Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 20.10.2021
Share:

By Village Missionary Movement

Tuesday, 19-Oct-2021

దిన ధ్యానము(Telugu) 20.10.2021

 

అంశం: లాభమా? నష్టమా?

 

“భక్తిహీనతవలన ఎవరును స్థిరపరచబడరు నీతిమంతుల వేరు కదలదు" - సామెతలు 12:3

 

పరిశుద్ద గ్రంధంలో దేవుడు నీతిమంతులను కర్జూరపు వృక్షం మరిము లెబానోను మీది దేవదారు వృక్షములతో పోల్చి చెప్పిన వాక్యములు మనం చదువుతున్నాం. కర్జూరపు వృక్షము మిక్కిలి వేడి గల ప్రాంతంలో పెరిగేది దానికి ఎవ్వరు కూడా నీరు పోయడం లేక జాగ్రత్తగా చూడవలసిన అవసరం లేదు. అయితే నీరు లేక తీవ్రంగా ఎండిపోయిన కూడా కర్జూరపు వృక్షం ఎండిపోకుండా పెరుగుతుంది. దాని యొక్క భాగాలు అన్ని మనకు ఉపయోగ కరమైనవే. అదేవిధంగా లెబానోను మీది దేవదారు వృక్షం గురించి కీర్తనలు 92:12 లో ప్రత్యేకంగా వ్రాయబడి ఉన్నది. లెబానోను అనేది తెల్లని మంచుతో నిండిన స్థలం. అటువంటి మంచులో ఏ ఒక్క చెట్టు కూడా పెరిగి అభివృద్ధి చెందుటకు అవకాశం లేదు. కాని అక్కడ దేవదారు వృక్షం సుమారుగా 160 అడుగుల వరకు పెరుగుతుంది. పర్వతాలను చీల్చుకుంటూ 180 అడుగుల వరకు దాని వేర్లు వెళ్లి అద్భుతంగా పెరిగి నిలబడి ఉంటుంది. భయంకరమైన చలిలో కూడా ఈ వృక్షం ఆ వాతావరణం తట్టుకొని పెరుగుతుంది. 

 

ఇదే విధంగా పరిశుద్ద గ్రంధంలో రూతు మరియు ఓర్పా వీరిద్దరూ ఒకే కుటుంబంలో జీవించిన వారు అయినప్పటికీ మోయాబు దేశం నుండి తిరిగి వచ్చే మార్గంలో నయోమి తన కోడళ్ల ఇద్దరి యొద్ద తన పరిస్థితి వివరిస్తుంది. అనుకూలమైన పతిస్థితిని గ్రహించిన ఓర్పా తన అత్తను ముద్దు పెట్టుకొని ఆమె తన సొంత దేశం అయిన మోయాబుకు తిరిగి వెళ్ళి పోయింది. కాని రూతు మాత్రం కఠినమైన ఆ పరిస్థితుల్లో కూడా ఆమె తన అత్తను నమ్మి యవ్వన స్త్రీవలె తనకు తెలియని ఆ దేశానికి అత్త వెనకే వెళ్ళింది. తన అత్త యొద్ద నీవు వెళ్లిన చోటికే నేను వచ్చెదను, నీవు నివసించే చోటునే నేను నివసించెదను, నీ ప్రజలే నా ప్రజలు, నీ దేవుడే నా దేవుడు మరణం తప్ప మరి ఏదియు మనలను విడదీయలేదు అని విడువక పట్టుకుంది. ఆమె అన్య దేశస్తురాలైనప్పటికి దేవుడు తన వేరు మొలిచేటట్లు చేశారు. మత్తయి సువార్త 1వ అధ్యాయం 5వ వచనంలో దావీదు యొక్క వేరును కూడా ఇశ్రాయేలీయుల రాజైన యేసుక్రీస్తు యేసుక్రీస్తు వంశవాలి పట్టికలో చోటు దక్కించుకొంది. యెష్షయి యొక్క మొద్దు నుండి ఒక చిగురు మొలిచి అది విస్తరిస్తుంది అనే మాట ఎంత నిజం. 

 

అవును దేవుని పిల్లలారా! నీతిమంతుల వేరు కదలదు, వారు తమ వేరు తన్ని కఠినమైన పరిస్థితుల్లో జీవించడమే అసాధ్యమైన పరిస్థితుల్లో గోరమైన ఉపద్రవంతో పరిస్థితులు లాభమా లేక నష్టమా అది ఏదైనను స్థిరముగా నిలిచి బలం ఇచ్చే వారిలా ఉంటారు. కాబట్టి మనం కూడా నీతిమంతులుగా ఈ లోకంలో జీవిద్దాం. 

- సిస్టర్. మంజులా

 

ప్రార్థన అంశం:-

తమిళనాడులో వి.యమ్.యమ్ పరిచర్యలో సేవకుల కొరకు రాస్తున్న పత్రికలు చదువుతున్న సేవకులు దేవుని కొరకు అగ్ని జ్వాలలు వలె మండేటట్లు ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al