Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 13.10.2021(Telugu) 13.10.2021
Share:

By Village Missionary Movement

Saturday, 13-Nov-2021

దిన ధ్యానము(Telugu) 13.10.2021

 

అంశం:- పరిశుద్ధం మరియు పరవశం.

 

"నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము" - కీర్తనలు 51:2

 

ఈ కాలం యవ్వనస్తులకు ఎక్కడైనా దేనిలోనైనా పోరాటం అధికముగా ఉన్నది. సిగెరెట్, మద్యం అనే స్నేహితుల నుండి వచ్చే పోరాటం, సెల్ ఫోన్, ఇంటర్నెట్, టీవీ లతో ఇంటి లోపలే ఉండి పోరాటం. ఇటువంటి పోరాటాల మధ్యలో పరిశుద్ధతతో ఒకడు బ్రతుకగలడా అనే ప్రశ్న అందరి యొద్ద ఉన్నది. దీని నుండి వెనుకకు వెళ్లే మార్గం ఉన్నదా అనే ఆలోచన క్రీస్తుని ఏరిగిన యవ్వనస్తుల కన్నులలో కనిపిస్తుంది. యేసుని రక్షకునిగా అంగీకరించిన తరువాత ఒక చిన్న పాపమునకు లేదా ఆశకు చోటు ఇవ్వకూడదు. అది మనలను పూర్తిగా నాశనం చేస్తుంది. ఒక చచ్చిన ఈగ తైలం అంతటిని పాడుచేస్తుంది కదా అందుకే దీనిలో చాలా జాగ్రత్తగా వున్నాడు యోసేపు అనే యవ్వనస్తుడు. ఫోతిఫర్ భార్య ద్వారా తన కీర్తి మరియు పరువుతీసే పెద్ద శోధన వచ్చినప్పుడు తనకు వ్యతిరేకంగా తన వస్త్రం సాక్ష్యం చెప్పిన పరవాలేదు నేను నా శరీరముతో దేవునికి విరోధముగా పాపమును ఎట్లు కట్టుకొందును అని వస్త్రమును విడిచిపెట్టి పారిపోయాడు. ఈ పరుగు అతనిని మొదట చెరసాలలో బంధించిన సరే చివరిలో ఐగుప్తు దేశమునకు అధికారిగా చేసింది. 

 

ఒక అతను తన ఇంటిని అద్దెకు ఇచ్చారు ఇంటి గోడకు ఉన్న ఒక మేకు మాత్రం నాకు కావాలి అని చెప్పారు. మొదటి రోజున ఆ మేకు కు సంచిని వేలాడదీసారు. మరుసటి రోజు గొడుగును ఆ మరుసటి రోజు మురికి షర్ట్ ను చివరిలో కంపుకొట్టే పిండమును ఆ సంచిలో పెట్టి వెళ్ళిపోయాడు. దానిని బట్టి అక్కడ ఎవ్వరు ఉండలేనంత దుర్వాసన కలిగింది. దానిని బట్టి అందులో అద్దెకు ఉన్న వారు కాళీ చేసేసారు. 

 

ప్రియమైన వారలారా మన హృదయంలో దేవునికి స్థలం ఇచ్చి ఆయనను అంగీకరించిన తరువాత చిన్న పాపమే కదా ఒక రోజు మాత్రమే కదా అనుకొని వీటికి చోటు ఇచ్చినట్లు అయితే రోజు రోజుకు మీ హృదయం అంతటిని మచ్చ చేసి ప్రభువునే బయటకు త్రోసేస్తుంది. జీవితం అనే ఆనకట్ట చిన్నగా పగిలి ఉంటే ఒక రోజు అది విరిగే ప్రమాదం ఉంటుంది. అందువలన మీ హృదయమును చిన్న పాపం కూడా మచ్చ చేయకుండా జాగ్రత్తగా ఉంచుకొనండి. పాపములో పడినప్పుడు వెంటనే దేవుని యొద్ద ఒప్పుకొని ఆయన రక్తంతో శరీరమును శుద్ధి చేసుకొనండి. మచ్చలేని పరిశుద్ద జీవితం జీవించుటకు యేసుక్రీస్తు మనకు సహాయం చేస్తారు. ఆయనతో ఎల్లప్పుడు ఐక్యతతో జీవిస్తే పరిశుద్ద జీవితం జీవించడం సులభం అవుతుంది.

- శ్రీమతి. భువన ధనబలన్ గారు

 

ప్రార్థన అంశం:-

సేవకుల కొరకు పంపబడుతున్న పత్రికలు పంపబడుటకు పోస్టల్ వారి అనుమతి దొరికేటట్లు ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al virüsbet medusabahis medusabahis giriş grandpashabet grandpashabet giriş jojobet jojobet giriş vaycasino vaycasino giriş pusulabet pusulabet giriş perabet perabet giriş perabet perabet giriş matbet slot oyna perabet perabet giriş hiltonbet perabet perabet perabet betnano holiganbet galabet kalebet holiganbet kingbetting kingbetting giriş lunabet lunabet giriş rulobet betpas atlasbet grandpashabet