Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 17.10.2021 (Kids Special)
Share:

By Village Missionary Movement

Sunday, 17-Oct-2021

దిన ధ్యానము(Telugu) 17.10.2021 (Kids Special)

 

గ్రామ మిషనరీ సంస్థ తరుపున ప్రత్యేకంగా చిన్న

 పిల్లలకు.

 

"నీవు తిండిపోతువైనయెడల నీ గొంతుకకు కత్తి పెట్టుకొనుము" - సామెతలు 23:2

 

హాయ్ పిల్లలు అందరూ సంతోషముగా ఉన్నారా? మీరు సంతోషంగా ఉండుటకు కారణం ఏమిటో తెలుసా మీ శరీరంలో ఉన్న ప్రతి అవయవం చక్కగా పనిచేయడం వలనే కదా మీరు హ్యాపీగా ఉండగలుగు తున్నారు. తలనొప్పి ఉంటే మీరు హ్యాపీగా ఉండలేరు అవును కదా. అయితే యేసయ్య ప్రతి రోజు మనకు మంచి ఆరోగ్యం ఇచ్చి చక్కగా చూసుకుంటునందుకు మరి మనం కృతజ్ఞతలు యేసయ్య కు చెప్పాలా వద్దా? కచ్చితంగా యేసయ్య కు కృతజ్ఞతలు చెప్పాలి. మర్చిపోకుడదు ఓకేనా!

 

ఒక ఇంట్లో ముసలి తనంలో ఉన్న అవ్వ ఉండేవారు. ఆమెకు సహాయం చెయ్యడానికి ఒక చిన్న పిల్ల అయిన రమణి కూడా ఉండేది. ఒక రోజు రమణి ఉదయాన్నే ఇల్లు ఊడ్చి, పాత్రలు శుభ్రపరిచి ఆడుకోవడానికి వెళ్ళాలి అనుకుంది కానీ తన పని పూర్తి అయిన వెంటనే ఆ అవ్వ రమణికి కాయగూరలు కోసే పని చెప్పింది. సరే అవ్వ అని ఆ పనిని కూడా పూర్తి చేసింది రమణి. మళ్ళీ అవ్వ కొంచం బట్టలు ఉతికి పెట్టమని చెప్పారంట. రమణి యొక్క చిన్న చేతులు నొప్పి పెట్టాయి అయినా గాని రమణి అవ్వ యొక్క బట్టలు ఉతికి పెట్టింది. ఇక ఆడుకోవడానికి అవ్వదు అలసిపోయానే పడుకోవడానికే వెళ్ళాలి అని అనుకున్నప్పుడు ఆ అవ్వ మజ్జిక తీసుకొని వచ్చి దీనిలో నుండి వెన్నను తియ్యాలి అని రమణి తో చెప్పారు. రమణి కి కోపం వచ్చిందో లేదో గాని మనకు మాత్రం అవ్వ పైన కోపం వస్తుంది కదా? అవ్వను ఎదురించాలి అని ఉంది కదా? ఆ అవ్వ వలే మనం అందరం ఉన్నాం. మనం తిన్న ఆహారం జీర్ణం అవ్వకముందే మళ్ళీ ఆహారం అందిస్తున్నాం. భోజనం చేసిన వెంటనే కూల్ డ్రింక్, స్నాక్స్, టి ఇలా వెంట వెంటనే తింటూనే ఉంటే శరీరం లావుగా మారి ఆరోగ్యంగా ఉండలేము. మనం తిన్న ఆహారం జీర్ణం అయ్యే పని పూర్తి చేసి విశ్రాంతి తీసుకోవచ్చు అని అనుకున్నప్పుడు మరల ఏదైనా ఆహారం మనం అందిస్తున్నాం. విశ్రాంతి తీసుకోవలసిన అవయవముకు మళ్ళీ పని కల్పిస్తున్నాం. జీర్ణ వ్యవస్థ విశ్రాంతి లేకుండా పని చేస్తూ ఉంటే ఏమౌతుంది ఆలోచించి చూడండి. ప్రియమైన తమ్ముడు, చెల్లి పరిమితి దాటితే అమృతం కూడా విషమే అనే సామెత చెబుతారు. అందువలన ఈ రోజు నుండి యేసయ్య ఇచ్చిన అద్భుతమైన శరీరమును జాగ్రత్తగా చూసుకుందామా?

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al holiganbet giriş holiganbet padişahbet giriş bets10 extrabet royalbet süperbetin jojobet padişahbet holiganbet betcio romabet giriş romabet queenbet bahiscasino markajbet bahiscasino atlasbet casibom matbet matbet giriş