Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 10.10.2021 (Kids Special)
Share:

By Village Missionary Movement

Sunday, 10-Oct-2021

దిన ధ్యానము(Telugu) 10.10.2021 (Kids Special)

 

గ్రామ మిషనరీ సంస్థ తరుపున ప్రత్యేకంగా చిన్న

పిల్లలకు.

 

"చూడుము నా యరచేతులమీదనే నిన్ను చెక్కి యున్నాను" - యెషయా 49:16

 

హాయ్! చిట్టి పొట్టి పిల్లలారా బాగున్నారా? మీ అందరిని చూడాలి అని నాకు చాలా ఆశగా ఉంది. ఈ కదా ద్వారా మిమ్మల్ని కలుసుకొంటునందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఆదివారం నేర్చుకుంటున్న పాటలను మరవకుండా పాడుతున్నారా? మీరు పాట పాడితే శత్రువైన సాతాను వణికిపోతాడు. మీరు యేసయ్య పాటలు పాడుటలో అంత శక్తి ఉంది. కాబట్టి పాటలను మర్చి పోకుండా పాడుతూనే ఉండండి. సరే ఈ రోజు మనం సీతాకోకచిలుక కథను విందమా.

 

స్కూల్ కు వెళ్ళకుండా చాలా రోజులు సెలవుల్లో ఉండటం వలన ఇద్దరు స్నేహితులకు చాలా బోర్ కొట్టింది. వారు ఉన్న గ్రామం చాలా పచ్చగా అందంగా ఉంటుంది. పొలం పక్కన నడుస్తూ వాకింగ్ కు వెళ్దాం అని ఇద్దరు స్నేహితులు బయలుదేరారు. మంచిగా చల్లని గాలి విస్తోంది. సీతాకోకచిలుకలు, రకరకాల పక్షులు వాళ్ళ పక్కనుండి ఎగురుతుంటే ఇద్దరు చేతులు చాపి పట్టుకొనుటకు ప్రయత్నాలు చేసారు. మీరు కూడా సీతాకోకచిలుకలను పట్టుకొనుటకు ఆశపడతారు కదా? హో పట్టుకొని ఆడుకుంటారా. రంగురంగులుగా చూడటానికి సంతోషంగా ఉంటుంది. అవును కదా ఒక తమ్ముడు సీతాకోకచిలుకలను పట్టుకున్నాడు. స్నేహితుడా నికోక ప్రశ్న అడుగుతాను చెబుతావా నా చేతిలో ఉన్న సీతాకోకచిలుక ప్రాణంతో ఉందా చనిపోయిందా అని అడిగాడు. అందుకు స్నేహితుడు కొంచం సమయం ఆలోచించి ప్రాణంతో ఉంది అంటే నలిపి చంపేస్తాడు, చనిపోయింది అని చెబితే ప్రాణంతో ఎగుర వేస్తాడు అని ఆలోచించి ఆ సీతాకోకచిలుక ప్రాణంతో ఉండడం లేదా చనిపోవడం రెండు ని చేతుల్లో ఉంది అని చురుకుగా సమాధానం చెప్పాడు. బాగా జవాబు చెప్పావు స్నేహితుడా అని జవాబు చెప్పి సీతాకోకచిలుక బయపడవద్దు ఎగిరి వెళ్లిపో అని ఎగుర వేసాడు ఆ తమ్ముడు. 

 

ప్రియమైన తమ్ముడు, చెల్లి సీతాకోకచిలుకకు ఆ ప్రమాదం జరుగకూడదు అని తెలివిగా జవాబు చెప్పాడు చూసారా? యేసయ్య మిమ్మల్ని అరచేతుల్లో చెక్కుకొనియున్నారు. ఆయన మిమ్మును భద్రంగా చూసుకుంటారు. అయితే మిమ్మల్ని మీరు యేసయ్య హస్తాలకు సమర్పించుకోవాలి. ఆయన చేతుల్లో నుండి ఎవ్వరు కూడా మిమ్మల్ని విడదీయలేరు. సాతాను చేతుల్లో, దుర్మార్గులు చేతుల్లో చిక్కి పోకుండా నన్ను కాపాడండి ప్రభువా అని ప్రార్ధించడం మర్చిపోకుడదు. సీతాకోకచిలుక వలె పటపట మంటూ అనేకులకు సాక్షిగా ఉండాలి అని యేసయ్య యొద్ద ప్రార్ధించండి. 

- సహోదరి. దేబోరాల్

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al holiganbet giriş holiganbet casibom bets10 extrabet royalbet süperbetin casibom giriş casibom jojobet giriş casibom milanobet piabellacasino betpas bahiscasino atlasbet betpas casinoroyal bahiscasino ngsbahis betplay holiganbet jojobet casibom holiganbet jojobet casibom vaycasino romabet