By Village Missionary Movement
Saturday, 09-Oct-2021దిన ధ్యానము(Telugu) 09.10.2021
అంశం:- పాద ముద్రలు.
"యథార్థవర్తనుడగు నీతిమంతుని పిల్లలు వాని తదనంతరము ధన్యులగుదురు" - సామెతలు 20:7
న్యూయార్క్ నగరంలో మేక్స్ జెక్స్ అనే వాడు దేవుని భక్తి లేనివాడిగా దుర్మార్గమైన జీవితం జీవిస్తూ ఉండేవాడు. అతనిని పెళ్లి చేసుకున్న స్త్రీ కుడా దేవుని యందు భక్తి లేని దానిగా ఉండేది. వీరి యొక్క సంతతిలో 1200 మందిని గూర్చి జనాభా లెక్కలు వ్రాయబడ్డాయి. వారిలో 310 మంది పేద స్థితిలో కష్టమైన పరిస్థితిలో ఉన్నవారిగా చెప్పారు. వారిలో కొందరు తమ బ్రతుకులు సరిగా లేనందున తమ శరీరాలలో వ్యాధులను పొందుకున్నారు. మరి కొందరు దొంగల వలె చెరసాలలో వేయబడ్డారు. వీరి యొక్క జీవితం వలన ప్రభుత్వానికి 12 లక్షల డాలర్లు వృధా అయ్యాయి. అదే నగరంలో జోనతాన్ ఏడ్వార్డ్ కుటుంబం ఉండేది. అతను దేవుని యందు భయభక్తులు కలిగి నిజాయితీగా సేవచేసేవారు. అతనిని పెండ్లి చేసుకున్న స్త్రీ కూడా దేవునికి భయపడే వారు. అతని కుటుంబం నుండి వచ్చిన సంతతిలో 300 మంది బోధకులుగా, మరి కొంత మంది మిషనరీలాగా మరి కొంత మంది బైబిల్ కాలేజ్ ప్రొఫెసర్లగా, కొంత మంది న్యాయవాదులుగా, నీతిమంతులుగా ఉండేవారు. మిగిలిన వారిలో కొంతమంది అధిపతులుగా జనాదిపతులుగాను దేశంలో పైకి ఎదిగిన స్థితిలో ఉన్నవారుగా జనాభా లెక్కల్లో వారు చెప్పారు.
ప్రియమైన వారలారా! మీరు నీతిమంతులుగా ఉంటే మీకు వెనుక వచ్చే సంతతి ఆశీర్వదించబడే సంతతిగా ఉంటుంది. అది మీరు తీసుకొనే నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. మీరు దేవునికి బయపడి ఆయన మార్గంలో నడిస్తే పరిశుద్ద గ్రంధంలో చెప్పబడిన అన్ని ఆశీర్వదములను పొందుకొనగలము. ఆ ఆశీర్వదములు మనకు మన సంతతికి చెందుతాయి. దుర్మార్గుని సంతతి దుర్మార్గముగానే ఉంటుంది అనే దానికి పైన చెప్పబడిన కుటుంభమే సాక్ష్యం. మన యొక్క జీవితం, మనం వెనుక విడిచిపెట్టి వెళుతున్న మన యొక్క పాద ముద్రాలు కూడా మన యొక్క సంతతికి ఆశీర్వదమా లేదా శాపం అనేది మనం జీవించే ఈ జీవితమే నిర్దారిస్తుంది. కాబట్టి ప్రభువైన యేసు క్రీస్తు కొరకు బ్రతుకుదాం, విశ్వాసము గాక సంతతిని ఈ లోకమునకు ఇద్దాం. మనము మరియు మన కుటుంబం ఈ లోకమునకు ఆశీర్వదకరముగా ఉండును గాక! ఆమెన్
- శ్రీమతి. శక్తి శంకర్ రాజ్
ప్రార్థన అంశం:
తోటి సేవకులు సేవ చేసే స్థలానికి వెళ్ళినప్పుడు దేవుని కాపుదల ఉండులాగున ప్రార్థిద్దాం.
*Whatsapp*
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.
ఈమెయిల్: reachvmm@gmail.com
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250