By Village Missionary Movement
Monday, 11-Oct-2021దిన ధ్యానము(Telugu) 11.10.2021
అంశం:- నిర్ణయమును మనస్సులో ఉంచుకొనండి.
"ఒకని యెదుట సరియైనదిగా కనబడు మార్గము కలదు అయితే తుదకు అది మరణమునకు త్రోవతీయును" - సామెతలు 14:12
ఒక రైతు తన బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి వస్తున్న దారిలో ఆయన ఒక జలపాతాన్ని చూసాడు. జలపాతం సమీపంలో ఉన్న ఒక చెట్టు కొమ్మకు ఉన్న తేనె పట్టు తన కన్నులకు కనిపించింది. వెంటనే అతను చెట్టు పైకి ఎక్కి దానిని తీయాలని ప్రయత్నించాడు. అప్పుడు ఆమార్గంలో వెళ్తున్న ఒకతను రైతును చూసి ప్రాణం కావాలి అంటే దిగి వెళ్లిపో ఎందుకంటే ఆ కొమ్మ విరిగి పడిపోబోతోంది. కాని రైతు మాత్రం వినకుండా చెట్టు ఎక్కి తేనెను తియ్యాలి అని క్రమముగా ప్రయత్నం చేశాడు. తేనె పట్టు తీసుకుని దిగుతున్నప్పుడు కొమ్మ విరిగి ఆ జలపాతంలో పడిపోయాడు. ఆ జలపాతంలో అతని కొరకు ఎదురు చూస్తున్న మొసలి అతనిని పట్టుకొని చంపేసింది. ఆ రైతు చనిపోయాడు. పరిశుద్ధ గ్రంధంలో సౌలు రాజు యొద్ద సమూయేలు ప్రవక్త నువ్వు అమాలేకీయులను నాశనం చెయ్యాలి అని యెహోవా సెలవిచ్చారు అని చెప్పాడు. సౌలు అమాలేకీయులతో యుద్ధం చేసి అమాలేకీయుల రాజు యొక్క క్రొవ్విన వాటిని ప్రాణముతో వదిలేసాడు. సౌలుకు ముఖ్యమైన వాటిని నాశనం చేయడం మంచిది కాదు అని పించింది. కాని దేవుడు సౌలు యొక్క స్వార్థపూరిత ఆలోచన బట్టి అతను రాజుగా ఉండ కూడదు అని ఆతనిని విసర్జించారు. సమూయేలు సౌలుతో యెహోవా ఆజ్ఞనను విసర్జించి తివి గనుక నువ్వు రాజుగా ఉండకుండ ఆయన నిన్ను విసర్జించారు. సౌలు ముగింపు పరితాపం. ఎందుకు అనగా యెహోవా సౌలును విడిచి పోయారు.
క్రీస్తు నందు ప్రియమైన వారలారా! మనము కూడా సౌలు వలె దేవుని మాటను వ్యతిరేకించి మనకు మంచిగా ఉన్న మార్గంలో నడుస్తున్నమా? సాతాను గర్జించు సింహము వలె ఎవరిని మ్రింగుదునా అని వెతుకుతూ తిరుగుతున్నాడు. వాడి చేతుల్లో చిక్కుకుంటే నిత్య నాశనం అని మర్చి పోవద్దు. కాని దేవుని మాటలకు లోబడితే నిత్య జీవం మనకు కలుగుతుంది. ఆయన యొద్ద ఆశ్రయం పొందుకొని ఆయన మాటలు విని ఆయన మార్గంలో నడిచి నిత్యజీవం పొందు కుందాం. హల్లెలయా!
- సహోదరి. ఏ. బ్యూల
ప్రార్థన అంశం
7000 మంది మిషనరీల ద్వారా ఒక లక్ష గ్రామాలను సంపాదించాలి అనే ప్రణాళికతో సమర్పించుకొన్న సేవకులు మనతో కలిసి సేవ చేయుట కొరకు ప్రార్థిద్దాం.
ఈ దిన ధ్యానవాక్యం కొరకు ఈ క్రింద నoబర్లును సంప్రదించండి
వాట్సాప్ తమిళ్ కొరకు +91 94440 11864,
ఇంగ్లీష్ కొరకు +91 86109 84002,
హిందీ కొరకు +91 93858 10496
తెలుగు +91 94424 93250
ఈమెయిల్: reachvmm@gmail.com
Androidapp: https://play.google.com/store/apps/details?Id=com.vmmorg.template.msmapp&showAllReviews=true
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250