Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 30.10.2021
Share:

By Village Missionary Movement

Saturday, 30-Oct-2021

దిన ధ్యానము(Telugu) 30.10.2021

 

అంశం: యదార్థత.

 

"యథార్థముగా ప్రవర్తించువాడు నిర్భయముగా ప్రవ ర్తించును. కుటిలవర్తనుడు బయలుపడును" - సామెతలు 10:9

 

ఒక రోజు బ్యాంక్ లో ఉన్న అందరి మొకాల్లో భయం కనబడింది. కాని ఎప్పటి లాగానే బ్యాంక్ పనిచేస్తూ ఉంది. మరుసటిరోజు ఆ బ్యాంక్ కు పోలీసులు వచ్చారు. ఆ బ్యాంక్ లో 10 లక్షలు రూపాయలు మోసం జరుగుటను గూర్చి విచారించారు. రాజన్ మాత్రం బయపడ కుండా ఉన్నాడు. క్యాషియర్ అయిన అతనిని పోలీసులు ప్రశ్నలు లోతుగా అడిగారు. దానికి రాజన్ చాలా బాధపడ్డాడు. అప్పుడు మేనేజర్ వచ్చి ఇతను ఈ పని చేసే అవకాశం లేదు ఇతను యదార్థముగా నిజాయితీగా ఉంటాడు అని అన్నారు. తరువాత కొంచం కూడా అనుమానించుటకు అవకాశం లేని ప్యూన్ అయిన భరత్ పై పోలీసుల దృష్టి వెళ్ళింది. చివరిలో అతనే నకిలీ సంతకం పెట్టి మోసం చేసాడు అని తేలిసింది. అందరికి తెలిసిన రాజన్ యొక్క నిజాయితీ అతనిని కాపాడింది. 

 

రాజైన యెహోషాపాతు యెహోవాకు భయపడి ఆయన యొక్క ఆజ్ఞలకు లోబడి జీవించాడు. తన రాజ్యము అంతటితో ఉన్న దేవతా స్తంభములను పడగొట్టి, అన్యదేవతల బలిపీఠములను కూలగొట్టి ప్రజలు యెహోవాను వెంబడించు లాగున చేసాడు. యెహోషాపాతు రాజై ఉన్నప్పటికీ అతని హృదయం యెహోవా మార్గంలో ఉత్సాహంగా ఉండేది. ఏ పని చేసిన యెహోవా యొద్ద విచారణ చేసి చేసేవాడు. ఒక సారి యుద్ధానికి వెళ్ళినప్పుడు యెహోవా వెళ్ళవద్దని చెప్పినా సరే ఇశ్రాయేలీయుల రాజుకు తోడుగా వెళ్ళాడు. యుద్ధంలో ఇశ్రాయేలీయుల రాజు చంపబడ్డాడు. ఇతను తన నగరమునకు తిరిగి వెళుతుండగా దేవుడు తన దీర్గదర్శి మూలముగా నీవు చెడ్డ రాజుతో కలిసి యుద్ధమునకు వెళ్లడం వలన యెహోవా కోపం నీ పై రావాల్సి ఉన్నది. కాని నీవు చేసిన మంచి క్రియల వలన కోపం నీ మీదకి రాలేదు అని అన్నారు. వెంటనే తన తప్పును ఎరిగిన రాజు న్యాయాధిపతులు యెహోవా యొక్క ఆజ్ఞలు బట్టి న్యాయం విచారించండి అని చెప్పి మళ్ళీ యెహోవా మార్గంలో నడిచారు. దీని మూలముగా యదార్థవంతులకు యెహోవా తోడు అనేది తాను నేర్చుకొన్నట్లు చెప్పారు. 

 

ప్రియమైన వారలారా! మీరు కూడా మీ కుటుంబాలలో, మీ ఉద్యోగ స్థలాల్లో ఎలా వుంటున్నారు ఈరోజు పరిశీలన చేసి చూడండి. యెహోవాకు భయపడి నిజాయితీగా, యదార్ధముగా నడుచుకుంటే ఆపత్కాలములో ఆయన మనకు తోడుగా వుంటారు. ఏ ఒక్క విషయంలో కూడా కొంచెం తప్పిపోయినప్పుడు ఇది తప్పు అని యెహోవా యెహోషాపాతుకు తెలియజేసినట్లు మీకు కూడా తెలియ జేస్తారు. అప్పుడు మీరు మిమ్మును సరిచేసు కొనండి. మీరు మళ్ళి నిజమైన యదార్ధమైన దారిలోకి వచ్చేస్తారు. శోధన, బాధ వచ్చినప్పుడు సాతాను నిజాయితీగా, యదార్థముగా నడిచి నీవు ఏమి సంపాదించావు దుర్మార్గునిగా ఉండి సంతోషంగా ఉండవచ్చు కదా ఇది మాయా ప్రపంచం. దుర్మార్గానికి మాత్రమే తోడు ఉంటుంది, నిజాయితీకి కాలమే లేదు అని నిలకడలేని మాటలను మాట్లాడతాడు. కాని మీరు వాటిని చెవిని పెట్టక దేవుని యొద్ద ప్రార్ధించి దైర్యంగా ఉండండి. రాజన్ కు మేనేజర్ సాక్ష్యం చెప్పినట్లు మీ గురించి ప్రపంచం సాక్ష్యం చెప్పనివ్వండి. యెహోవా మీకు తోడుగా ఉన్నారు భయపడకుండా ముందుకు సాగండి, భద్రంగా ఉండండి. 

- శ్రీమతి. అన్బు జ్యోతి స్టాలిన్ గారు

 

ప్రార్థనా అంశం:-

వైద్య సేవలు గెత్సేమనే క్యాంపస్ లో ప్రారంభించాం దీని ద్వారా శారీరకంగా, ఆత్మీయ పరంగా అనేక మంది స్వస్థత పొందుకొనేటట్లుగా ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al perabet perabet giriş safirbet safirbet giriş betasus betasus giriş virüsbet medusabahis medusabahis giriş grandpashabet grandpashabet giriş jojobet jojobet giriş vaycasino vaycasino giriş pusulabet pusulabet giriş perabet perabet giriş perabet perabet giriş matbet slot oyna perabet perabet giriş hiltonbet perabet perabet perabet betnano holiganbet galabet kalebet holiganbet