By Village Missionary Movement
Thursday, 14-Oct-2021దిన ధ్యానము(Telugu) 14.10.2021
అంశం:- ప్రక్కన పెట్టు.
"నా గద్దింపు విని తిరుగుడి ఆలకించుడి నా ఆత్మను మీమీద కుమ్మరించుదును నా ఉపదేశమును మీకు తెలిపెదను" - సామెతలు 1:23
ఇటీవల కాలంలో నేను విన్న ఒక సంఘటన నా హృదయాన్ని కదిలించింది. ఒక గ్రామంలో ఉన్న ఒక కుటుంబంలో ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఇద్దరు ఆడపిల్లలు ఒక మగబిడ్డ తండ్రి లేని వారిని ఉపాధ్యాయురాలైన తన తల్లి చాలా శ్రద్ధగా పెంచుతూ వచ్చారు. సమాజంలో మంచి మాదిరి గల కుటుంభంగా ఆ కుటుంబం ఉండేది. ఇటువంటి పరిస్థితుల్లో 12వ తరగతి అనగా ఇంటర్మీడియట్ చదువుతున్న తన కుమారుడు ఒక బాలికను కోరాడు. తనలో ఒక తప్పుడు ఆలోచన వచ్చింది. ఒక రోజు ఉన్మాది గా మారి తన కోరికను తీర్చుకొని ఆ బాలికను చంపేశాడు. చివరిగా చెరసాలలో బంధింపబడ్డాడు. ఆ అవమానంతో తోడబుట్టిన ఇద్దరు సహోదరీలు ఆత్మహత్య చేసుకున్నారు. తన తల్లి మతిస్థిమితం లేనివారైపోయారు. చెరసాలలో తనను కలుసుకున్న రిపోర్టర్లల యొద్ద నా తప్పు వలన నా కుటుంబం నాశనమైపోయింది అని చెప్పి కన్నీరు పెట్టుకున్నాడు ఆ యవ్వనస్తుడు. ఆ తరువాత తానుకూడా ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు.
ఇది వింటున్న మీతో నేను ఒక విషయం చెప్పాలని ఆశపడుతున్నాను. ఈ లోకంలో పాపం ఏది? పరిశుద్ధత ఏది? అనేది అనేకులుకు తెలియదు అందువలననే చాలామంది త్రాగుడు, వ్యభిచారం అనే పాపం లో , వేశ్య తనంలో పడిపోతున్నారు. చిన్నవయసులోనే సినిమాలను షోషల్ మీడియా లో వీడియోలను చూస్తున్నారు. దానిలో చూస్తున్నవి పాపం అని తెలియక తమ యొక్క జీవితం లో దానిని జరిగిస్తున్నారు. అందువలన వారు పాపం చేసి ఫలితంగా మరణం వరకు వెళుతున్నారు.
యేసుక్రీస్తు మన యొక్క పాపములన్నింటిని తన రక్తముతో కడిగి మనలను పరిశుద్ధ పరిచి మనలను పరలోకంమునకు తీసుకు వెల్లులాగున సిలువలో రక్తం కార్చి మరణించి 3వ దినమున మన కొరకు తిరిగిలేచారు ఆయన మన పాపములను క్షమించుట మాత్రమే కాదు పరమునకు వెళ్ళుటకు నేను వెళ్ళి మీ కొరకు ఒక ఆదరణ కర్తను పంపిస్తాను అని అన్నారు. ఆ ఆదరణ కర్తఅయిన పరిశుద్ధాత్మ వచ్చి ఏది పాపం ఏది పరిశుద్ధం అని మనకు దగ్గర ఉండి మనలను నడిపించుటకు అనగా పాపము గూర్చి, నీతిని గూర్చి నీతి న్యాయతీర్పును గూర్చి లోకాన్ని జయించుట నేర్పిస్తారు. మనం యేసుక్రీస్తు ని అంగీకరించినప్పుడు ఆయన మాన యొక్క పాపములను క్షమించుట మాత్రమేకాదు పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహిస్తారు. ఆయన మనం పరిశుద్ధ మార్గంలో నడచుటకు మనకు ఏది పాపం ఏది పరిశుద్ధత అని మనకు తెలియజేస్తారు. మనం మన యొక్క లక్ష్యమును చేరుటకు పరిశుద్ధతను కోరి పాపమును ప్రక్కకు త్రోసివేయాలి దాని ద్వారా మనం నడచినప్పుడు పరిశుద్ధముగా జీవించగలం. మనం యేసుక్రీస్తు యొక్క బంధంలో నిలిచియున్నప్పుడు మనతో ఆ పరిశుద్ధాత్ముడు ఉండి మనలను ఆశీర్వదిస్తారు. యేసు క్రీస్తుని మనం అంగీకరిద్దామా?
- సహోదరుడు. పి.వి.విలియమ్స్ గారు
ప్రార్థన అంశం
చత్తీస్గఢ్ నుండి వచ్చి మనతో శిక్షణలో ఉన్న సేవకులు మంచి ఆత్మీయ అధికారుల వలె లేచేటట్లు ప్రార్థిద్దం.
*Whatsapp*
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.
ఈమెయిల్: reachvmm@gmail.com
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250