Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 12.10.2021
Share:

By Village Missionary Movement

Friday, 12-Nov-2021

దిన ధ్యానము(Telugu) 12.10.2021

 

అంశం:- రుగ్మత

 

"నీవు నడచు మార్గమును సరాళము చేయుము అప్పుడు నీ మార్గములన్నియు స్థిరములగును. నీవు కుడితట్టుకైనను ఎడమతట్టుకైనను తిరుగకుము నీ పాదమును కీడునకు దూరముగా తొలగించు కొనుము” - సామెతలు 4: 26-27

 

 ఫ్రాన్స్ దేశంలో గొప్ప విప్లవం కలుగ జేసిన నెపోలియన్ కు తిండిబోతు అనే ఒక రుగ్మత ఉండేది. ప్రాముఖ్యమైన యుద్ధ ప్రాతిపదిక అయిన ఓటర్లు అనే స్థలములో ఆంగ్ల దళాలను కలుసుకొనుటకు వెళ్లే ముందు ఆయన ముందు ఆవు మాంసమును, బంగాళా దుంపలను ఉంచారు. నిగ్రహం లేకుండా తినడం మొదలు పెట్టిన అతను చురుకుగా పనిచేయలేక యుద్ధంలో విఫలమైయ్యారు. సెయింట్ సెలీనా అనే స్థలములో చెరసాలలో బందించ బడ్డారు. క్రమశిక్షణ లేకుండా ఉండడం అనేది అక్రమము మరియు అవిధేయత, హెచ్చరిక లేకుండా హృదయం వెళుతున్న దారిలో ఆశ్రద్దగా జీవించే వారికి ఈ రుగ్మత అకస్మాత్తుగా పట్టుకుంటుంది. కొంత మందికి త్రాగుతు మరికొంత మందికి టెలివిజన్ ముందు కూర్చొని సమయాన్ని వృధా చెయ్యడం ఇలా ఆశ్రద్దగా ఉన్నట్లయితే చివరిలో ఇది కన్నీటితో మనలను ముంచుతుంది మరియు దేవుని ప్రేమ నుండి మనలను విడదీస్తుంది. 

 

అదికాండము 3వ అధ్యాయంలో హవ్వ యొక్క రుగ్మత ప్రపంచము అంతటికీ నాశనము తీసుకు వచ్చింది. నోవహు కాలంలో ప్రపంచంలో ఉన్న రుగ్మత వలన నాశనం కలిగింది. కాని ఆరోజు జీవించే ప్రజలలో నోవహు నీతిమంతుడిగా, నిందా రహితుడిగా యుండెను. దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారం యావత్తు చేసెను అని పరిశుద్ద గ్రంధం చెబుతుంది. 

 

ప్రియమైన వారలారా ! నేను వారిని గుణపరిచెదను అని హోషేయా గ్రంధంలో 14:4 యెహోవా మనకు వాగ్దానం ఇచ్చారు. దేవుని సన్నిధిలో కూర్చొని పరిశోధించి చూసినట్లైతే మనలో ఉన్న రుగ్మతలను దేవుడు బయలుపరుస్తారు. మన యొక్క పాపమును, అక్రమమును ప్రభువు యొక్క రక్తంలో కడిగి పరిశుద్ద పరుస్తారు. ఆయన చెంత విస్తారమైన కరుణ ఉంది. ఆయన క్షమించుటకు దయను కలిగి ఉన్నారు. ఒక్క నిమిషం మిమ్మును మిరే పరీక్షించి చుసుకుంటారా? రుగ్మతలను నిశ్చయించుకొని తొలగించు కొంటారా? ఈరోజు మిమ్మును మీరు సరిచేసుకొంటే యెహోవా ఆశీర్వాదకరమైన జీవితమును మీకు దయ చేస్తారు. 

- శ్రీమతి. జబా ఖని శేఖర్ గారు

 

ప్రార్థన అంశం:-

కార్య స్థలం యొద్ద సేవ చేస్తున్న తోటి సేవకులకు ద్విచక్రవాహనములు అవసరమై యున్నవి కావున సహాయం చేసే చేతులు లేచేటట్లు ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al virüsbet medusabahis medusabahis giriş grandpashabet grandpashabet giriş jojobet jojobet giriş vaycasino vaycasino giriş pusulabet pusulabet giriş perabet perabet giriş perabet perabet giriş matbet slot oyna perabet perabet giriş hiltonbet perabet perabet perabet betnano holiganbet galabet kalebet holiganbet kingbetting kingbetting giriş lunabet lunabet giriş rulobet betpas atlasbet grandpashabet