Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 28.09.2021
Share:

By Village Missionary Movement

Tuesday, 28-Sep-2021

దిన ధ్యానము(Telugu) 28.09.2021

 

అంశం:- తయారు అవుటకు సమర్పించుము.

 

"గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే నిన్నెరిగితిని, నీవు గర్భమునుండి బయలుపడక మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించితిని" - యిర్మియా 1:5

 

వ్యవసాయకుడు ఒకరు తన పొలమును రెండవ మారు దున్నుతున్నారు. దానిని చూచిన పట్టణస్తుడు ముందే మీ పొలమును దున్నేసారు కదా మరి రెండవ మారు ఎందుకు దున్ని మీ ప్రయసమును, సమయాన్ని వ్యర్ధపరుచు కుంటున్నారు అని అడిగాడు. అందుకు ఆ వ్యవసాయకుడు మొదటి సారి దున్నేటప్పుడు మట్టిలో కొన్ని భాగాలు కఠినముగా కనబడింది. అందువలన నేను విత్తే విత్తనాలు పరిపూర్ణ ఫలితాన్ని ఇవ్వలేవు . కాని రెండవ మారు దున్నినప్పుడు దాంట్లోగల కఠినత్వం మారి విత్తనములు సులువుగా వేరు పట్టి మోలుచుటకు సహాయపడి మంచి ఫలితాన్ని ఇవ్వగలదు అన్నారు.

 

కన్నీటి ప్రవక్త అని పిలవబడే వ్యక్తి యిర్మీయా. దేవుడు అతనిని తల్లి గర్భంలో రూపించబడక మునుపే ఎరిగి పరిశుద్ద పరచి ప్రజలకు ఆయన ప్రవక్తగా పంపించారు. ఆయన పసిప్రాయంలో ఉండేటప్పుడే రాజ్యములను పడగొట్టుటకును, స్థిరపరచుటకును దేవుడు అతనికి అధికారం ఇచ్చారు. దేశంలో ప్రజలు పాపం చేస్తున్నపుడల్లా ఈయన హెచ్చరించేవాడు కాని ఎవ్వరూ ఈయన మాటను పట్టించుకోలేదు. మారుగా ఆయనను చిత్రహింసలు పెట్టి చాలా కష్ట పరిచారు. ఇలా చేసిన గాని ఆయన ప్రజల మీద ఎంత మాత్రం ద్వేషం చూపించకుండా ఆ ప్రజలు దేవుని ఉగ్రతనుండి విమోచించబడేటట్లు చివరి వరకు పోరాడారు. వాళ్ళ కొరకు కన్నీరు కారుస్తూ విలాపించి ప్రార్ధించాడు. చివరి వరకు వాళ్లకు దేవుని మాటలు చెప్పి హెచ్చరించి వచ్చాడు. దేవుడు ఎదురు చూస్తున్న గుణాతిశయం కుడా ఇదే. 

 

ప్రియమైన దేవుని పిల్లలారా! మిమ్మును కూడా దేవుడు సృష్టించినప్పుడు కొన్ని కఠినమైన పరిస్థితుల్లో నడిపించవలసి ఉంటుంది. వీటన్నింటి ద్వారా దేవుడు దేశంలో గొప్ప కార్యములు చేయుటకే అని దానిని గ్రహించండి. అటువంటి క్లిష్టమైన పరిస్థితుల్లో ప్రభువా మీ చిత్తాన్ని జరగనివ్వండి అని సమర్పించినప్పుడు నెల మంచి ఫలం ఇవ్వడానికి ఎలా మార్చరో అలాగే యిర్మీయా వలె ఇతరుల కొరకు ఏడుస్తూ ప్రార్ధించే మంచి గుణాతిశయం మనలో కూడా దయ చేస్తారు. వీటన్నింటి నేను సహించ లేను అని చెప్పి పారిపోయిన యెడల మన వలన దేవునికి ఎంత మాత్రం ప్రయోజనము లేదు. 

- బ్రదర్. కె. మనోజ్ కుమార్

 

ప్రార్థన అంశం:-

మీడియా ద్వారా జరుగుతున్నా పరిచర్య ద్వారా దేవుడు అనేకులను తన వైపు త్రిప్పు కొనేటట్లు ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al perabet perabet giriş safirbet safirbet giriş betasus betasus giriş virüsbet medusabahis medusabahis giriş grandpashabet grandpashabet giriş jojobet jojobet giriş vaycasino vaycasino giriş pusulabet pusulabet giriş perabet perabet giriş perabet perabet giriş matbet slot oyna perabet perabet giriş hiltonbet perabet perabet perabet betnano holiganbet galabet kalebet holiganbet