By Village Missionary Movement
Tuesday, 26-Oct-2021దిన ధ్యానము(Telugu) 27.10.2021
అంశం: పరిపూర్ణ పరిశోధన.
"నీ హృదయములోనుండి జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటె ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము" - సామెతలు 4:23
40 సంవత్సరాలు వయస్సు మించిన వారు పూర్తి శరీర పరీక్ష చేసుకొనుట చాలా అవసరం అని వైద్యులు సలహా ఇస్తున్నారు. అప్పుడే మన శరీరంలో ఉండే అవయవముల పనితీరు తెలుసుకొని జాగ్రత్తగా మరియు ఆరోగ్యంగా బ్రతకగలరు అంటున్నారు. అదే విధంగా పరిశుద్ద గ్రంధం కూడా మన యొక్క ఆత్మీయ జీవితంలో ప్రతి ఒక్కరు హృదయాన్ని పరీక్షించి జాగ్రత్తగా కాపాడుకోవాలి అని మనకు సలహా ఇస్తుంది. అప్పుడే మన క్రైస్తవ్య జీవితం సౌకర్యవంతంగా ఉంటుంది.
47 సంవత్సరాలు వయస్సు గల వ్యక్తి తాను కూడబెట్టిన మరియు విస్తారమైన ఖర్చులు నిజమైన జీవితం యొక్క సంతోషం చూచుటకు ఆటంకంగా ఉంటాయి అని నిశ్చయించుకొన్నారు. తన యొక్క 4.7 మిలియన్ల డాలర్లు మరియు విలువైన ఆస్తులను ఇతరుల కోసం అంకితం చేశారు. కార్లియర్ ఫ్లీడర్ అని పిలువబడే ఈయన లండన్ యొక్క పత్రికలకు నేను నాకు అనవసరమైన, నచ్చని వస్తువులకు బానిసై నడిచిన ఒక అనుభూతిని అనుభవించాను. నా యొక్క సౌకర్య వంతమైన జీవిత శైలి ఎంతో భయంకరమైనది మరియు ఆధ్యాత్మిక అనుభూతి లేదని నేను ఏరిగినప్పుడు చాలా ఆశ్చర్య పడ్డాను అని ఇంటర్యూ ఇచ్చారు. అతని యొక్క ఆస్తి ఇప్పుడు లాటిన్ అమెరికాలో ఉంటున్న పేద వారికి సహాయ పడుతుంది. ధనం హెచ్చినను దానిని లక్ష్యపెట్టకుడి అని కీర్తనలు 62:10లో మనం చదువుతున్నాం. నీ ధనం ఎక్కడ ఉండునో నీ హృదయం అక్కడనే ఉండును అని మత్తయి సువార్త 6:21వ వచనంలో యేసుక్రీస్తు కొండ మీద ప్రసంగంలో చెబుతున్నారు. జీవితంలో మన సంతోషం పాడుచేయుటలో ధనం పై ఆశ, వస్తువుల పై ఆశ ఇటువంటివి ప్రధాన భాగాన్ని వహిస్తున్నాయి. ఇటువంటి ఆశలు మనలో ఉన్నాయా అనేది పరిశుద్ద గ్రంథ వాక్య సహాయముతో మన హృదయమును అన్వేషించి చూడాలి. వస్తువుల పైన ఉన్న ఆశ వలన సౌకర్యవంతంగా జీవించి దాని వలన దేవుని రాజ్యాన్ని కోల్పోయిన అనేక మంది గూర్చి పరిశుద్ద గ్రంధం మన కన్నుల ముందు ఉంచి హెచ్చరిస్తోంది. కాబట్టి జాగ్రత్తగా మన హృదయమును దేవుని పరిశుద్ద వాక్యంతో కాపాడుకుందాం.
- బ్రదర్. పి. జాకబ్ శంకర్
ప్రార్థన అంశం:-
సువార్త సేవలో సమర్పించబడిన పార్ట్ టైం మిషనరీలు మరియు వాలేంటిర్ లు అనేక మంది పాల్గొనేటట్లు ప్రార్థిద్దాం.
*Whatsapp*
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.
ఈమెయిల్: reachvmm@gmail.com
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250