By Village Missionary Movement
Thursday, 11-Nov-2021దిన ధ్యానము(Telugu) 11.10.2021
అంశం:- సహాయం చేసే చేతులు.
"ఇక్కడ ఉన్న యొక చిన్నవాని యొద్ద" - యోహాను 6:9
తమిళనాడులో గల 'పుదుకొత్తయి' అనే జిల్లాలో 'అదన కొత్తయి' అనే చిన్న గ్రామంలో జయలక్ష్మి అనే ఒక ఆమె ఉండేది. ఈమె వయస్సు 17 సంవత్సరాలు. వీరిది చాలా పేద కుటుంబం. పగిలిన ఇల్లు, సరైన జీతం లేదు. తన అమ్మ కొంచం మానసిక అనారోగ్యం గలవారు. జయలక్ష్మి చక్కగా చదివి ఒక ప్రేవేటు సంస్థలో జరిగిన పరీక్షలో చక్కగా రాసి విజయం పొందుకొని అమెరికలోని అంతరిక్ష పరిశోధన కేంద్రమైన నాసా కు వెళ్ళడానికి ఎంపిక అయ్యారు. కాని వెళ్ళడానికి డబ్బులు లేకపోవడంతో ఆమెకు స్వచ్చంధ సంస్థలు సహాయం చేసాయి. కాని ఈ చిన్న పిల్ల తనకు దొరికిన సహాయంతో తన గ్రామంలో ఒక్క మరుగు దొడ్డి కూడా లేదు అని స్వచ్చంద సంస్థలతో మాట్లాడారు. దానిని ఎరిగిన ఆ స్వచ్చంద సంస్థ వారు అనేక మందితో మాట్లాడి 126 మరుగు దొడ్లు కట్టించారు. ఈమె తన గ్రామం యొక్క మంచి తనం కొరకు నిలబడింది. ఈ వార్త టీ.వి లో ప్రసారం చేయబడ్డాయి. దాని వలన అనేక మందికి ప్రోత్సాహం కలిగించింది.
ఒక సారి యేసుక్రీస్తు కొండ ప్రాంతంలో ప్రసంగం చేసిన తరువాత వచ్చిన ప్రజలకు భోజనం పెట్టాలి అని తన యొక్క శిష్యులకు చెప్పారు. అప్పుడు ఒక శిష్యుడు ఇక్కడ ఉన్న చిన్న వాని యొద్ద ఇక్కడ ఉన్న ఒక చిన్న వాని యొద్ద రెండు యవల రొట్టెలు, రెండు చిన్న చేపలు ఉన్నాయి అని చెప్పాడు. పేరు చెప్పబడని చిన్నవాడు తాను తినడానికి ఉంచుకున్నాడు. అప్పుడు అక్కడ జరిగే కార్యాన్ని చూసాడు. ఆ చిన్న వాడు వాటిని దాచిపెట్ట గలడు కాని ఆ చిన్న వాడు వాటిని దాచిపెట్ట కుండా యేసయ్యకు ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. అక్కడ అంత సమూహం మధ్యలో యేసుక్రీస్తు వాని యొద్ద ఉన్న రొట్టెలను, చేపలను తీసుకొని ఆశీర్వదించి ఇంచుమించు 5000 మంది కన్నా ఎక్కువ మందికి పంచి పెట్టారు. మిగిలినవి 12 గంపలు నింపారు అని మనం చదువుతున్నాం. ఆ స్థలంలో ఆ ప్రజల కొరకు ఆ చిన్న వాడు నిలబడ్డాడు. పేరు చెప్పబడక పోయిన ఈ రోజు వరకు ఆ చిన్న వాడు జీవించి ఉంటే మన అందరికి ఒక మంచి మాదిరి.
ప్రియమైన స్నేహితులరా! ఈనాటికి మనం ఇటువంటి సాక్ష్యం పొందుకొనగలమా? ఇక్కడ ఒక చిన్న వాడు వున్నాడు అని ఎవరైనా చెప్పగలరా? ఈ. ఘోరమైన వ్యాధి కాలంలో మిగతా వారికొరకు మన యొక్క ప్రతిభా, బుద్ధి, విద్య, డబ్బు, శారీరక శ్రమ అనే ఏదైనను ఒకటి ఇవ్వాలి. మన ఊరి ప్రజలు, స్నేహితులు అనే అందరు ఇక్కడ ఒక ఆయన ఉన్నారు అని చెప్పాలి. ప్రత్యేకంగా యవ్వనస్తులు పైన ఉన్న ఉదాహరణలను గమనించండి. ఇటువంటి జీవితమును జీవించుటకు మిమ్మును సమర్పించుకొనండి.
- బ్రదర్. టి. శంకర్ రాజ్ గారు
ప్రార్థన అంశం:-
సేవకుల కొరకు వ్రాయబడుతున్న పత్రికల ద్వారా సేవకులు నూతన అభిషేకం పొందుకొని ఉత్సాహంగా నడుచుకొనేలాగున ప్రార్థన చేద్దాం.
*Whatsapp*
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.
ఈమెయిల్: reachvmm@gmail.com
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250