By Village Missionary Movement
Thursday, 04-Nov-2021దిన ధ్యానము(Telugu) 04.10.2021
అంశం:- మరణ భయం లేదు.
"అద్దరికి పోవుదమని వారితో చెప్పగా" - మార్కు 4:35
ఆప్ఘనిస్తాన్ దేశాన్ని తాలిబన్లు ముట్టడి వేసినప్పుడు ప్రతి ఒక్కరు తమ కుటుంబాలతో దేశ సరిహద్దులు విడిచి బయటకు వెళ్ళడానికి చాలా కష్ట పడ్డారు. అప్పుడు ఒక బాలిక గోడను ఎక్కలేకపోయింది. ఆ సంఘటన చూసిన వెంటనే అమెరికాకు చెందిన కొందరు సైనికులు తమ చేతులను మెట్లు వలె ఉంచారు. ఆ చేతుల పై నుండి ఎక్కి సరిహద్దులు దాటి వెళ్లిపోయారు. ఆ బాలికకు ఆ సరిహద్దు దాటుటకు సహాయం చేసిన ఆ సైనికులకు కృతజ్ఞతలు తెలుపుతూ కొత్త సరిహద్దు వైపు ప్రయాణం చేశారు ఆ దేశస్తులు.
పరిశుద్ధ గ్రంధంలో మార్కు సువార్త 4వ అధ్యాయం 35వ వచనంలో యేసు తన శిష్యులను అద్దరికి పోవుదమని పిలిచారు కాని మధ్యలో తుఫాను రేగి అలలు కొట్టి దోనే నిండిపోయే పరిస్థితి అది వారికి చాలా ప్రమాదకరమైన సమయం యేసును నమ్ముకొని అద్దరి వెళ్ళుటకు దోనె ఎక్కాము కాని ఇప్పుడు సగం మార్గంలో మునిగిపోతాము అనే భయం కలగడంతో యేసు పై కోపపడ్డారు. యేసుక్రీస్తు వెంటనే లేచి గాలిని గద్దించారు. నిశ్శబ్దమై ఊరకుండుము అని సముద్రమును చూసి గద్దించారు. వెంటనే గాలి అనిగి మిక్కిలి నిమ్మల మాయెను. తరువాత 5వ అధ్యాయం 1వచనంలో మనం చూసినట్లు అయితే వారు ఆ సముద్రమునకు అద్దరి ఉన్న గెరాసేనుల దేశమునకు వచ్చిరి అని మనం చూడగలం.
ప్రియమైన స్నేహితులరా! ఈ ఘోరమైన వ్యాధి కాలంలో మనకు ప్రతి రోజు కలిగే ప్రశ్న నేను అద్దరికి వెళ్తానా అనేదే. మొదటి దశ, రెండవ దశ ఇప్పుడు మూడవ దశ రాబోతుంది అంటున్నారు. ఇంక ఎన్ని దశలు వస్తాయో మనకు తెలియదు. కాని వచ్చిన వ్యాధిని గద్దించి మనలను జీవిత అద్దరికి చేర్చుటకు యేసయ్య మనతో ఉన్నారు. కాబట్టి వచ్చే దినములు బట్టి బయపడవద్దు. యేసు పైన అనుకొని విశ్వాసంతో ఉన్నట్లు అయితే మనలను మన కుటుంబములను మరియు దేశం అంతటిని అద్దరికి తీసుకు వెళ్లి చేర్చుతారు. ఆయన మాట సెలవియ్యగా దాని ప్రకారం ఆయెను, ఆయన ఆజ్ఞ పంపగానే కార్యము స్థిరపరచబడెను. ఇటువంటి దేవుని మాటలను గుర్తు చేసుకుందాం. నిశ్చయముగా ఈ కరోనా దశల రోజులను దాటి ప్రకృతి సంబంధమైన జీవితం అనే అద్దరికి వెళ్లడం నిశ్చయం. మనలను తీసుకొని వెళ్లేవారు యేసుక్రీస్తు మాత్రమే. ఆమెన్
- బ్రదర్. టి. శంకర్ రాజన్ గారు
ప్రార్థన అంశం:-
బ్రదర్ డేవిడ్ గణేషన్ గారు సామాజిక వెబ్ సైట్ లో దేవుని వాక్యమును ప్రకటించినప్పుడు వినే ప్రతి ఒక్కరూ విడుదల పొందేటట్లు ప్రార్థిద్దం.
*Whatsapp*
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.
ఈమెయిల్: reachvmm@gmail.com
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250