Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 07.01.2021
Share:

By Village Missionary Movement

Thursday, 07-Jan-2021

దిన ధ్యానము(Telugu) 07.01.2021

"దేవా, నాయందు శుద్ధహృదయము కలుగజేయుము నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతన ముగా పుట్టించుము" - కీర్తనలు 51: 10

డాని వాళ్ళ నాన్నతో పండ్లు కొనడానికి వెళ్ళాడు. అక్కడ పండ్లు అందంగా పరచబడి ఉన్నాయి. నాన్న పండ్లు అన్ని కూడా తడుముతూ చూసి మంచి యాపిల్ ను బుట్టలో వేశారు. ఇంటికి వచ్చిన తరువాత అమ్మ ఆ యాపిల్స్ అన్నీ కడిగి ముక్కలు కోయడం ప్రారంభించారు. లోపల పచ్చ రంగులో కనిపించింది. ఆ పురుగును చూసి అసహ్యం వేసి డాని నాన్న మనము మంచి యాపిల్ కొన్నాము కదా! పురుగు లోపలకు ఎలాగూ వచ్చింది అని అడిగాడు. అందుకు నాన్న యాపిల్ చెట్టులో పువ్వులు పూసినప్పుడే కొన్ని పురుగులు ఆ పువ్వులలో గుడ్లు పెట్టేస్తాయి. ఆ పువ్వులు పెరిగి కాయలుగా మారినప్పుడు ఆ పువ్వులో ఉన్న గుడ్లు పురుగులుగా మారి పండులోనే జీవించడం ప్రారంభిస్తుంది అన్నారు. అది విన్న డాని కి చాలా ఆశ్చర్యం వేసింది. ఇలాగుననే మనము మన తల్లి గర్భంలో పిండముగా రూపించ బడుతున్నప్పుడు మనము పాపములో గర్భం ధరించబడుతున్నాం. అందుకనే మన హృదయంలో పాపపు గుణ లక్షణములు పరిపాలిస్తున్నాయి. వీటినే జన్మ స్వభావములు అని పిలుస్తున్నాము. లోకములో జన్మించిన మొదటి శిశువులు కయ్యీను, హేబెలు. పాప కార్యములను వాళ్లకు నేర్పించుటకు ఎవ్వరు లేరు. అయినప్పటికీ  ఎవ్వరు వారికి నేర్పించకుండానే కయ్యీను లోనికి కోపము, అసూయ, బలి తీసుకొనే తలంపు ఎక్కడ నుండి వచ్చింది? హత్య చేసినంతగా ద్వేషం ఉంది చూసారా ఇవి అన్ని ఎక్కడనుండి వచ్చాయి. అవును బైబిల్ చెబుతున్న సత్యం ప్రకారము మనము పాపపు స్వభావముతో జన్మిస్తున్నాము దీని యొక్క ప్రత్యక్షమే శరీర కార్యములుగా బయటకు వస్తున్నాయి.

ప్రియమైన వారాలరా! మనలో ఉన్న జన్మ స్వభావమును జయించి ఆత్మీయులుగా జీవించుటయే క్రైస్తవ జీవితం. మన సొంత బలము చేత జన్మ స్వభావమును జయించగలమా? లేదు పరిశుద్ద ఆత్మ యొక్క సహయముతో ఖచ్చితంగా జయించ గలము. అపోస్తులుడైన పౌలు చెబుతున్న విధముగా మనము మన పాత స్వభావమును సిలువ వేసి యేసుతో తిరిగి లేపబడిన యెడల మనం కాదు మనలో జీవిస్తున్న యేసే ఆ విజయ వంతమైన క్రైస్తవ జీవితాన్ని  మనకు దయ చేస్తారు. 
-    శ్రీమతి. జాస్మిన్ శామ్యూల్.

ప్రార్థన అంశం:- 
ప్రచురిస్తున్న సంవత్సరపు అనుదిన ధ్యాన పుస్తకం  ఈ దినము యేసుతో అనేకులు చదివి దేవుని యొద్దకు వచ్చేటట్లు ప్రార్థిద్దాం.

ఈ దిన ధ్యానవాక్యం కొరకు ఈ క్రింద నoబర్లును సంప్రదించండి
వాట్సాప్ తమిళ్ కొరకు +91 94440 11864, 
ఇంగ్లీష్ కొరకు +91 86109 84002, 
హిందీ కొరకు +91 93858 10496
తెలుగు +91 94424 93250

ఈమెయిల్: reachvmm@gmail.com
Androidapp: https://play.google.com/store/apps/details?Id=com.vmmorg.template.msmapp&showAllReviews=true

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al perabet perabet giriş safirbet safirbet giriş betasus betasus giriş virüsbet medusabahis medusabahis giriş grandpashabet grandpashabet giriş jojobet jojobet giriş vaycasino vaycasino giriş pusulabet pusulabet giriş perabet perabet giriş perabet perabet giriş matbet slot oyna perabet perabet giriş hiltonbet perabet perabet perabet betnano holiganbet galabet kalebet holiganbet