Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 05.10.2021
Share:

By Village Missionary Movement

Friday, 05-Nov-2021

దిన ధ్యానము(Telugu) 05.10.2021

 

అంశం:- ఆలోచన మనుగడను పాడు చేస్తుంది.

 

"మనము మేలుచేయుటయందు విసుకకయుందము" - గలతియులకు 6:9

 

ఒంటరిగా సంచారం లేని స్థలములో ఉన్న ఒక కాలువలో ఒక కారు ఇరుక్కుపోయింది. అదృష్టవంతముగా ఆ దారిలో గుర్రపు స్వారీ చేస్తున్న ఒక అతను మాత్రమే "ధాని" అనే గుర్రంతో వచ్చి సహాయం చేయుటకు ముందడుగు వేసాడు. గుఱ్ఱమును కారుకు కట్టి "నల్లి" కారును లాగు అని చెప్పాడు కాని ఆ "ధాని" అనే గుర్రం కదలలేదు. తరువాత "లాని" కారును లాగు అరచి చెప్పాడు కాని అప్పుడు కూడా ధాని కదలలేదు. తరువాత "షాను" కారును లాగు అని చెప్పినప్పుడు ధాని కారును బయటకు లాగడం వలన కారు బయటకు వచ్చింది. జరిగినది అంత చూసిన కారు డ్రైవర్ మీరు ఏవేవో పేర్లు చెప్పి పిలిచే వరకు గుర్రం కదలలేదు ఎందుకు అని అడిగాడు. అందుకు ఆ గుర్రపు యజమాని అయ్యా ఈ గుర్రానికి కళ్ళు కనిపించవు నేను వేరే పేర్లు చెప్పి పిలిచేసరికి ధాని నేను మాత్రమే ఒంటరిగా లేను నాతో పాటు ఇంకా గుర్రములు పనిచేస్తున్నాయి అనే దైర్యంతో కారును లాగింది. కాని నేను మాత్రమే లాగుతున్నాను అని అనుకొని ఉంటే కారును లాగి ఉండేది కాదు అని చెప్పాడు. 

 

ఈనాడు మనలో అనేకులం ఈ ధాని అనే గుర్రం వలె ఉన్నాము. మనం మాత్రమే ఆ పనిని చేస్తున్నాము అని తెలిస్తే మనం ఆ పనిలో పాలుపొందుకొలేము. ఉదాహరణకు ఆలయములో ఎవ్వరు ఏ పనిని చెయ్యడం లేదు నేను మాత్రమే ఎందుకు నా సమయమును, ప్రయాసను ఉపయోగించి పనిని చెయ్యాలి అని చెప్పి మనలో అనేకులు ఆలయం కొరకు పని చెయ్యడం లేదు. ఏలీయా ప్రవక్త యెజెబెలుకు భయపడి దాగి ఉండినప్పుడు యెహోవా యొద్ద నేను ఒక్కడిని మాత్రమే మిగిలి యున్నాను అని అన్నాడు. యెహోవా మాత్రం ఇంకా 7000 మంది ఉన్నారు అని చెప్పారు. మనం చెయ్యవలసిన పనులు చెయ్యక నేను మాత్రమే ఒంటరిగా వున్నాను వేరే ఎవ్వరు నాతో లేరు ఎంత కాలం నేనే చెయ్యాలి అని దేవుని యొద్ద అడుగుతూనే ఉన్నాము. ఏలీయా ప్రవక్త వలె మిగతా వారు చేస్తున్న పనులను ఎరుగకుండా మన కన్నులు మూయబడి ఉండవచ్చు. ఒక వేళ మనం మాత్రమే దేవుని కొరకు చేస్తూ ఉన్నాము అని అనుకున్నట్లయితే ఏది మంచిదో అది క్రమముగా చెయ్యాలి. అలసి పోకూడదు, మనం కృంగి పోకుండా ఉన్నట్లయితే తగిన సమయాన పంటను కొస్తాము. ఒక వేళ దేవుని కొరకు చేస్తున్నది ఎవరు చూడట్లేదు లేదా ఎవరు పొగడటం లేదు అనుకుంటున్నారా? మనుష్యులు చూడక పోయినను సమస్తమును చూస్తున్న ఎల్ రోహి మనలను చూసే దేవుడు ఆయన కొరకు మనం చేసే ప్రయత్నాలు మరియు మనం పడే కష్టాలు ఆయన ఏరిగే ఉన్నారు. ఆయన మనలను క్షణ మాత్రం విడిచి పెట్టే వారు కాదు. మీరు ప్రభువు కొరకు చేసే ప్రతిఫలం నిశ్చయముగా దేవుడు తగిన సమయంలో ఇస్తారు. ఆమెన్.

- బ్రదర్. హరీష్ శామ్యూల్ గారు

 

ప్రార్థన అంశం:-

మన చిన్న పిల్లల భవిష్యత్ కొరకు ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al holiganbet giriş holiganbet padişahbet bets10 extrabet royalbet süperbetin padişahbet betcio royalbet casinoroyal queenbet bahiscasino betcio bahiscasino atlasbet padişahbet betpas bahiscasino celtabet queenbet casibom jojobet jojobet casibom holiganbet restbet safirbet