By Village Missionary Movement
Wednesday, 10-Nov-2021దిన ధ్యానము(Telugu) 10.10.2021
అంశం:- రెండు గీతల మధ్యలో.
"క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని, గురి యొద్దకే పరుగెత్తుచున్నాను" - ఫిలిప్పీయులకు 3: 14
పెన్ని షఫర్డ్ తన 3 సంవత్సరాల వయస్సులోనే తన వెన్నెముక విరిగి కొంచం సమయం కూడా నిలబడలేరు, నడువలేరు భరించలేని నొప్పితో కష్టపడుతుండేవారు. ఆ స్థితిలో తనకు వివాహం జరిగి ఇద్దరు ఆడపిల్లలకు తల్లివలె తన పనులను తానే చేయలేకపోవడంతో ఇతరుల సహాయం కొరకు ఎదురుచూస్తూ జీవించే పరిస్థితే ఏర్పడటంతో చాలా బాధతో ప్రార్ధించే సమయంలో అధ్బుతములను వెతికి వెళ్ళు అనే శబ్దమును విన్నారు. ఖచ్చితంగా ఇది దేవుని స్వరం అని ఎరిగి దానికి లోబడాలని నిర్ణయించుకున్నారు. ఆమె పరుగు పందెంలో వీరురాలిగా లేనప్పటికి 26.2మైళ్ళు గల పరుగుపందెంలో హాజరుకావాలని నిర్ణయించుకున్నారు. కాని ఆమెకు ఉన్న నొప్పితో నడవడమే కష్టం. మరి పరిగెత్తడం ఎలా సాధ్యం. అయినా సరే దేవుని అద్భుతాలను ఆమె పొందుకోవాలి కోరి తన వైద్యుడే తనకు శిక్షణ ఇచ్చేవాడిగా ఉండటంతో 6నెలలు కఠినమైన శిక్షణ పొందుకున్నారు. 24వేల మంది హాజరైన ఆ పోటీలో ప్రారంభ గీతలో వచ్చి నిలబడినప్పుడు 28సంవత్సరాలుగా ఆమెను విడిచిపోయింది. 7 గంటల సమయం పరుగు పందెంలో పరిగెత్తినప్పుడు మిక్కిలి అలసిపోయిన సమయంలో చివరి గీతను ఎలాగైనా ముట్టాలి అనే ఆశతో తన చేతిలో తనను ఉత్సాహ పరచుటకు తన పిల్లులు వ్రాసిన వాక్యములు చదివారు. వారు అలయక పరిగెత్తుదురు, సొమ్ము సిల్లక నడచి పోవుదురు అనే మాటలు ఆమెను బలపరిచాయి. ముగింపులో ఒక అడుగు కూడా వేయలేని పరిస్థితి ఏర్పడినప్పుడు ఆమె యొక్క ఇద్దరు పిల్లలు భుజం అందించి సహాయం చేయుటకు ముందుకు రావడంతో చివరి లక్ష్యమును చూసి ముందుకు సాగుతూ తన కాళ్ళను ప్రభావితం చేసినప్పుడు దేవుని శక్తి ద్వారా పూర్తిగా నడిపించబడి సంపూర్ణ స్వస్థత పొందుకున్నారు. విశ్వాసం, లోబడటం, విడాని ప్రయత్నం ఇవే ఆమె జీవితంలో అద్బుతమును తీసుకు వచ్చాయి. చివరి గీత కాదు దేవునికి లోబడి మొదటి గీతలో కాలు పెట్టినప్పుడే అద్భుతం పొందుకున్న వారిలా పరిగెత్తడం ప్రారంభించారు.
సుసాన్ కోటలో రాజుకు గిన్నె అందించే వాడిగా ఉన్నవాడే నెహెమ్యా. తన సొంత దేశ ప్రజల సమస్యలు విని యెరూషలేము యొక్క ప్రకారము పడద్రోయబడుటను, దాని గుమ్మములు అగ్నితో కదల్చబడుట విని ఏం చెయ్యాలో తెలియక కృంగిపోయిన వారిగా కాక దేవుని దర్శనములను, ప్రణాళికలను పొందుకొనేవానిగా దొరికిన సమయం వినియోగించుకొని రాజు యొక్క అనుమతిని, సహాయమును పొందుకొని ఆటంకముల మధ్యలో ముందు వేసిన అడుగును వెనుక తీయక ప్రకారమును పూర్తిగా కట్టాలి అనే ఒకే లక్ష్యముతో ఒకటిగా కూడబెట్టి నిర్ణయించబడిన 52 రోజుల్లో దేవుని దర్శనమును, దేవుని ప్రణాలికను నెరవేర్చిన వానిగా కనబడ్డాడు. పరిస్థితులు, సందర్భాలు, మనుష్యులు విరోధముగా ఉండవచ్చు. మనం గురిని చేరుకోవాలి అనే లక్ష్యంతో, దేవుని సహాయంతో వీడని ప్రయత్నంతో ధైర్యముగా ముందుకు వెళ్ళినప్పుడు లక్ష్యాన్ని చేరుకున్న వానిగా విజయమును రుచి చూడగలం.
- శ్రీమతి. వసంతి రాజా మోహన్
ప్రార్థన అంశం:-
తోటి సేవకులు సేవ చేసే ఆలయం లేని గ్రామాల్లో ఆలయాలు కట్టబడేలా ప్రార్థిద్దాం.
*Whatsapp*
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.
ఈమెయిల్: reachvmm@gmail.com
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250