By Village Missionary Movement
Thursday, 23-Sep-2021దిన ధ్యానము(Telugu) 23.09.2021
అంశం: లూకా
"లూకా మాత్రమే నా యొద్ద ఉన్నాడు" - 2తిమోతికి 4:11
డేని అనే చిత్రకారుని బల్ల మీద ఉన్న పేపర్ మరియు పెన్సిల్ కొన్ని రోజులలోనే స్నేహితులయ్యారు. ఒక రోజు డేని కుర్చీలో కూర్చొని పెన్సిల్ తీసిన వెంటనే పేపర్ ఏడుస్తూ నేను రాను అన్నది. అప్పుడు డేని వేరే పేపర్ ను తీసుకొని చిత్రించడం ప్రారంభించాడు. పెన్సిల్ దానిని చూసి ఎందుకు నువ్వు ఏడ్చావు అని పేపర్ అడిగింది. డేని నిన్ను చేతిలోకి తీసుకొని పదునైన ఆయుధంతో నిన్ను పదును పెట్టి నిన్ను బాధపెడతాడు అప్పడు నేను వస్తే ని పదునైన ముళ్ళు నన్ను గుచ్చుతుంది, నాకు నొప్పిపెడుతుంది అంత మాత్రమే కాదు నేను నా పరిశుభ్రతను కోల్పోతున్నాను అన్నది. అప్పుడు పెన్సిల్ చెప్పింది మనం కష్టపడితేనే చాలా అందం గల వారుగాను, సహనం గల వారుగాను మారుతాం. నేను పదునైన ముళ్లుగా ఉంటూ ఎంతో అందమైన చిత్రం గీయగలుగుతున్నాను. నీవు తెల్లగా ఉండుట కంటే నీ పైన చాలా డిసైన్ చిత్రించడం ఎంతో గొప్ప. ధరలో గౌరవం పొందుకున్న దానిగా మారుతావు మరి అది నీకు గొప్ప తనమే కదా అన్నది. ఈ పేపర్ వలె మనుష్యులు మనలను కష్ట పెట్టినప్పుడు మనం విడిచిపెట్టి పారిపోవలి అని ఆలోచిస్తాం కానీ అపోస్తూలకార్యములలో లూకా అనే దేవుని వ్యక్తి ఎటువంటి కష్టమైన పరిస్థితుల్లో అయిన పౌలుతో కలసి తన సేవను నెరవేర్చారు. పౌలు సువార్త నిమిత్తం చెరసాలలో బందించబడిన కూడా లూకా ఆయనను విడిచి పారిపోకుండా తనతో కలిసి ఉన్నారు. లుకా ఒక వైద్యుడు బాగా చదువుకొని సమాజంలో మంచి స్థానంలో వున్నప్పటికీ క్రీస్తు పై ఉన్న ప్రేమ నిమిత్తము అన్ని పరిస్థితుల్లో పౌలు తో ఉన్నారు. తిమోతికి చెరసాలలో నుండి రాసిన రెండవ పత్రికలో 4:11లో పౌలు చెబుతున్న మాట లూకా మాత్రమే నా యొద్ద ఉన్నాడు. తన ప్రతి రోజు జీవితంలో క్రీస్తు స్వభావమును కనపరిచారు లూకా.
ప్రియమైన వారలారా! లూకా యొక్క జీవితమునుండి మనము నేర్చుకున్న విషయాలు మన జీవితంలో కూడా ఉన్నాయా అని అలోచిద్దాం. అన్ని పరిస్థితుల్లో సువార్తను సిగ్గు పడకుండా బోధించేవాడిగా ఉన్నారు. క్రీస్తు నిమిత్తం బందింప బడిన పౌలుకు సహాయకునిగా ఉన్నారు. మనం కూడా అన్ని పరిస్థితుల్లో సేవకులకు సహాయపడదామ. వారి యొక్క కష్టాలలో సిగ్గుపడకుండా వారితో కలిసి భుజం తట్టేవారి వలె ఉందమా. లూకా ఆ విధముగా ఉండడం వలన యేసుక్రీస్తు శిష్యునిగా లేనప్పటికీ కూడా రెండు పుస్తకాలను రాయుటకు పరిశుద్ధాత్ముడు తోడై ఉండి నడిపించారు. అదే విధంగా మనం కూడా ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు ఈ లోకంలో, పరలోకంలో కూడా మనలను హెచ్చిస్తారు అనే దానిలో సందేహమే లేదు.
- శ్రీమతి. అన్బు జ్యోతి స్టాలిన్
ప్రార్థన అంశం:-
మన న్యూ లైఫ్ హోమ్ లో ఉన్న పిల్లల యొక్క కళాశాల విద్యల కొరకు ప్రార్థిద్దాం.
*Whatsapp*
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.
ఈమెయిల్: reachvmm@gmail.com
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250