Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 13.10.2021
Share:

By Village Missionary Movement

Wednesday, 13-Oct-2021

దిన ధ్యానము(Telugu) 13.10.2021

 

అంశం:- మంచి స్నేహితుడు

 

"లోలోపల ప్రేమించుటకంటె బహిరంగముగా గద్దించుట మేలు" - సామెతలు 27:5

 

పొగత్రాగే అలవాటు ఉన్న ఒక అతను ఒకసారి సిగెరెట్ కాలుస్తూ తన పాఠశాలలో ఉన్న స్నేహితున్ని చూసి చాలా సంతోషపడి నువ్వు కూడా ఒక సిగెరెట్ కాల్చు అన్నాడు. ఆ స్నేహితుడు మాత్రం నాకు వద్దు నేను సిగెరెట్ కాల్చాను అన్నాడు. వారిద్దరూ అలా మాట్లాడుతూ వారి యొక్క పాఠశాల వరకు వెళ్లారు. అంతలోనే ఆ స్నేహితుడు మరియొక సిగెరెట్ ను కాల్చడం మొదలుపెట్టాడు. దానిని చూసిన తన స్నేహితుడు నువ్వు ఈ సిగెరెట్ ను తీసి నీ అందమైన కాటన్ షర్ట్ కు అంటించు చూద్దాం అన్నాడు. అందుకు అతను అరె వెఱ్ఱివాడ 1000 రూపాయల కాటన్ షర్ట్ కన్నం అయిపోతుంది ఆమాత్రం తెలియదా నీకు అన్నాడు. అందుకు ఆ స్నేహితుడు 1000 రూపాయల కొరకు నువ్వు జాగ్రత్త పడుతున్నావు కానీ ఎంతో విలువైన నీ గుండె, ఊపిరితిత్తులు వంటివి సిగెరెట్ కాల్చుతూ పాడు చేస్తున్నావు వెఱ్ఱివాడ అన్నాడు. అందుకు ఆ స్నేహితుడు చాలా లోతుగా ఆలోచించి చూసాడు. 

 

పరిశుద్ద గ్రంధంలో సమూయేలు అనే ప్రవక్త రాజైన సౌలు యొక్క తప్పును తెలియజేయుట అనేది 1 సమూయేలు 15 వ అధ్యాయంలో చూస్తున్నాం. అమలేకియుల అందరిని నాశనం చెయ్యమని యెహోవా సమూయేలు ద్వారా సౌలు కు చెప్పారు. కానీ సౌలు మాత్రం అలా చెయ్యక తన ఇష్టప్రకారం క్రొవ్విన గొర్రెలను, పశువులను విడిచిపెట్టాడు. ఈ విషయం సమూయేలుకు తెలిసినప్పుడు సమూయేలు స్పష్టంగా సౌలుతో యెహోవా ఆజ్ఞను నీవు విసర్జించితివి గనుక ఆయన నిన్ను రాజుగా ఉంచక విసర్జించారు అని 1 సమూయేలు 15:23 వ వచనములో దీనిని మనము చూస్తున్నాం. తరువాత చెప్పవచ్చు లేక చెబితే తప్పుగా అర్థం చేసుకుంటారేమో అని ఆలోచించ కుండా బహిరంగంగా గద్దించారు సమూయేలు. 

 

స్నేహితులరా ఈ నాటి మన స్థితి ఎలా ఉంది. మనం మంచి స్నేహితులుగా లేదా నిజాయితీ గల స్నేహితులుగా ఉండాలి అంటే పరిశుద్ద గ్రంధంలో వ్రాయబడినట్లు నడుచుకొనుటకు ప్రయత్నించాలి. మన స్నేహితులు తప్పు చేసినప్పుడు మనం చూస్తూ ఉండటం వలన మనమే వారికి గోయ్యి తవ్విన విరోధి అవుతాం. ఈ రోజుల్లో స్నేహితులతో గడుపుటకు ఎక్కువ సమయం దొరుకుతుంది. కాబట్టి ఈ సమయాన్ని ఉపయోగించు కొందాం. స్నేహితులు మనలను తప్పుగా అర్థం చేసుకుంటారేమో అని కాకుండా తప్పును బహిరంగంగా గద్దించాలి అనేదే పరిశుద్ద గ్రంధం చూపుతున్న మంచి మార్గం. మనం మంచి స్నేహితులు వలె ఉందాం, మనకు మంచి స్నేహితులు దొరుకుతారు. ఆమెన్.

- బ్రదర్. టి.శంకర్ రాజ్

 

ప్రార్థన అంశం:-

హర్యానా, పంజాబ్ రాష్ట్రాలలో సేవచేయుటకు ఏక దర్శనం గల సేవకులు కొరకు ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al matbet matbet giriş hepsibet hepsibet giriş betnano betnano giriş betparibu betparibu giriş casibom virüsbet pashagaming kalebet perabet pashagaming virusbet marsbahis imajbet perabet perabet giriş perabet perabet giriş