Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 15.10.2021
Share:

By Village Missionary Movement

Thursday, 14-Oct-2021

దిన ధ్యానము(Telugu) 15.10.2021

 

అంశం:- యోసేపు vs సమ్సోను.

 

"దాని చక్కదనమునందు నీ హృదయములో ఆశపడకుము అది తన కనురెప్పలను చికిలించి నిన్ను లోపరచుకొన నియ్యకుము" - సామెతలు 6:25

 

పవిత్రత అనేది స్త్రీ, పురుషుల ఇద్దరికి సమాణమైనది. అది కన్నులలో మొదలవుతుంది. అందువలననే యేసుక్రీస్తు ప్రభువు మాట్లాడినప్పుడు ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయము నందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడగును. ఈరోజు మనకు బాగా తెలిసిన యోసేపు మరియు సమ్సోను అనే ఇద్దరి యవ్వనులు కన్నులను ఫోకస్ చేసి చూద్దాం.

 

యోసేపు రూపవంతుడును, సుందరుడై యుండెను. ఐగుప్తుకు బానిసగా అమ్మబడిన అతనితో యెహోవా తోడుగా ఉన్నారు. ప్రభువు యొక్క సుందరమైన కన్నులు అతనిని చూస్తూ ఉండుటను తన యొక్క ఆత్మీయ కన్నులు గ్రహించాయి. అందువలననే తల్లిదండ్రులు, కుటుంబీకులు సమీపంలో లేనప్పటికీ దేవునికి భయపడే భయం తనతో ఉండేది. అదే తన యొక్క ఉన్నతమైన స్థాయికి, పాపములో పడిపోకుండా ఉండుటకు కారణం అయ్యింది. బయట ఎవ్వరు కూడా గుర్తు పట్టని ఒక శృంగార జీవితం తన మార్గంలో వస్తే ఒక యవ్వనస్తుడు ఏం చేస్తాడు? కానీ యోసేపు నేను ఎట్లు ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి దేవునికి విరోధముగా పాపము చేయుదును అనుకుని పాపమును విడిచిపెట్టి పారిపోయాడు. 

 

ఫిలిష్తీయుల చేతిలోనుండి ఇశ్రాయేలీయులను రక్షించుట కొరకు దేవుడు ఏర్పరచుకున్న వ్యక్తి సమ్సోను. కాని తాను జన్మించిన ప్రణాళిక మరచి తన కన్నులకు నచ్చిన స్త్రీ పై ఆశ పెట్టుకొని మళ్ళీ మళ్ళీ పాపములో పడిపోయాడు. తల్లిదండ్రులు తనతోనే ఉన్నా కూడా దేవునికి భయపడే భయం అతనితో లేకపోవడం వలన పరిశుద్ధత గురించి ఆశ కూడా లేదు. దాని యొక్క ప్రయోజనం, ప్రాముఖ్యత గ్రహించ లేదు. అందువలన తన శరీరమునకు మరక అవుతుందనే బాధ లేదు. చివరికి తన పరిస్థితి ఏమైందో మనకు బాగా తెలుసు. 

 

ప్రియమైన యవ్వనులారా! మీరు ఎవరి వలె బ్రతుకుతున్నారు? యోసేపు వలెనా లేక సమ్సోను వలెనా? కన్నవారితో ఉండి వారి యొక్క ఆలోచనలను తిరస్కరించి. ప్రభువైన యేసుక్రీస్తు కు భయపడే భయం లేకుండా వ్యతిరేకంగా బ్రతుకుతున్నారా? కన్నులు, హృదయం స్థలం ఇచ్చే పాపముకు శరీరం అవకాశం ఇవ్వడానికి ఎంత సమయం పడుతుంది. ఈరోజు సమ్సోను జీవితం మనకు ఒక హెచ్చరిక. సామాజిక వెబ్సైట్ల ద్వారా వివాహం అయ్యే స్త్రీ, పురుషులు పాపపు అలవాట్లకు బానిసై మోసపోతున్నారు. అందువలన పాపాన్ని కన్నులలో ఆపివేసి నో ఎంట్రీ బోర్డును తగిలించండి. యోసేపు వలె మిమ్మును పరిశుద్ధంగా కాపడుకోనండి.

- శ్రీమతి. సరోజా మోహన్ దాస్

 

ప్రార్థన అంశం:-

మీడియాలో నూతన పనిలో అధిక అనుభవం కలిగిన సేవకులు మనతో కలిసి పనిచేయుటకు ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al