Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 05.01.2021
Share:

By Village Missionary Movement

Tuesday, 05-Jan-2021

దిన ధ్యానము(Telugu) 05.01.2021

సిద్ధమేన.

"చిత్తగించుము నేనున్నాను నన్ను పంపు మనగా" - యెషయా 6: 8

తమిళనాడు దక్షిణ భాగమునకు వచ్చి బలముగా పరిచర్య చేసిన వ్యక్తి ఎమి.కార్మికేల్. ఆమె భారతదేశం నకు రావడానికి గల కారణం ఏమిటో తెలుసా? ఆమె చూసిన దర్శనమే. ఆమె ఒక విశాలమైన ఇరువైపులా కూడా అఘాదము ఒకటి కనబడుతుంది అది గొయ్యి కాదు పాతాలమే. అనేకులు నడుస్తూ ఆ మార్గములో కాలు జారి అందులో పడిపోవడం ఆమె చూసారు. వాళ్ళను శ్రద్ధగా గమనించినప్పుడు వాళ్లకు కన్నులుండియు గ్రుడ్డివాళ్లుగా మార్గము గ్రహించని వాళ్లుగా ఉండుట ఆమె గ్రహించారు. ఈ దర్శనము చూచిన వెంటనే దేవుని మాటకు లోబడి ఇదిగో నేను ఉన్నాను నేను వస్తున్నాను అని తనను తాను సమర్పించుకొని భారతదేశమునకు మిషనరీగా వచ్చారు ఆమె. 

అపోస్తులకార్యములు చదువుతున్నప్పుడు ఫిలిప్పు సమరియా నుండి యేసుని ప్రకటించి వచ్చారు. ప్రజల మధ్యలో యేసు క్రీస్తు నామములో  అద్బుతములు చేస్తూ వచ్చారు. అందువలన ఆ పట్టణములో మిక్కిలి సంతోషం కలిగింది. ఆ ఆసమయంలో ఆయనను పరిశుద్దాత్మ దేవుడు ఆయనను నీవు అరణ్యములో ప్రయాణము చేయుము అని చెప్పారు. అయ్యో ప్రభువా అరణ్యమునకు అక్కడ ఎవరు ఉంటారు ? నా నిమిత్తము ఈ పట్టణములో సంతోషము కలుగుతుంది కదా! నేను చక్కగా పరిచర్య చేస్తున్నాను కదా! అని యోనా వలె చెప్పకుండ వెంటనే ఎండిపోయిన అరణ్య ప్రాంతమునకు వెళ్లారు. అక్కడ  ఐతియొపీయ దేశ మంత్రికి సువార్త ప్రకటించి నందున ఆ మంత్రి ద్వారా ఆ దేశమంతటికి సువార్త తీసుకు వెళ్లబడింది.  తరువాత ఫిలిప్పు అజోతులో కనబడెను. అక్కడనుండి కైసరయకు వచ్చువరకు అతడు పట్టణములన్నిటిలో సంచరించుచు సువార్త ప్రకటించుచు వచ్చెను అని బైబిల్లో చదువుతున్నాం.

దేవుని పిల్లలరా! వెంటనే విధేయత చూపుటకు, ఆలస్యంగా విధేయత చూపుటకు వ్యత్యాసము కలదు. ఎమి కార్మికెల్ సమర్పించి భారతదేశంలో గల తమిళనాడుకు వచ్చినందున అనేక మంది స్త్రీలు పిల్లలు కాపాడబడ్డారు. ఫిలిప్పు తనను ఎండిపోయిన అరణ్య కష్టమునకు సమర్పించుకున్నారు. అలాగే మీ ద్వారా మీ గ్రామస్తులు, బంధువులు, స్నేహితులు నరకం నుండి తప్పించబడ్డారా? మీరు బైబిల్ చదువుతున్నారు అని వాళ్లకు తెలుసు కాని మీ బైబిల్ యొక్క కేంద్ర బిందువు యేసుక్రీస్తు అని వాళ్లకు తెలియదు. నాకు పిలుపు ఏమి లేదు అని చెప్పిన యెడల మత్తయి సువార్త 28:18-20 ద్వారా పిలుపు అందరికి ఉంది. మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వ సృష్టికి సువార్త ప్రకటించి శిష్యులను తయారు చేయండి అనే పిలుపుకు లోబడండి. మీ ద్వారా అనేకులు వెలుగు లోనికి రానివ్వండి. దేవుని ప్రణాళిక నెరవెరనివ్వండి. జనముల మధ్యలో నిత్యమైన ఆనందం కలుగనివ్వండి.
-    శ్రీమతి. సుసన్నా మ్యాత్యు

తిరువళ్ళుర్ ఫీల్డ్ లో నదియా అనే సహోదరి అప్పుల బాధలో ఉండి ఆత్మహత్య అనే తలంపు నుండి విడిపించబడేటట్లు ప్రార్థిద్దాం.

ఈ దిన ధ్యానవాక్యం కొరకు ఈ క్రింద నoబర్లును సంప్రదించండి
వాట్సాప్ తమిళ్ కొరకు +91 94440 11864, 
ఇంగ్లీష్ కొరకు +91 86109 84002, 
హిందీ కొరకు +91 93858 10496
తెలుగు +91 94424 93250

ఈమెయిల్: reachvmm@gmail.com
Androidapp: https://play.google.com/store/apps/details?Id=com.vmmorg.template.msmapp&showAllReviews=true

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al perabet perabet giriş safirbet safirbet giriş betasus betasus giriş virüsbet medusabahis medusabahis giriş grandpashabet grandpashabet giriş jojobet jojobet giriş vaycasino vaycasino giriş pusulabet pusulabet giriş perabet perabet giriş perabet perabet giriş matbet slot oyna perabet perabet giriş hiltonbet perabet perabet perabet betnano holiganbet galabet kalebet holiganbet