Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 02.01.2021
Share:

By Village Missionary Movement

Saturday, 02-Jan-2021

దిన ధ్యానము(Telugu) 02.01.2021

మీరు ఎవరు?

"మీ హృదయమును కలవరపడనియ్యకుడి... నేను మరల వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మును తీసుకుని పోవుదును" - యోహాను 14:1-3

"If you" అనే ఇంగ్లీష్ కవితలతో నిండిన పుస్తకాల్లో పరలోకంలో జరిగిన సంభాషణ వ్రాయబడి ఉంది. దాంట్లో  ఒకాయన తాను చూచిన కలలో వెలుగుతో నిండిన పాలరాయి వంటి నీళ్లు పారుతున్న ఒక    స్థలములో  కూర్చొని యుండుట చూసారు. అప్పుడు ఆయన వీపు వెనక ఒక ఆయన వచ్చి సహోదరుడా దేవునికి వందనములు అన్నారు. మీరు ఎవరు? మిమ్మల్ని నేను చూచి నట్లు గుర్తు లేదు అని అన్నారు మొదటి వ్యక్తి. లేదు మీరు నన్ను చూచి యున్నారు. మీరు మా వీధుల్లో పంచిన సువార్త కర పత్రికలు చదువుట వలన నేను యేసు క్రీస్తును నా సొంత రక్షకునిగా అంగీకరించాను.  ఈ రోజు పరలోకములో ఉండుటకు ప్రధానమైన కారణము అని చెప్పి సంతోషించారు. 

ఆవును అపోస్తులుడైన పౌలు కొరింథీ సంఘమునకు వ్రాస్తున్నప్పుడు , మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థముకాదని ఎరిగి, స్థిరులును, కదలనివారును, ప్రభువు కార్యాభివృద్ధియందు ఎప్పటికిని ఆసక్తులునైయుండుడి"(1కోరింథీయులకు 15: 58) అన్నారు. మనము ప్రభువు యొక్క రాజ్యాభివృద్ధి కొరకు చేస్తున్న పనిని  అది చిన్నదైనా, పెద్దదైనా అది వ్యర్థము కాదు ఖచ్చితంగా ఫలితం ఉంటుంది.  మనం పరలోకానికి వెళ్ళేటప్పుడు పైన చెప్పబడిన అనుభవాన్ని ఖచ్చితంగా చవిచూస్తాం అన్న దానిని విశ్వసించండి. కాబట్టి మీరు చేసే పరిచర్య ఏదైనా దాంట్లో మీరు బాధపడవద్దు. మీరు ఎంతమందికి సువార్త ప్రకటించారు, ఎంత మందికి హాస్పటల్లో సువార్తను ప్రకటించారో వాళ్ళను ఒక దినము పరలోకంలో చూడబోతున్నాము అని విశ్వసించి సంతోషించండి.

భళా నమ్మకమైన మంచి దాసుడా అని మన యజమానుడు మనలను ఘనపరచి మనకు కిరీటం ధరింపజేసే దినము దగ్గరగా ఉంది. మనకు ఇవ్వబోతున్న కిరీటంలో అలంకరించబడిన ప్రతి ముత్యము కూడా ప్రతి ఆత్మను గుర్తు చేస్తుంది. మీరు సువార్త ప్రకటించి మర్చిపోయిన వాళ్ళు మిమ్మల్ని దర్శించబోతున్నారు. మీరు ఎవరు అని అడిగినప్పుడు మీరు ప్రకటించిన సువార్త వలన మేము రక్షించబడిన వారము అని చెబుతారు. అదినము చాలా దగ్గరగా ఉంది. హల్లెలయా!
-    బ్రదర్. టి. జాకబ్ శంకర్

ప్రార్థన అంశం:
నూతన మిషనరీలను తయారు చేసే సంవత్సరంగా పిలవబడుతున్న ఈ సంవత్సరంలో అనేక మంది సేవకులు తయారు అయ్యేటట్లు  ప్రార్థిద్దాం.

ఈ దిన ధ్యానవాక్యం కొరకు ఈ క్రింద నoబర్లును సంప్రదించండి
వాట్సాప్ తమిళ్ కొరకు +91 94440 11864, 
ఇంగ్లీష్ కొరకు +91 86109 84002, 
హిందీ కొరకు +91 93858 10496
తెలుగు +91 94424 93250

ఈమెయిల్: reachvmm@gmail.com
Androidapp: https://play.google.com/store/apps/details?Id=com.vmmorg.template.msmapp&showAllReviews=true

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al perabet perabet giriş safirbet safirbet giriş betasus betasus giriş virüsbet medusabahis medusabahis giriş grandpashabet grandpashabet giriş jojobet jojobet giriş vaycasino vaycasino giriş pusulabet pusulabet giriş perabet perabet giriş perabet perabet giriş matbet slot oyna perabet perabet giriş hiltonbet perabet perabet perabet betnano holiganbet galabet kalebet holiganbet