Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 03.10.2021 (Kids Special)
Share:

By Village Missionary Movement

Sunday, 03-Oct-2021

దిన ధ్యానము(Telugu) 03.10.2021 (Kids Special)

 

గ్రామ మిషనరీ సంస్థ తరుపున ప్రత్యేకంగా చిన్న

 పిల్లలకు.

 

"పట్టపగలగువరకు వేకువ వెలుగు తేజరిల్లునట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును" - సామెతలు 4:18

 

హాయ్ పిల్లలు ఊరికి వెళ్లడం అంటే మీకు చాలా సరదా కదా! అందులో మీ మామయ్య లేదా అమ్మమ్మ ఇంటికి అంటే ఇంకా సరదా కదా! ఇలాగే దీపక్ అనే తమ్ముడు తన మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. మామయ్య వాళ్ళ ఇంట్లో ఉన్న చిన్న బాబుతో సంతోషంగా ఆడుకున్నాడు. మామయ్య దీపక్ ను షాప్ కు, పార్క్ కు ఇంకా చాలా స్థలాలకు తీసుకు వెళ్లారు. ఇదంతా దీపక్ కు చాలా సంతోషంగా ఉండేది. మామయ్య దీపక్ ను నువ్వు బైబిల్ చదివి ప్రార్థన చేస్తున్నావా? లేదా? దేవుని బిడ్డగా జీవిస్తున్నవా అని అడిగారు. అందుకు దీపక్ ఫ్రెండ్స్ తో జాలిగా గడిపి తరువాత యేసుక్రీస్తు యొక్క మార్గంలో నడుస్తాను మామయ్య అన్నాడు. అందుకు మామయ్య కూడా సరే అన్నారు. తరువాత మామయ్య, దీపక్ కలిసి కారులో దీపక్ వాళ్ళ ఊరికి బయలుదేరారు. ఊరి సమీపంలో రెండు దారులు ఉన్నాయి. ఒక దారి ఊరిలోనికి వెళ్తుంది, ఇంకొక దారి అడవిలోకి వెళ్తుంది. మామయ్య ఆ అడవిలోకి వెళ్లే దారిలోకి కారును డ్రైవ్ చేస్తూ వెళ్లారు. దానిని చూసిన దీపక్ మామయ్య ఈ దారి అడవిలోకి వెళ్తుంది ఇది సరైన దారి కాదు అన్నాడు. అందుకు మామయ్య నాకు తెలుసు దీపక్ అయితే ఈ అడవి చాలా అందంగా ఉంటుంది కొంచం దూరం వెళ్ళి ఈ అడవి యొక్క అందం చూసి అనదించి తిరిగి వెళ్ళిపోదాం సరేనా అన్నారు. సూర్యుడు అస్తమిస్తున్నాడు సాయంత్రం సమయం అడవి చాలా అందంగా ఉంది కాని దీపక్ కు మాత్రం భయం మొదలైంది. మామమ్య మామయ్య ఇంకా కొంత సేపట్లో చీకటి అవుతుంది నాకు చాలా భయంగా ఉంది తిరిగి వెళ్లిపోదామా అన్నాడు. ఇక్కడ భయంకరమైన అడవి మృగాలు ఎన్నో ఉన్నాయో కదా దేనినైనా ఒక దానిని చూసి వెళ్లిపోదాం అన్నాడు. అందుకు దీపక్ చెప్పాడు మామయ్య ఏనుగు వస్తే మన కారును కూడా త్రొక్కి చిదిమేస్తుంది. క్రిందటి వారం చిరుతపులి ఒకటి చెట్టు వెనకనుండి వచ్చి ఒక అతనిని చంపేసింది రండి మామయ్య తిరిగి వెళ్లిపోదాం అన్నాడు. వెంటనే మామయ్య దీపక్ తో నీవు మాత్రం ఈ లోక సంతోషాన్ని కొన్ని రోజులు అనుభవించి తరువాత క్రీస్తు దారిలో నడుస్తాను అని చెప్పావు నీవు మరల వెనకకు రవడానికంటే ముందు అది నీ ఆత్మను నాశనం చేసేస్తుంది కదా కాబట్టి ఈరోజు నుండి యేసయ్య బిడ్డ వలె జీవిస్తవా? అని అడిగారు. అప్పుడు దీపక్ తన తప్పును తెలుసు కున్నాడు. ప్రియమైన తమ్ముడు చెల్లి మీరుకుడా యేసయ్యకు ఇష్టమైన మార్గంలో నడుస్తారు కదా? థాంక్యూ. హొలీ లైఫ్ ఈస్ ఏ జాలీ లైఫ్.

- సిస్టర్. ఏ. బ్యూలా

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al holiganbet giriş holiganbet padişahbet bets10 extrabet royalbet süperbetin padişahbet betcio royalbet casinoroyal queenbet bahiscasino betcio bahiscasino atlasbet padişahbet betpas bahiscasino celtabet queenbet casibom jojobet jojobet casibom holiganbet restbet safirbet