By Village Missionary Movement
Thursday, 07-Oct-2021దిన ధ్యానము(Telugu) 07.10.2021
అంశం:- ప్రేరేపింపగా ఒప్పకుము.
"నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకుము" - సామెతలు 1:10
ఒక అందమైన రాజా భవనంలో సాలెపురుగు చక్కగా ఒక వలను అల్లి ఆ వల మధ్యలో మంచిగా పడుకొని ఉంది. దానిని చూసిన ఈగ నేను కూడా ఉల్లాసంగా అడుకొనుటకు నాకు ఎటువంటి వల లేదు అని చెప్పింది. దానిని విన్న సాలెపురుగు నువ్వు కూడా రా మనం జాలిగా ఉందాం అన్నది. ఆ మాటలు విన్న ఈగ ఆశతో వెళ్ళి ఆ వలలో చిక్కిపోయింది. ఎంత ప్రయత్నించినా ఈగ ఆ వల నుండి విడిపించు కోలేకపోయింది. కొద్దీ సమయం తరువాత ఆ ఈగ సాలెపురుగుకు ఆహారం అయ్యింది.
ఈనాటి లోకంలో మనం పాపం చేయుటకు మంచి అవకాశాలను సాతాను మన దగ్గరకు తీసుకు వస్తాడు. ఇదంతా తప్పు కాదు బావమరిది అని చెప్పి పాపము చేయుటకు మనలను అమ్మివేసినటువంటి ఫ్రెండ్ షిప్ కూడా ఉంది. మనం పనిచేసే స్థలంలో, చదువుకొనే స్థలంలో కొంచం త్రాగు ఇదంతా పాపం కాదు అని మీ స్నేహితులు చెప్పవచ్చు. జార స్త్రీ పెదవుల నుండి తేనె కారును దాని నోటి మాటలు నూనె కంటే నునుపైనవి అని పరిశుద్ద గ్రంధం చెబుతుంది. పాపము వలన వచ్చు జీతం మరణం దాని వలన కలుగు ఫలము మూసిని పండతా చేదైనది. నువ్వు విడుదల పొందాలి అనుకున్న నీ వలన అవ్వదు. అప్పుడు నీ మనస్సు ఆలోచిస్తుంది అయ్యో బోధనను నేను వినలేదు, తల్లిదండ్రులు దండించినప్పుడు నేను దానిని నిర్లక్ష్యం చేసాను. ఇప్పుడు దీనిలో నుండి ఎలా విడుదల పొందగలను. ఎవరు నన్ను ఈ పాపము నుండి లెవనెత్తుతారు అని ఆలోచిస్తున్నవా? పాపమును నీటి వలె త్రాగుతున్న యవ్వనుడా నీకు పరిశుద్ద గ్రంధం చెబుతున్న సలహా ఏమిటి? నాకు కుమారుడా నీవు వారి మార్గమున పోకుము వారి త్రోవల యందు నడవకుండా నీ పాదములు వెనుకకు తీసుకొనుము.
దుష్టుల ఆలోచనచొప్పున నడువక పాపుల మార్గమున నిలువక అపహాసకులు కూర్చుండు చోటను కూర్చోవద్దు అని బైబిల్ చెబుతుంది. ఇలా మంచి ఆలోచనలను, హృదయ వాంఛనాలను చూపించే పరిశుద్ద గ్రంధం అనే అద్దం ముందు నిలబడి నిన్ను నీవు పరిశుద్ధముగా కాపాడు కొంటె నీవు నివసించే ఈ లోకంలో నిన్ను చూస్తున్న దేవుని దృష్టిలో ప్రత్యేకించ బడిన వాని వలె ఆశీర్వదించబడిన వాని వలె ఉంటావు.
- బ్రదర్. డి. సిలిప్ బాల మురుగన్
ప్రార్థన అంశం:-
ఇంటర్నెట్ లో ప్రకటించ బడుతున్న దేవుని మాటల ద్వారా అనేకులు మార్పు చెందులాగున ప్రార్థిద్దాం.
*Whatsapp*
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.
ఈమెయిల్: reachvmm@gmail.com
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250