Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 06.10.2021
Share:

By Village Missionary Movement

Wednesday, 06-Oct-2021

దిన ధ్యానము(Telugu) 06.10.2021

 

అంశం:- సహాయము - అక్కర

 

"మేలుచేయుట నీ చేతనైనప్పుడు దాని పొందదగినవారికి చేయకుండ వెనుకతియ్యకుము" - సామెతలు 3:27

 

ఒక యవ్వనస్తునికి తన చదువుకు తగిన ఉద్యోగం లేక చాలా తక్కువ జీతం పొందుకోవడం వలన గ్రామంలో ఉన్న కన్న వారికి డబ్బులు పంపించలేక కృంగిపోతూ ఉండేవాడు. నాకు ముగింపు రాదా అని ప్రార్ధిస్తూ వస్తూనే చర్చ్ లో చిన్న చిన్న సేవలు చేస్తూ వచ్చాడు ఒకరోజు అధికారి తన బంధువులకు ఆహారం ఇవ్వమని ప్రభుత్వ ఆసుపత్రికి పంపించారు. అది కరోనా వార్డు కావడంతో మాస్క్, చేతికి తొడుగులు వేసుకొని ఇతను వెళ్లి చూడగా ఎటువైపు తిరిగి చూసినా సరే జనాలు స్థలం లేక వ్యాధితో బాధపడుతూ పడుకొని ఉన్న ప్రతి ఒక్కరి కళ్ళల్లో ఒక ఎదురు చూపు ఎవరైనా సహాయం చేయరా అని అక్కడ ఉన్న నర్సులు, పనివారు చురుకుగా తిరుగుతూ అందరిని చూడలేక కృంగిపోయి ఉన్నారు. బంధువులకు ఆహారం ఇచ్చి దాహంతో ఉన్న వారికి నీటిని అందించి వారి అవసరమును గ్రహించి సహాయం చేయటం మొదలుపెట్టాడు. నీటిని ఆహారమును తీసుకున్నవారు తన చేతికి వేలకొలది డబ్బును ఇచ్చారు. అంతమాత్రమే కాదు అయ్యా ఈ కరోనా వార్డు లో మేము ఉన్నంతకాలం దయచేసి మాకు సహాయం చేయగలరా! అని అడగడంతో ఆ యవ్వనస్తుడు తిరస్కరించుటకు ఇష్టపడక తన ప్రాణమును అల్పమైనదిగా భావించి సహాయం చేయడం మొదలుపెట్టారు, రెండు నెలలు అక్కడ పని చేసాడు ప్రాణాలతో బయట పడిన వారు దారాళముగా డబ్బులు ఇచ్చి కృతజ్ఞతలు తెలియజేసేవారు. రెండు నెలలలోపు తన చేతికి రెండు లక్షల రూపాయలు తన చేతికి వచ్చాయి. తన భోదకుని యొద్దకు వచ్చి జరిగిన దానిని సాక్ష్యం చెప్పాడు.

 

దావీదు రాజు అరణ్యంలో ఉన్నప్పుడు గొర్రెల బొచ్చు కత్తిరించు నాబాలు యొద్దకు సహాయము కొరకు తన పనివారిని పంపి తన కొరకు ,తన పనివారికొరకు ఆహారమును అడిగినప్పుడు నాబాలు కోపముతో మాట్లాడి ఏ సహాయము చేయక పనివారిని పంపివేసి రాజు యొక్క కోపాన్ని సంపాదించుకున్నాడు. ఇది విన్న నాబాలు యొక్క భార్య అబీగయీలు ఆకలితో ఉన్న దావీదు కు అతని పనివారికి ఆహారము సిద్ధపరిచి వెళ్ళి ఆహారాన్ని ఇచ్చి రాజు దయను పొందుకుంది. ఇతరులకు మేలుచేయుట మనకు చేతనైనప్పుడు మనము ఆ అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకోవాలి. అభీగయేలు జ్ఞానంతో నడుచుకొని ఆశీర్వాదాన్ని పొందుకుంది. 

 

అనేక సమయాలలో మనం కష్టాలలో , వేదన పరిస్థితులలో నడచిన వేళలో ఏమి చేయాలో తెలియక కృంగిపోయి ఉన్నప్పుడు మనలను గురించిన భారము కలత మాత్రమే మనలను, విసిగిస్తుంది. కాని అటువంటి స్థితిలో కూడా స్వార్థము చూపించకుండ ఇతరుల మంచికొరకు వారికి ఏమి చేయగలను అనే భావముతో మనము మనకు చేతనైన సహాయము చేసినప్పుడు దేవుని గురించి ప్రకటించు వారివలే దేవుని నామాన్ని మహిమపరచు వారి వాలె కనిపిస్తాం. 

- శ్రీమతి. వసంతా రాజ మొహంగారు

 

ప్రార్ధనా అంశం:-

మీడియా పరిచర్య లో పనిచేస్తున్న వారికి దేవుడు విశేషమైన జ్ఞానం దేవుడు దయచేయులాగున ప్రార్ధిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al holiganbet giriş holiganbet padişahbet bets10 extrabet royalbet süperbetin padişahbet betcio royalbet casinoroyal queenbet bahiscasino betcio bahiscasino atlasbet padişahbet betpas bahiscasino celtabet queenbet casibom jojobet jojobet casibom holiganbet restbet safirbet