Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 30.09.2021
Share:

By Village Missionary Movement

Thursday, 30-Sep-2021

దిన ధ్యానము(Telugu) 30.09.2021

 

అంశం:- లోటు గల మార్గదర్శి

 

"నా కొండ నాకోట నీవే నీ నామమునుబట్టి త్రోవ చూపి నన్ను నడిపించుము నా ఆశ్రయదుర్గము నీవే" - కీర్తనలు 31: 3

 

సహోదరుడు భక్త సింగ్ కెనడా దేశంలో ఒక ఆరాధనలో పాల్గొని బయటకు వస్తున్న సమయంలో ఆయనకు తెలియని ఒక అతను తొందరగా పరిగెత్తుకొని వచ్చి ఆయన చేతిని పట్టుకొని సహోదరుడా మీరు ఎందుకు ఇండియాకు వెళ్లి అక్కడ సువార్తను ప్రకటించ కూడదు అని అడిగాడు. అందుకు భక్త సింగ్ నేను ఒక ఇంజినీర్ ఈ ఇంజినీరింగ్ పనులు నేర్చుకోనుటకు చాలా సంవత్సరాలుగా చదువుతున్నాను. ఇంకా నాకు నత్తి, నేను ఒక చిన్న సమావేశం ముందు నిలబడి మాట్లాడలేను. వేదిక అంటే భయం సిగ్గు కూడా నా వలె నా కాళ్ళు చాలా వణుకుతాయి. ఇన్ని లోపములు గలవాడిని నేను ఎలా ప్రసంగికుడును కాగలను అని చెప్పారు. కాని చివరికి ఈయన ఇండియాలో కొన్ని లక్షల ప్రజలకు ఆశీర్వాదంగాను దేవునిలో అనేకులకు నడిపించే పరిశుద్ద మార్గదర్శి గాను మారి బలముగా వాడబడ్డారు. పరిశుద్ద గ్రంధంలో మోషే అనే వ్యక్తి నోటి మాంద్యము, నాలుక మాంద్యము గలవాడు కాని యెహోవా ఈయన ద్వారా కొన్ని వేల ఇశ్రాయేలీయులను నడిపించుకొని వెళ్లుటకు అధికారిగాను, మార్గదర్శిగాను, ఉపాధ్యాయుని గాను ఆయనను ఏర్పరుచుకున్నారు. మోషే చేతి ద్వారా ఇశ్రాయేలీయుల ఎదుట చాలా అద్బుతములు, అతిశయా కార్యములు చేశారు. మోషే దేవుని వలన సాత్వికుడు, నీతిమంతుడు అనే పేరు సంపాదించుకున్నాడు కాని చివరికి కానాను దేశమును సొంతం చేసుకోలేకపోయాడు. కారణం మోషేతో యెహోవా బండను చూసి మాట్లాడ మని చెప్పారు. కాని మోషే మాత్రం తన కర్రతో ఆ బండను రెండు మార్లు కొట్టాడు. అందువలన మోషే తన యొక్క సహనము కోల్పోయి కోపాన్ని బయలు పరుచుకొనుట మనం గ్రహించ గలం. ఇందువలననే మోషే కానాను కు ప్రవేశించలేకపోయాడు. దీనిని చదువుతున్న మీరు మీ కుటుంబానికి మంచి దారి చూపించే వారిగాను, గురువుగాను ఉండవచ్చు. మనలో కూడా కోపం, చేదు, ఏర్పడినప్పుడు ఆ సమయంలోనే మనలను మనము సరిచేసు కుందాం లేదంటే గొప్ప ఆశీర్వదాన్నీ కోల్పోతాము. ఇంక దేవుడు మన అందరిని దారి చూపించుటకు మనలను గురువులా ఏర్పరుచుకున్నారు. చీకటిలో, పాపములో బ్రతుకుతున్న ప్రజలను కాపాడే మార్గదర్శకులుగా ఆయన నామన్ని తెలియజేసే గురువులుగా మనలను నియమించి ఉన్నారు. మనం లోటు గల మార్గదర్శకులుగా ఉన్నప్పటికీ దేవుడు మనలను మంచి మార్గదర్శకులుగా జీవించుటకు మనకు నిశ్చయముగా సహాయం చేస్తారు. 

- శ్రీమతి. శక్తి శంకర్ రాజ్

 

ప్రార్థన అంశం.

మన పరిచర్యలో నూతనంగా కలిసిన సేవకులకు దేవుడు ఒకే విధమైన దర్శనము దయచేయు లాగున ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al