By Village Missionary Movement
Tuesday, 02-Nov-2021దిన ధ్యానము(Telugu) 02.10.2021
అంశం: అధిగమించే ప్రయత్నం.
"నన్ను బలపరచువానియందే నేను సమస్తమును చేయగలను" - ఫిలిప్పీయులకు 4:13
పుట్టినప్పుడే 1200 గ్రాముల తక్కువగా పుట్టిన బిడ్డే లిజి . ఈమెకు బరువు పెరగకుండా చేసే లియో హెటెల్ బ్రష్ రైట్ సిండ్రోమ్ వ్యాధి ఉండేది. ఈమెకు కుడి కన్ను కనిపించదు. ఇంకా చాలా బలహీనతలు మరియు అంద వికారమైన రూపంతో విచిత్రముగా ఉండడం వలన చాలా మంది ఎగతాళి చేసేవారు. లిజి అద్దంలో తన ముఖాన్ని చూసి దేవుడు నన్ను ఎందుకు ఇలా సృష్టించారు అని ఏడుస్తూ ఉండేది. 17 సంవత్సరాల వయస్సులో యూట్యూబ్ లో ప్రపంచంలోనే అందవికారమైన స్త్రీ అనే పేరుతో వచ్చిన వీడియోలో ఈమె ఫోటో వచ్చింది. ఆ వీడియోను 40 లక్షల మంది కంటే ఎక్కువ మంది చూసారు. దానిలో చాలా తప్పుడు విమర్శలు వచ్చాయి. దానిని చూసి కృంగిపోయి బాధపడుతుండేది. తరువాత నేను ఎందుకు నన్ను తక్కువగా అంచనా వేసి చిన్న గీత లోపలే బ్రతకాలి అని అనుకొని యూట్యూబ్ ఛానల్ ఒకటి ప్రారంభించి హౌ టు యు డిఫెండ్ యువర్ సెల్ఫ్ అనే అంశంతో మాట్లాడిన మోటివేషన్ స్పీచ్ కు 54 మిలియన్ల ప్రేక్షకులు ఆదరించారు. ఇంకా చాలా చోట్ల మోటివేషన్ స్పీచ్ ఇస్తూ వస్తున్నారు.
మోషే వేరే దేశంలో తన మామ ఇంట్లో ఒంటరిగా గొర్రెలను మేపే వాడిగా అరణ్యంలో తిరుగుతున్నప్పుడు దేవుడు అగ్నితో కాలుతున్న ముండ్ల పొద మధ్యలోనుండి ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు ప్రజల బానిసత్వం నుండి కాపాడుటకు నువ్వు వెళ్ళు నేను నీతో కూడా ఉంటాను అని మాట్లాడారు. కాని మోషే మాత్రం నేను ఏపాటి వాడను, వారు నన్ను నమ్మరు నీవు పంప తలంచు వానిని పంపుము అన్నాడు. మోషే ఇలాగే గొర్రెలు మేపుతూ తన భార్య పిల్లలతో కలసి జీవించవచ్చు అని గీత గీసుకొని ఉండాలి అనుకున్నాడు. కాని దేవుడు మోషేను విడిచిపెట్టలేదు. తరువాత మోషే దేవుని మాటను అంగీకరించాడు కాబట్టి ఆయన గొప్ప నాయకునిగా మారాడు.
దీనిని చదువుతున్న ప్రియమైన వారలారా! మీరు నేను కూడా అదేవిధంగా వుండాలి. ఈ కళాశాలలో నేను చదవాలి, ఇన్ని మార్కులే నాకు రావాలి అలా జరిగితేనే నేను చక్కగా చదవగలను. ఇది లేని జీవితం జీవితమేనా అనే చిన్న గీతలో జీవిస్తున్నప్పుడు దానికి బదులుగా పరిస్థితులు మారినప్పుడు పిచ్చి మాటలను మాట్లాడుతున్నాము. బదులుగా దేవుని యొక్క గొప్ప ప్రణాళికకు మనలను మనము అప్పగించు కొనుటకు ప్రయత్నం చేద్దాం. లీజి ఏడ్చినా సరే లేచి ఇంకా అనేకులను ఉత్సాహ పరిచే స్పీకర్ గా, అనేకుల జీవితాలతో మంచి ఆలోచనలను కలుగజేసే దానిగా ఉన్నారు. తన వలె మీరు ఎడ్వాండి కాని కృంగి పోకుండా మోషే దేవుని చిత్తాన్ని అంగీకరించిన విధంగా దేవుడు మీకంటూ ఇచ్చిన స్కూల్, కాలేజ్ వంటి వాటిని అంగీకరించి జీవించి నప్పుడు మీ జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుంది. జీవితంలో కృంగిపోయి కూర్చొనక లేచి ముందుకు సాగుతేనే విజయం.
- శ్రీమతి. అన్బు జ్యోతి స్టాలిన్ గారు
ప్రార్థన అంశం:-
పాఠశాలలకు వెళ్తున్నా సేవకుల పిల్లలను దేవుడు సంరక్షించేలా ప్రార్థిద్దాం
*Whatsapp*
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.
ఈమెయిల్: reachvmm@gmail.com
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250