Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 28.10.2021
Share:

By Village Missionary Movement

Thursday, 28-Oct-2021

దిన ధ్యానము(Telugu) 28.10.2021

 

అంశం: దాచుకోలేనిది.

 

"అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును" - సామెతలు 28:13

 

ఒక రైతు పుచ్చకాయల మొక్కలను నాటాడు. ఒకసారి అతను నగరానికి ఒక పని కొరకు వెళ్ళవలసి వచ్చింది. కావున తన కుమారునితో పుచ్చకాయల తోటను చూసుకో ఫలములను తీసి తినవద్దు అవి ఇంకా పూర్తిగా పండలేదు అని చెప్పి వెళ్లారు. కుమారుడు తోటకు వెళ్లి కాసిన ఒక పుచ్చకాయను చూసాడు. దానిని తీసి ఒక రాయితో పగలగొట్టి తినేసాడు. తన తండ్రి చెప్పిన దానికి వ్యతిరేకంగా నడుచుకుంటున్నాను అని తెలిసి కూడా ఆయన చూస్తున్నారా ఏంటి? అని మనస్సు కు సద్దిచెప్పుకొని ఇంటికి వెళ్ళిపోయాడు. తండ్రి తిరిగి వచ్చి తోట అంతా చూసారు అయితే తన కుమారుడు చేసిన తప్పును కనుగొనలేకపోయారు. చాలా దినములు గడిచాయి. ఒక రోజు తన తల్లి పశువులను మేతకు తోలుకొని వెళ్తున్నప్పుడు ఆ స్థలంలో చిన్న చిన్న పుచ్చకాయ మొక్కలు ఉండటం చూసారు. కుమారుడు తిని పడవేసిన విత్తనముల నుండి ఈ మొక్కలు మొలిచాయి అనుకున్నారు. చాలా రోజుల తరువాత తాను చేసిన తప్పు బయటపడింది. దాని కొరకు ఆలోచిస్తున్న తండ్రితో దేవుడు ఈ విధంగా మాట్లాడారు. జీవితంలో కొన్ని సమయాల్లో మనుష్యులు చేసిన తప్పులు ఇతరులకు తెలియకుండా పోవచ్చు. ఇలా చేస్తే ఏ తప్పు కూడా ఎవరికి తెలియదు అనే కారణం వలన దాని గురించి జాగ్రత్త పడకుండ ఉన్నట్లు అయితే మనలను మనమే మోసపుచ్చు కుంటున్నాం. ఈ లోకంలో మనం చేసే తప్పులు ఏదో ఒక రోజు మనుష్యుల ముందు బయట పడి మనలను సిగ్గు పరుస్తాయి. అలా బయట పడకపోతే మరణం తరువాత దేవుని సింహాసం ముందు మనం నిలబడినప్పుడు అవన్నియు బయటపడతాయి. మన జీవిత సత్క్రియలు లేదా దుష్ క్రియలు అన్నియు దేవుని యొక్క జ్ఞాపకార్దపు పుస్తకంలో వ్రాయబడి ఉంటాయి. 

 

ప్రియమైన వారలారా! మన కుటుంబంలో ప్రతి ఒక్క కార్యక్రమం ద్వారా దేవుడు మనలను చూస్తూ మనతో మాట్లాడుతూనే ఉన్నారు. కాని మనమే ఆయన స్వరాన్ని వినడం లేదు. విషయం ఏదైనను దీనిలో నాకు ఏదైనా పాఠం ఉందా ? మనం ఏదైనా నేర్చుకోవాలా? మనం మారే విషయం ఏదైనా ఉందా? మనం సరిచేసుకొనే స్వభావం ఏమిటి అనే ఆలోచన మనకు ఉన్నట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు మాటలను మనం గ్రహిస్తాం

- శ్రీమతి. జబా గణేషన్

 

ప్రార్థన అంశం:-

సువార్త సేవకు అవసరమైన ధనము కొరకు ప్రార్థిద్దాం

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al perabet perabet giriş safirbet safirbet giriş betasus betasus giriş virüsbet medusabahis medusabahis giriş grandpashabet grandpashabet giriş jojobet jojobet giriş vaycasino vaycasino giriş pusulabet pusulabet giriş perabet perabet giriş perabet perabet giriş matbet slot oyna perabet perabet giriş hiltonbet perabet perabet perabet betnano holiganbet galabet kalebet holiganbet