డైసి ని వివాహం చేసుకున్నాడు. ప్రభువు వారిని పరిచర్యకు పిలుచు కోవడంతో ప్రభుత్వ ఉద్యోగమునకు రాజీనామా చేసి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంకు వెళ్ళి ఉన్నత మైన దేవుని సేవను చేసి అనేక ఆత్మలను దేవునికి సొంతం చేశారు. చిన్న పిల్లలుగా వున్నప్పుడు చేసిన ప్రార్థన, విశ్వాసం మరియు శ్రమ అతనిని ఉన్నత స్థాయికి తీసుకు వెళ్లాయి. ఈరోజు మన భారత దేశ తొలి ప్రధాన మంత్రి అయిన జవహర్ లాల్ నెహ్రు యొక్క జయంతి చిన్న పిల్లలను ఎక్కువగా ప్రేమించడం వలన తన జన్మదినమున బాలల దినోత్సవంగా జరుపుకోవాలి అని అడిగారు. మన ప్రభువైన యేసు క్రీస్తు కూడా పిల్లలను ఎక్కువుగా ప్రేమిస్తున్నారు. నీవు ఆయన యొద్ద ప్రార్ధించినప్పుడు నీ జీవితమును ఎక్కువగా హెచ్చించి ఆశీర్వదిస్తారు.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al