Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 03.01.2021 (Kids Special)
Share:

By Village Missionary Movement

Sunday, 03-Jan-2021

దిన ధ్యానము(Telugu) 03.01.2021 (Kids Special)

నూతన మార్పు.

"ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పెను" - ప్రకటన గ్రంథం 21: 5

హాలో పిల్లలు! హ్యాపీ న్యూఇయర్. ఈ నూతన సంవత్సరంలో అడుగు పెట్టుటకు సహాయము చేసిన దేవునికి వందనములు చెల్లిద్దాం. ఈ 2021వ సంవత్సరంలో దేవుడు నూతన కార్యములు చేయుటకు శక్తిమంతుడై ఉన్నారు. మీరు వయస్సుకు తగినట్టు ఎదిగితేనే మీ తల్లిదండ్రులు సంతోషిస్తారు కదా! ఆలాగుననే యేసయ్యను కూడా సంతోష పెట్టాలి అంటే ఆయనకు ఇష్టమైన కార్యములు మనము చేస్తున్నామా? అటువంటి మంచి కార్యములు మనలో ఉన్నాయా అని యేసయ్య చూస్తున్నారు. యేసయ్య కు ఇష్టమైన కార్యములలో నీవు ఎదుగుతూ ఉన్నవా? 

ఒక వ్యాపారి తన వ్యాపారమును ముగించుకొని వచ్చే మార్గములో బస్ స్టాండ్ ఎదురుగా ఉన్న ఒక పెద్ద హోటల్ ను చూసారు. వెంటనే ఆయన ఈ హోటల్ చూచుటకు పెద్దదిగా ఉంది భోజనము కూడా సూపర్ గా ఉంటుంది అని ఆలోచించి వెళ్ళారు. టేబుల్స్ కాలిగా ఉన్నాయి, ఈగలు ఎక్కువగా ఉన్నాయి, ఆహారము సరిగా లేదు. ఆహారం నోట్లో పెట్టేసరికి వాంతి వచ్చేసింది. అయ్యో పెద్ద హోటల్లో భోజనము మంచిగా ఉంటుంది అని రావడం పొరపాటు అయిందే అని ఆలోచించి ఎలాగో కష్టపడి దానిని తిని ముగించి బయలుదేరారు. ఆ హోటల్ యొక్క నిర్వహము సరిగా లేదుకాబట్టి ఆ హోటల్ యొక్క విలువ కోల్పోయింది. 

2 సంవత్సరాలు తరువాత ఆ వ్యాపారి ఆ హోటల్ ను మరల చూసారు. అది చక్కగా అలంకరించబడి దాని ముందు చాలా కార్లు, బైకులు నిలబడిఉన్నాయి.  గుంపులు, గుంపులుగా ప్రజలు నిలబడివున్నారు. సరే లోపలకు వెళ్లి చూద్దాం అని లోపలకు వెల్లారు. అందరూ భోజనం చేస్తున్నారు. ఎటు చూసినా శుభ్రముగా ఉంది. ఆ మార్పునకు గల కారణము ఏమిటి అని చుట్టూ చూసారు. ఈ హోటల్ నూతన నిర్వహకులు క్రింద నడపబడుతుంది అని వ్రాసి ఉంది. ఒక మనిషి సరిగా ఉండేటప్పుడు ఎంతోమంది దీవించ బడుతున్నారు అని ఆ వ్యాపారి గ్రహించారు. 

ప్రియ తమ్ముడు చెల్లి ఈ నూతన సంవత్సరంలో ప్రభువా నన్ను సరిగా నడిపించండి, మీ నిర్వాహకము క్రింద నన్ను నడిపించండి అని మీరు ప్రార్ధించండి. మిమల్ని అనేకులకు దీవెన కరముగా వాడుకుంటారు. మీ జీవితంలో అనేక మార్పులు యేసయ్య మాత్రమే తీసుకు రాగలరు. దీనికి ఆమెన్ చెబుదామా ఆవును ఆమెన్ సూపర్. 
-    శ్రీమతి. జీవా విజయ్

ఈ దిన ధ్యానవాక్యం కొరకు ఈ క్రింద నoబర్లును సంప్రదించండి
వాట్సాప్ తమిళ్ కొరకు +91 94440 11864, 
ఇంగ్లీష్ కొరకు +91 86109 84002, 
హిందీ కొరకు +91 93858 10496
తెలుగు +91 94424 93250

ఈమెయిల్: reachvmm@gmail.com
Androidapp: https://play.google.com/store/apps/details?Id=com.vmmorg.template.msmapp&showAllReviews=true

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al perabet perabet giriş safirbet safirbet giriş betasus betasus giriş virüsbet medusabahis medusabahis giriş grandpashabet grandpashabet giriş jojobet jojobet giriş vaycasino vaycasino giriş pusulabet pusulabet giriş perabet perabet giriş perabet perabet giriş matbet slot oyna perabet perabet giriş hiltonbet perabet perabet perabet betnano holiganbet galabet kalebet holiganbet