Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 29.10.2021
Share:

By Village Missionary Movement

Friday, 29-Oct-2021

దిన ధ్యానము(Telugu) 29.10.2021

 

అంశం: తీర్మానం-ఫలితం

 

"నమ్మకమైనవానికి దీవెనలు మెండుగా కలుగును. ధనవంతుడగుటకు ఆతురపడువాడు శిక్షనొందక పోడు" - సామెతలు 28: 20

 

హేన్రి బి ప్రోవెల్ అనే ఆయన ధనవంతుని కుటుంబంలో పుట్టినప్పటికి చిన్న తనం నుండి క్షయ వ్యాధితో బాధింపబడి పాఠశాల విద్యను విడిచి పెట్ట వలసివచ్చింది. అతడు ఒకరోజు డీఎల్ మోడీ గారి ప్రసంగం విని ఈ విధముగా తీర్మానం తీసుకున్నారు. నేను ప్రసంగం చెయ్యలేను కాని చిన్న పరిశ్రమ అధికారిని అవ్వగలను. ప్రభువా నేను ప్రారంభించబోయే ఉద్యోగంలో మంచి లాభం పొందుకొనేటట్లు సహాయం చెయ్యండి. నిజాయితీగా నీ సేవను చేస్తాను అని మ్రొక్కుబడి చేసుకున్నారు. ఆ తరువాత ఓహియో అనే స్థలములో క్వా కేర్ మిల్ అనే ఓట్స్ తయారు చేసే పరిశ్రమను నిర్మించారు . 10 సంవత్సరాల లోపు అమెరికాలో ఓట్స్ ఉదయకాలపు బోజనముగా మారిపోయింది. అతను కూడా దశమ భాగాన్ని నిజాయితీగా ఇవ్వడం మొదలు పెట్టారు. ఈనాడు క్వాకర్ ఓట్స్ ప్రపంచ వ్యాప్తంగా వ్యాపించి అనేకులు వాటిని ఉపయోగిస్తున్నారు. ఒక మనుష్యుని యొక్క నిజాయితీ వలన అతని యొక్క క్రియలలో మరియు ఉద్యోగంలో దేవుడు అతనిని ఆశీర్వదించారు. 

 

పరిశుద్ద గ్రంధంలో ఏలియా అనే ప్రవక్త మనకు తెలుసు. యజమానురాలైన ఆ స్త్రీ యొక్క కుమారుడు వ్యాధిగ్రస్తుడాయెను. అప్పుడు ఏలియా ఆ చిన్న వానికి ప్రాణం మరలా రానిమ్మని యెహోవాకు ప్రార్ధించాడు. యెహోవా ఏలియా స్వరాన్ని విన్నారు. ఆ చిన్న వానికి ప్రాణం మరల వచ్చింది. దానిని చూసిన ఆ స్త్రీ నీవు దైవజనుడవై యున్నావనియు, నీవు పలుకుచున్న యెహోవా మాట నిజమనియు ఇందు చేత నేను ఎరుగుదుననెను. ఏలియా యొక్క నోటినుండి సత్యమైన దీర్ఘదర్శన మాటలు చనిపోయిన ఆ చిన్న వాడిని బ్రతికించాయి. 

 

దీనిని చదువుతున్న ప్రియమైన వారలారా! నిజాయితీ గల మనుష్యులే ఆశీర్వదములను పొందుకోగలరు. ఈరోజుల్లో మనం యేసుని నిజాయితీగా వెతుకుతున్నామా? ఆయన సన్నిధిలో ప్రార్ధించే సమయాల్లో నిజాయితీగా ప్రార్ధించ గలుగుతున్నామా? పరిశుద్ద గ్రంధం చదవవలసిన, ధ్యానించ వలసిన సమయాల్లో మన దగ్గర నిజాయితీ ఉందా? ఒక్కసారి అలోచిద్దాం. దీనిని చదువుతున్న మీరు ఒక చిన్న ఉద్యోగస్తులై ఉండవచ్చు, మీ ఉద్యోగాల్లో, విద్యలో నిజాయితీ ఉందా? మన యొక్క కార్యాలలో మనం దేవుని ముందు నిజాయితీగా ఉన్నట్లయితే మనం ఆయన యొద్ద పరిపూర్ణ ఆశీర్వాదములను పొందుకొనవచ్చును. కావున మన యొక్క కార్యాలలో, మన యొక్క నోటి మాటల్లో నిజాయితీగా ఉందాం. ఆమెన్.

- శ్రీమతి. శక్తి శంకర్ రాజ్

 

ప్రార్థన అంశం:-

చిన్న పిల్లల పై చదువుల ఆవసరతలు సందింపబడేటట్లు ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al perabet perabet giriş safirbet safirbet giriş betasus betasus giriş virüsbet medusabahis medusabahis giriş grandpashabet grandpashabet giriş jojobet jojobet giriş vaycasino vaycasino giriş pusulabet pusulabet giriş perabet perabet giriş perabet perabet giriş matbet slot oyna perabet perabet giriş hiltonbet perabet perabet perabet betnano holiganbet galabet kalebet holiganbet