Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 05.10.2021
Share:

By Village Missionary Movement

Tuesday, 05-Oct-2021

దిన ధ్యానము(Telugu) 05.10.2021

 

అంశం:- పని

 

"తన భూమిని సేద్యపరచుకొనువానికి ఆహారము సమృ ద్ధిగా కలుగును" - సామెతలు 12:11

 

సోచోరో హోండా అనే వారు టొయోటో కంపెనీకి ఫిస్టన్ తయారు చేసి పరిశ్రమ సమూహములను పిలవాలని చాలా రోజులుగా ఆశ పడ్డారు. 1928వ సంవత్సరం దానిని తయారు చేయ గలిగారు. ఒక సంవత్సరం ప్రయాసపడి ఫిస్టన్ తయారుచేసి టొయోట కంపెనీకి తీసుకొని వెళ్లారు. కానీ వారికి కావలసిన అంత నాణ్యత ఈ ఫిస్టన్ లో లేదు అని తిరస్కరించబడ్డారు. అయిన సరే ఊహించిన నాణ్యత గల ఫిస్టన్ ను తయారు చేసి ఇచ్చారు. కానీ ప్రపంచ యుద్ధం కారణంగా ఫ్యాక్టరీని కట్టే సున్నం దొరకలేదు కాబట్టి వేరే సున్నం కనుగొని ఫ్యాక్టరీని కట్టారు. అమెరికా వేసిన బాంబ్ వలన ఆ ఫ్యాక్టరీ నెల మట్టం అయ్యింది. కాబట్టి కావాల్సిన వస్తువులను టొయోట కంపెనీకి అమ్మేశారు. పెట్రోల్ ధరలు అధికంగా ఉండడం వలన అందరూ సైకిళ్ళు ఉపయోగించారు. తన ఇంటిలో ఉన్న బుల్లెట్ వాహనం యొక్క మోటార్ తీసి సైకిల్ కి అతికించి రోడ్డుమీద వ్యాపారం చేశారు దాని యొక్క ఫలితమే హోండా మోటార్ సైకిల్. ఈరోజు దాని యొక్క అమ్మకం మనకు బాగా తెలుసు.

 

పరిశుద్ద గ్రంధం చెబుతుంది భూమిని సేద్యపరుచువానికి ఆహారం సమృద్ధిగా కలుగును అని. అవును మీరు దేని కొరకు పనిచేస్తున్నారో అది మీకు దొరుకుతుంది. మనం చేసే పని ఒక్కరోజు కూడా వ్యర్థము అవ్వదు. శ్రద్ధ గలవాడు ఐశ్వర్య వంతుడు అగును అని పరిశుద్ద గ్రంధం చెబుతుంది. దేశ వ్యాప్తంగా కరువు వున్నప్పుడు ఇస్సాకు విత్తనం వేసి నూరంతలుగా ఫలం పొందాడు. 

 

ప్రియమైన వారలారా మీరు సోమరి వలె ఉన్నారా? లేదా పని చేస్తూ ఉన్నారా? క్రమంగా పనిచేస్తే నిశ్చయముగా ఫలము కలుగుతుంది. కష్టాల్లో, వ్యతిరేక సందర్భాల్లో సోచోరో హోండా వలె, ఇస్సాకు వలె అలసి పోకుండా క్రమంగా పనిచేస్తూ ఉండాలి. ఆవిధంగా పనిచేస్తూ వున్నప్పుడు కొత్త కొత్త ప్రణాళికలు దొరుకుతాయి. మనము ముందుకు సాగుదాం.

- శ్రీమతి. అన్బు జ్యోతి స్టాలిన్

 

ప్రార్థన అంశం:-

మన తోటి సేవకులు పనిచేసే గ్రామాల్లో అద్భుత కార్యములు జరిగేలా ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al virüsbet medusabahis medusabahis giriş grandpashabet grandpashabet giriş jojobet jojobet giriş vaycasino vaycasino giriş pusulabet pusulabet giriş perabet perabet giriş perabet perabet giriş matbet slot oyna perabet perabet giriş hiltonbet perabet perabet perabet betnano holiganbet galabet kalebet holiganbet kingbetting kingbetting giriş lunabet lunabet giriş rulobet betpas atlasbet grandpashabet