Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 06.10.2021
Share:

By Village Missionary Movement

Saturday, 06-Nov-2021

దిన ధ్యానము(Telugu) 06.10.2021

 

అంశం:- అది పెరిగే కొద్దీ తగ్గుతుంది.

 

"భయపడకుడి; మీరనేకమైన పిచ్చుకలకంటె శ్రేష్ఠులు" - మత్తయి 10: 31

 

ఏ కళ నువ్వు ఎందుకు క్రిందపడి ఉన్న జుట్టును తీసి కూడబెడుతున్నావ్ అని అడుగుతూనే తన స్నేహితురాలు యొద్దకు వచ్చింది సత్య. వీరిద్దరూ చిన్న తనం నుండే మంచి స్నేహితులు. ఒకే పాటశాల, కళాశాలలో చదువుకున్న వారు. అనేక దినముల నుండి కళకు జుట్టు రాలడం చాలా పెద్ద సమస్యగా మారిపోయింది. తల పైన అక్కడక్కడ బట్టతల కనిపిస్తుంది. అలానే కళ యొక్క శరీర బరువు తగ్గుతూనే ఉంది. ఎప్పటికప్పుడు అనారోగ్యానికి గురవుతుంది. దానికి సంధ్య నువ్వు సరిగా తినకపోవడమే దీనికి కారణం అని ఎప్పుడు చెబుతూనే ఉంది. కాని గర్భాశయ క్యాన్సర్ వలన కళ బాధపడుతు చికిత్స తీసుకొనుట తన కుటుంబానికి తప్ప ప్రాణ స్నేహితురాలైన సంధ్యకు కూడా తెలియదు. తన యొక్క పరిస్థితి బట్టి ప్రతి రోజు కన్నీరు కారుస్తూనే ఉంటుంది కళ. క్యాన్సర్ వ్యాధి యొక్క వేదన మరియు దాని యొక్క చికిత్స వలన శరీరంలో ఏర్పడే మార్పులు చూస్తూ బ్రతుకుట కంటే చవడమే మేలు అని మనస్తాపం చెందింది. కాబట్టి ఆత్మహత్య చేసుకోవాలి అని నిర్ణయించుకుంది. రాత్రి అందరూ పడుకున్న తరువాత మెల్లగా డాబా పైకి వెళ్ళింది. అందరూ పడుకున్న రాత్రి సమయం చాలా నిశ్శబ్దంగా ఉంది. కాని పక్కింట్లో మాత్రం పాటలు వినబడగా డాబా యొక్క మూలకు వెళ్లి గమనించింది. వారు ఒక పుస్తకాన్ని తెరచి చదవడం మొదలు పెట్టారు. కళ దానిని వింటూ నిలబడి ఉంది. కొన్ని నిమిషాలు విన్న తరువాత తన నిర్ణయాన్ని నెరవేర్చుటకు బయలు దేరే సమయంలో మీ తల వెంట్రుకలు అన్ని లెక్కించబడి ఉన్నవి గనుక మీరు బయపడకుడి. మీరు అనేకమైన పిచ్చుకలు కంటే శ్రేష్ఠమైన వారు అనే మాటలు ఆమెను తాకాయి. త్వరగా క్రిందికి పరిగెత్తుకొని వెళ్ళి పక్కింటి ఆయన యొద్ద విషయాన్ని అడిగి యేసుని యొక్క ప్రేమను ఎరిగి విశ్వాసమును పొందుకున్నది. క్యాన్సర్ వలన బాధపడుతూ జీవితమును గూర్చి కలత అనేకులకు కలుగుతుంది. వారికి ఓదార్పు ఇచ్చే విధముగా మరియు వారిని ప్రోత్సాహ పరిచే విధముగా నేషనల్ క్యాన్సర్ ఆవేర్నస్ డే అనే దినము భారత దేశంలో అనుసరించబడుతూ వస్తుంది. 

 

దీనిని చదువుతున్న మీరు ఏదైనా ఒక వ్యాధి వలన బాధ పడుతున్న వారి వలెను లేదా వారి యొక్క బంధువుల వాలే వున్నట్లు అయితే ప్రభువైన యేసుక్రీస్తు నందు విశ్వాసము ఉంచండి. కృంగిపోవద్దు, నమ్మకమును విడిచి పెట్టవద్దు. ఢోలి ఫ్రీ మాన్ అనే ఆత్మీయ సహోదరుడు తన యొక్క పుస్తకములో ఈవిధంగా వ్రాసారు. ట్యూమర్ క్యూర్ వెన్ అవర్ ఫైత్ గ్రోస్. అనగా మన విశ్వాసం పెరిగే కొద్దీ కనిత తగ్గిపోతుంది అని వ్రాసారు. కాబట్టి ప్రార్థిద్దాం విజయాన్ని పొందుకుందాం. 

- సిస్టర్. ఏ. రోజ్ లిన్

 

ప్రార్థన అంశం:

మోక్ష ప్రయాణం పత్రికలు సిద్ధ పరిచే పనులలో పాలు పంచుకొంటూన్న వ్యక్తులు ఇష్టముగా పనిచేయుట కొరకు ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al holiganbet giriş holiganbet padişahbet bets10 extrabet royalbet süperbetin padişahbet betcio royalbet casinoroyal queenbet bahiscasino betcio bahiscasino atlasbet padişahbet betpas bahiscasino celtabet queenbet casibom jojobet jojobet casibom holiganbet restbet safirbet