Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

అనుదిన ధ్యానము:-01-11-2021
Share:

By Village Missionary Movement

Monday, 01-Nov-2021

అనుదిన ధ్యానము:-01-11-2021

 

అంశం: నావలే అవ్వండి.

 

 

 

"అప్పుడు యేసు ఆ త్రోవను రానై యుండెను గనుక అతడు ముందుగా పరుగెత్తి, ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టెక్కెను". (లూకా 19: 4)

 

యెరికో అనేది ఒక అందమైన పట్టణము. ఇశ్రాయేలు దేశంలో ఉన్న ఈ పట్టణం రొమా ప్రభుత్వం యొక్క అధికారం క్రింద ఉండేది. అక్కడ చాలా.ప్రభుత్వ కార్యాలయాలు, పన్ను వసూలు చేసే ఆఫీస్ లు కలవు. పురాతన నగరం యొక్క విధిని విస్తరించేందుకు, మార్గం కోసం ఇలా ఇంకా కొన్ని ఆవసరతలు కోసం అక్కడ ఉన్న చెట్లును నరికివేశారు. కాని వాటిలో చిక్కకుండా ఒక్క మేడి చెట్టు మాత్రమే చాలా సంవత్సరాలు నిలబడి ఉంది. ఇక ఆ చెట్టే ఎమి మాట్లాడుతుందో విందమా. 

 

ఒకరోజు ఆ త్రోవను యేసు రానైయుండెను అనే వార్త ఉత్తేజంగా చెప్పుకోబడింది. దానిని విన్న నేను అనుకున్నాను ఈ రోజు నా నీడలో అనేకులు విశ్రాంతి తీసుకుంటారు అని, అప్పుడు ఒక పొట్టి మనుష్యుడు జనుల గుంపు మధ్యలోనుండి యేసుని చూడలేక కష్టపడుతున్నాడు. అకస్మాత్తుగా అతను పరిగెత్తుకొని వచ్చి నా మీద ఎక్కుటకు ప్రయత్నం చేసాడు. అతను అన్యాయముగా పన్ను వసూలు చేసేవాడు అని ఎరిగి యున్నాను నేను కాని అతను నా పైకి ఎక్కుటకు నిశ్శబ్దంగా నన్ను అప్పగించు కున్నాను. యేసుని చూచుటకు అతనికి సహాయ పడ్డాను. కొంచం సమయం అతనిని మోస్తూ నిలబడ్డాను. గొప్ప అద్భుతం జరిగింది యేసు నా దగ్గరకు వచ్చిన వెంటనే కన్నులెత్తి చూచి జక్కయ్య త్వరగా దిగుము నేడు నేను నీ ఇంట ఉండవలసి యున్నదని అతనితో చెప్పెను. ఈయన పాపి అయిన మనుష్యుని యొద్ద బస చేయుటకు వెళ్ళి యున్నాడు అని అందరికి కోపం. కాని నాకు మాత్రం చాలా సంతోషం. కొంచం సమయం పేద, అనాధల చేతుల్లో డబ్బు వారు మాట్లాడుతున్నది గమనిస్తూ వచ్చాను. జక్కయ అన్యాయముగా తీసుకున్న దానికి నాలుగంతలుగా ఇస్తున్నాడు. మరియు కొన్ని నిమిషాల్లోనే యేసు ఇతనిని ఇలా మార్చేశారు అని అందరూ అనుకుంటున్నారు. దానిని విన్న నేను నా సంతోషానికి అవధులు లేవు. 

 

ప్రియమైన వారలారా! మీకు జక్కయ్య వలె తిరిగి ఇవ్వడం కష్టంగా ఉండవచ్చు కాని నా వలె జీవించడం చాలా సులువు. నేను జక్కయ్యను నాపై ఎక్కుటకు అనుమతించినట్లుగా మీరు కూడా పాపులను అంగీకరించండి. నేను కొంచెం సేపు అతనిని మోసి నట్లు మీరు వారి యొక్క బలహీనతలను భరించండి. మీకు తెలిసినది వారికి నేర్పించండి. యేసును వారు చూచేలా అన్ని రకములైన సహాయములు చెయ్యండి. నేను ఒక్క రోజు మాత్రమే ఉపయోగించబడ్డాను. కాని నాపై ఎక్కిన జక్కయ్య మాత్రం కొన్ని వేల సంవత్సరాలుగా మాట్లాడబడుతూనే ఉన్నాడు. మరి మీరు నడిపించే వ్యక్తులు కూడా అలానే రావచ్చుకదా. ఇతరులు యేసుక్రీస్తును కనుగొనుటకు మీరు చెయ్యవలసిన చిన్న చిన్న కార్యములను చెయ్యండి. నిశ్చయముగా అది అనేక జీవితములకు ఆశీర్వాదకరంగా మారుతుంది. మన కొరకే బ్రతికి మరణంచడంలో ఏం సంతోషం ఉంది. ఇతరుల జీవితములు మార్చ బడుటకు వాళ్ళ యొక్క ఆశీర్వాదం కొరకు బ్రతుకుటలోనే కదా! మనకు ఉత్సాహం ఉంది. ఏంటి నిజమే కదా! 

 

 

                        బ్రదర్. కె.డేవిడ్ గణేషన్ గారు

 

 

ప్రార్థన అంశం:-

 

ఈ నెల అంతా జరగబోయే సేవలలో దేవుని హస్తం మనకు తోడైయుండి నడిపించే లాగున ప్రార్థిద్దాం.

 

 

 

తమిళ్ కోరకు +91 9444011864, ఇంగ్లీష్ కొరకు +91 8610984002 , హిందీ కొరకు +91 9385810496 , తెలుగు కోసం+91 9442493250.

 

 

ఈమెయిల్: dailydevotion@vmm.org.in Androidapp: https://play.google.com/store/apps/details?id=com.vmmorg.template.msmapp&showAllReviews=true

 

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 9442493250. 

ఈ దిన ధ్యాన సందే శమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు 9444011864 అనే నెంబర్ ను సంబ్రదించగలరు.



hacklink satın al perabet perabet giriş safirbet safirbet giriş betasus betasus giriş virüsbet medusabahis medusabahis giriş grandpashabet grandpashabet giriş jojobet jojobet giriş vaycasino vaycasino giriş pusulabet pusulabet giriş perabet perabet giriş perabet perabet giriş matbet slot oyna perabet perabet giriş hiltonbet perabet perabet perabet betnano holiganbet galabet kalebet holiganbet